Home /News /andhra-pradesh /

TIRUPATI WILL POWER STAR PAWAN KALYAN AND MANHCU MOHAN BABU JOINTLY WORK IN ELECTIONS IS IT POSSIBLE NGS TPT

AP Politics: మెగా మంచు ఫ్యామిలీలు కలుస్తాయా? పవన్-మోహన్ బాబు కలిసి నడవడం సాధ్యమేనా?

పవన్ కళ్యాణ్ వర్సెస్ మోహన్ బాబు (File/Photos)

పవన్ కళ్యాణ్ వర్సెస్ మోహన్ బాబు (File/Photos)

AP Politics: వచ్చే ఎన్నికల్లో మెగా, మంచు ఫ్యామిలీలు ఒక్కటవుతాయా..? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలసి మంచు మోహన్ బాబు కలిసి నడవడం సాధ్యమేనా..? ఇటీవల మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఈ చర్చను తెరపైకి తెస్తోంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
  GT Hemanth Kumar, News18Tirupati

  AP Politics;  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో సినిమా స్టార్లను విడదీసి చూడలేం.. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు..  హీరోయిన్లు.. సీనియర్ నటులు రాజకీయాల్లో తమ లక్ ను పరీక్షించుకున్నారు. కొందరు విజయం అందుకోగా.. మరికొందరు గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఏపీ రాజకీయాల్లో (AP Politics) మరో టాలీవుడ్ కాంబినేషన్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) చూపంతా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) వైపే ఉంది. ఆయన 2019కి ముందు  టీడీపీ (TDP)లో కొనసాగారు. ఇద్దరి మధ్య విబేధాల కారణంగా.. ఎన్నికల కోడ్ అమలులోఉన్న సమయంలో రోడ్డుపైకి వచ్చి ధర్నా చేపట్టారు. 2019లో ఫీజు రీఇంబుస్మెంట్ రాలేదని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.  ఆ ఎన్నికల్లో చంద్రబాబు (Chandrababu)ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీకి చాలా చోట్ల సహకరించారనే ప్రచారం కూడా ఉంది. ఎన్నికల తరువాత టీడీపీ ఘోరంగా ఓడిపోవడం..  వైసీపీ అధికారం చేపట్టడం జరిగింది. అయితే సీఎం జగన్ (CM Jagan) బంధువు కావడంతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంత బాగానే ఉన్న పార్టీలో చేరిన నాటి నుంచి మోహన్ బాబుకు అంత ప్రియారిటీ ఇవ్వలేదనే టాక్. దింతో వైసీపీ తో టచ్ మీ నాట్ గా ఉంటూ వచ్చారు మోహన్ బాబు.

  2019 ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన కేసుకు సంబంధించి ఇటీవల మోహన్ బాబు  కోర్టుకి హాజరయ్యారు. ఆ సమయంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఆ ర్యాలీ పోటికల్ ఎంట్రీకి సూచికంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన రాజకీయ భవిష్యత్తుపై సన్నిహితులకు క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. తాను ప్రస్తుతం బీజేపీ మనిషి అని వారికి స్పష్టంగా చెప్పారు.  మరి అదే నిజమైతే.. మోహన్ బాబు బీజేపీలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ తో కలిసి నడవక తప్పదు.. మరి  ఒకే కత్తితో రెండు వరలు ఇమడగలవా. 

  ఏపీ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు తనవంతు సహకరాం అందించారు.  2019లో టీడీపీ తో పొత్తు వీడి.... కమలంతో పొత్తు పెట్టుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు జనసేన బిజెపి మధ్య బలమైన బంధం కొనసాగుతోంధి. అనేక సందర్భాలలో తమది విడదీయని బంధం అంటూ బీజేపీ నేతలు చెబుతూనే వస్తున్నారు. బీజేపీ జాతీయ పెద్దలు సైతం పవన్ మాటకు గౌరవం ఇస్తారనే ప్రచారం ఉంది.

  ఇదీ చదవండి : ఆ ఇద్దరు సీనియర్ నేతలు ఏమయ్యారు? రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నా మౌనంగా ఎందుకున్నారు?

  మరి తన బద్ధ శత్రువైన మోహన్ బాబు.. బీజేపీలో చేరిన పవన్ ఆయనతో కలిసి పని చేయడానికి ఇష్ట పడతారా..? వచ్చే ఎన్నికల్లో బీజేపీ -జనసేన కలిసే పోటీ చేస్తాయని కమలం నేతలు పదే పదే చెబుతున్నారు. కొందరు అయితే ఓ అడుగు ముందుకు వేసి తమ ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ అంటున్నారు కూడా.. అదే జరిగితే ప్రచార సమయంలో పవన్ ను మోహన్ బాబు పొగడక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి.. అందుకు మంచు ఫ్యామిలీ సిద్ధంగా ఉంటుందా..?

  ఇదీ చదవండి : అధికార వైసీపీకి మరో షాక్ తప్పదా..? జనసేన వైపు ఆ కీలక నేత చూపు..

  పవన్ కళ్యాణ్- మోహన్ బాబు ఇద్దరి మధ్య కొన్నేళ్ల నాటి వైరం కొనసాగుతూ వస్తుంది. వీరి మధ్యనే కాదు... వీరి అభిమానుల మధ్య కూడా ఇదే పరిస్థితి. తెలుగు సినిమా పరిశ్రమ వజ్రోత్సవాల వేడుకల్లో చీరంజీవి పై అనుచిత వ్యాఖ్యలు చేసారు. దింతో స్టేజిపైకి వచ్చిన పవన్ కళ్యాణ్ "తమ్ముడు మోహన్ బాబు అంటూ" వ్యాఖ్యలు చేసారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సఖ్యత లేదు.

  ఇదీ చదవండి: ప్రధాని రాకతో క్యాడర్ లో జోష్ వస్తుందా.. వైసీపీకి మోదీ ఇచ్చే సంకేతమేంటి?

  ఇటీవల  మా ఎన్నికల సమయంలో మెగా మంచు కుటుంబాల మధ్య గొడవ పీక్స్ కి చేరుకుంది. ఈ ఘటనతో ఎప్పుడు విమర్శలు చేయని మంచు మనోజ్ సైతం నాగబాబు పై వ్యాఖ్యలు చేసారు. ఇక పలు టివి షోల్లో చిరంజీవి మాట ఎత్తితేనే నిశ్శబ్దంగా ఉండిపోయే వాడు. కానీ బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనని పవన్ కళ్యాణ్.... మోహన్ బాబు బిజెపికి జై కొడితే ఒకే  వేదికపై ఇద్దరు ఎలా స్టేజ్ పంచుకుంటారో చూడాలని ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇక పవన్ తిరుపతి ఎమ్మెల్యే స్థానికి పోటీచే మోహన్ బాబు ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Manchu mohan babu, Pawan kalyan, Tirupati

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు