TIRUPATI WILL MINISTER ROJA FULFILL THE LONG TIME DRAM OF TIRUPATI PEOPLE FULL DETAILS HERE PRN TPT
Minister Roja: రోజా ఆ పనిచేస్తే ఇక తిరుగుండదు..! చరిత్రలో నిలిచిపోవడం ఖాయం..!
మంత్రి రోజా (File)
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని ప్రముఖ నగరాల్లో తిరుపతి ఒకటి. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరుడి పాదాలచెంత ఉన్న తిరుపతి (Tirupati)కి అన్ని హంగులున్నాయి.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని ప్రముఖ నగరాల్లో తిరుపతి ఒకటి. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరుడి పాదాలచెంత ఉన్న తిరుపతి (Tirupati)కి అన్ని హంగులున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, స్మార్ట్ రైల్వే స్టేషన్ ఇలా ఓ మంచి నగరానికి కావలసిన సౌకర్యాలున్నా.. ఒక్కటి మాత్రం స్థానికులకు కలగానే మిగులుతోంది. అదే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. ఎన్నో ఏల్ల నుంచి కలగా ఉన్న స్టేడియంపై మళ్లీ ఆశలు చిగురించాయి. ఇందుకు ప్రధాన కారణం మంత్రి రోజా. తిరుపతి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి 9ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కిరణ్ స్వయంగా రంజీ ప్లేయర్ కావడంతో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి పూనుకున్నారు. ఇందుకోసం జూ పార్క్ సమీపంలో ఎస్వీ యూనివర్సిటీకి చెందిన 30 ఎకరాల భూమిని, రూ.30కోట్ల నిధులను కేటాయిచారు.
పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన తిరుపతిలో ఆంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ మ్యాచ్లు కచ్చితంగా నిర్వహించే అవకాశం ఉంది. తిరుపతి ప్రతిష్ట మరింత పెరుగుతుందని అందరూ అప్పట్లో సంబరపడ్డారు. అయితే ప్రతిపాదిత స్థలం తిరుమల గిరుల పాదభాగంలో వుండడం, శేషాచల అడవుల్లో భాగం కావడంతో పర్యావరణపరంగానూ, తిరుమల భద్రత పరంగానూ పలువురి నుంచీ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణకు ఆదేశించడంతో తాత్కాలికంగా పెండింగ్లో పడింది.
సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేయడం, రాష్ట్ర విభజన వంటి పరిణామాలు జరిగాక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అంశం మరుగున పడిపోయింది. అయితే 2015 జనవరి 30న ఎన్జీటీ కొన్ని షరతులు విధిస్తూ ప్రతిపాదిత భూముల్లో స్టేడియం నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది. ప్రత్యామ్నాయ స్థలం చూడాలని అప్పటి సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తిరుపతి విమానాశ్రయ సమీపంలో 25 ఎకరాల భూమిని గుర్తించారు. అంతటితో అంతర్జాతీయ మైదానం విషయం మరుగున పడింది. శ్రీకాళహస్తి నుంచీ దివంగత పీఆర్ మోహన్ శాప్ ఛైర్మన్గా వ్యవహరించినప్పటికీ ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. రాష్ట్రంలో ప్రభుత్వలు మరీనా ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు.
రోజా రాకతో చిగురించిన ఆశలు
రోజా క్రీడల మంత్రి కావడంతో జిల్లా వాసులకు స్టేడియంపై ఆశలు చిగురించాయి. రాజకీయాల్లో చొరవ కలిగిన రోజా ఈ అంశాన్ని చేపట్టి, స్టేడియం నిర్మించడం ద్వారా తిరుపతి చరిత్రలో తన పేరును చిరస్థాయిగా నిలుపుకోవాలని జనం కోరుతున్నారు. రోజాతోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కళ సాకారం అవుతుందని ఆశపడుతున్నారు. చెదలు పట్టి మరుగున్న పడ్డ ఫైలును బయటకు తీసి జిల్లా వాసుల కోరిక మంత్రి రోజా నెరవేరుస్తారో..? ఫైల్ లో కొత్తబాగమైన ముందుకు తీసుకెళ్తారో.... లేదో వేచి చూడాలి..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.