Home /News /andhra-pradesh /

Sad Story: కట్టుకున్నవాడి కోసం ఈమె చేస్తున్నపనికి కన్నీళ్లు ఆగవు..! ఇంతకీ ఏం జరిగిందంటే..!

Sad Story: కట్టుకున్నవాడి కోసం ఈమె చేస్తున్నపనికి కన్నీళ్లు ఆగవు..! ఇంతకీ ఏం జరిగిందంటే..!

భర్త కోసం గాలిస్తున్న మహిళ

భర్త కోసం గాలిస్తున్న మహిళ

ఇటీవల కురిసిన వర్షాలకు ఆంధ్రప్రదేశ్ (Andhra Padesh)లోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు అతాలకుతలమయ్యాయి. ఈ నాలుగు జిల్లాల్లో గ్రామాలు, పట్టణాలు నీటమునిగాయి. భారీ వరదలతో తీవ్ర ఆస్థి, ప్రాణ, పంట నష్టం జరిగింది.

  GT. Hemanth Kumar, Tirupathi, News18

  ఇటీవల కురిసిన వర్షాలకు ఆంధ్రప్రదేశ్ (Andhra Padesh)లోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు అతాలకుతలమయ్యాయి. ఈ నాలుగు జిల్లాల్లో గ్రామాలు, పట్టణాలు నీటమునిగాయి. భారీ వరదలతో తీవ్ర ఆస్థి, ప్రాణ, పంట నష్టం జరిగింది. 30మందికి పైగా వరదలకు (AP Floods) బలయ్యారు. కళ్లముందే అయినవాళ్లు నీటిలో కొట్టుకుపోయారు. తమ వారి ఆచూకీ కోసం ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతున్న నేతలున్నారు. కానీ కడప జిల్లాలో జరిగిన ఓ సంఘటన భార్యాభర్తల బంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు అద్దం పడుతోంది. వివాహేతర సంబంధాల మోజులో భర్తలను కడతేరుస్తున్న భార్యలున్న ఈ రోజుల్లో.. కట్టుకున్నవాడి ఆచూకీ కోసం వెతుకులాట సాగిస్తోంది ఓ భార్య. వరదనీటిలో కొట్టుకుపోయిన తన భర్త కోసం ఊరూరా తిరుగుతూ గాలిస్తోంది.

  వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా రాజంపేట మండలం గుండ్లూరుకు చెందిన ఓ మహిళ భర్త.. ఇటీవల వచ్చిన వరదకు చెయ్యేరు చెరువుకు వచ్చిన వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు. తన భర్తను వెతికిపెట్టాలని రెవెన్యూ అధికారులతో పాటు రెస్క్యూ సిబ్బందిని వేడుకుంది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తానే స్వయంగా రంగంలోకి దిగింది. కనిపించిన అధికారులందరినీ నా భర్త ఎక్కడ సారూ అంటూ వేడుకొంటోంది. అంతేకాదు కనిపించిన వారినల్లా తన భర్తను చూశారా అంటూ దీనంగా అడుగుతోంది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాలు, వాగులు వంకల వెంట భర్త కోసం తిరుగుతున్న దృశ్యాలు అందర్నీ కంటతడి పెట్టిస్తున్నాయి.

  ఇది చదవండి: చంద్రబాబు అలాంటోడే..! ఎమ్మెల్యే రోజా ఫైర్.. ఆ విషయంలో తగ్గేదేలేదన్న ఫైర్ బ్రాండ్..!  ఎన్నికలప్పుడు అయ్యా, అమ్మా అంటూ ఓట్ల కోసం వచ్చే నాయకులకు ఇప్పుడు ప్రజల కష్టాలు కనిపించవా అంటూ మహిళ పెడుతున్న ఆక్రన్దనలు తో అందరూ చలించి పోయారు. వర్షాలు కురుస్తున్నప్పుడు డ్యామ్ గేట్లు తెరవాల్సిన అధికారులు నిమ్మకుండి పోయారని, పోయే కాలం వచ్చింది సారు అంటూ మహిళ మాట్లాడుతున్న మాటలు ఆమె ఆవేదనకు అద్దం పడుతున్నాయి.

  ఇది చదవండి: వీళ్ల వేషాలు చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం..! ఈ విచిత్ర సాంప్రదాయం ఎక్కడంటే..!


  తన భర్త ఎక్కడ ఉన్నాడో తెలియదు. బ్రతికి ఉన్నాడా లేదా అని తెలియని పరిస్థితి. కానీ తన భర్త దొరికే వరకు వెతుకుతూనే ఉంటాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది. వానాకాలంలో కొంత నీటిని చెరువు నుంచి బయటకు విడుదల చేసి ఉంటే ఈ ప్రమాదంలో నా భర్త ఇరుక్కు పోయేవాడు కాదని ఆవేదన చెందింది. పోలీసులను కలిస్తే పై అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారని.., వారి ఫోన్ నంబర్లు తన దగ్గర ఎందుకుంటాయని దీనంగా ప్రశ్నిస్తోంది. దయచేసి తన భర్త ఎక్కడున్నాడో ఇకనైనా గాలించి చెప్పాలని అధికారులను వేడుకుంటోంది.

  మీ నగరం నుండి (​తిరుపతి)

  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Floods, Kadapa, Wife and husband

  తదుపరి వార్తలు