Home /News /andhra-pradesh /

TIRUPATI WIFE KILLED HUSBAND IN ANANTAPURAM DISTRICT AS HE HARASSING HER OVER THE YEARS FULL DETAILS HERE PRN TPT

Wife and Husband: భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన ప్రభుత్వ పథకం.. ఆధార్ కార్డు వద్ద మొదలై హత్య వరకు వెళ్లింది..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఓ జంట ఒకే ఇంట్లో ఉంటూ కూడా మాట్లాడుకోవడం మానేశారు. చివరకు ఏపీ ప్రభుత్వం తెచ్చిన పథకం (AP Government Scheme) భార్యాభర్తల మధ్య రాజుకున్న అగ్గికి ఆజ్యం పోసింది. భర్త ఆధార్ కార్డ్ (Aadhar Card) వద్ద మొదలైన గొడవ చివరకు హత్యకు దారి తీసింది.

ఇంకా చదవండి ...
  GT Hemanth Kumar, Tirupati, News18

  పచ్చని కాపురాల్లో చిన్నచిన్న కలహాలు చిచ్చురేపుతున్నాయి. మూడుముళ్ల బంధంతో అగ్నిసాక్షిగా వివాహ బంధంతో ఒక్కటైన జంటలు ఒకర్ని ఒకరు అర్ధం చేసుకోలేక కాపురాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నాయి. క్షణికావేశంలో తీసుకొనే నిర్ణయాలు వారి జీవితాన్నే తలకిందులు చేస్తున్నాయి. కొత్తగా పెళ్లైన వారి నుంచి దశాబ్దాలపాటు కాపురాలు చేసిన వారు కూడా చిన్న విషయంలో ఎదురైయ్యే మనస్పర్థలతో కట్టుకున్నవారిని దూరం చేసుకుంటున్నారు. అలా ఓ జంట ఒకే ఇంట్లో ఉంటూ కూడా మాట్లాడుకోవడం మానేశారు. చివరకు ఏపీ ప్రభుత్వం (AP Government Scheme) తెచ్చిన పథకం భార్యాభర్తల మధ్య రాజుకున్న అగ్గికి ఆజ్యం పోసింది. భర్త ఆధార్ కార్డ్ (Aadhar Card) వద్ద మొదలైన గొడవ చివరకు హత్యకు దారి తీసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని అనంతపురం జిల్లాలో (Anantapuram District) చోటు చేసుకుంది.

  వివరాల్లోకి వెళ్తే... పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామానికి చెందిన మాధవరెడ్డి(55)కి పాతికేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన కాంతమ్మతో పెళ్లైంది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. అందరికీ పెళ్లిళ్లు చేసేశారు. కొన్నేళ్ల క్రితం కుమారుడు ప్రమాదవశాత్తూ మరణించాడు. వారికున్న ఎకరం పొలాన్ని సాగుచేస్తున్న దంపతులు, కూలిచేసుకుంటూ కొంత కూడబెట్టారు. ఆ డబ్బును కాంతమ్మ ఆమె సోదరులకు అప్పుగా ఇచ్చింది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.

  ఇది చదవండి: విశాఖ బాలిక మృతికేసులో సంచలన నిజాలు... ఆ ఒక్క క్లూ నిందితుడ్ని పట్టించింది..


  డబ్బు కోసం భార్యను వేధిస్తుండటంతో కొంతకాలానికి ఆమె పుట్టింటివారు డబ్బులు తిరిగిచ్చినా మాధవరెడ్డికి భార్యపై కోపం తగ్గలేదు. ఇటీవల మాధవరెడ్డికి పక్షవాతం రావడంతో మంచానపడ్డాడు. భార్యతనను సరిగా చూసుకోవడం లేదంటూ నిత్యం ఆమెతో గొడవ పడుతుండేవాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల్లేవు. ఒకే ఇంట్లో ఉంటున్నా ఎవరిజీవితం వారిదే అన్నట్లు ఉంటున్నారు.

  ఇది చదవండి: వీళ్లిద్దరూ ఇంట్లో కూర్చొని రూ.62కోట్లు సంపాదించారు.. అసలు విషయం తెలిసి షాక్ తిన్న పోలీసులు...


  ఐతే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఈబీసీ నేస్తం పథకం (EBC Nestham Scheme) భార్యాభర్తల మరోసారి అగ్గిని రాజేసింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రెండు రోజుల క్రితం కాంతమ్మ గ్రామ సచివాలయానికి వెళ్లింది. పత్రాలన్నీ చూసిన అక్కడి సిబ్బంది భర్త ఆధార్ కార్డు కావాలని చెప్పారు. భర్తతో మాటలు లేకపోవడంతో ఆధార్ కార్డు ఇవ్వాలంటూ తెలిసిన వ్యక్తితో అడిగించింది. ఐతే తనను నేరుగా అడగకుండా వేరొకరితో అడిగిస్తావా నిన్ను చంపేస్తానంటూ మాధవరెడ్డి.. కాంతమ్మను బెదిరించాడు.

  ఇది చదవండి: పవర్ బిల్లు ఇవ్వడానికి వచ్చి ఆమెపై కన్నేశాడు.. రాత్రికి వచ్చి బలవంతంగా డాబాపైకి తీసుకెళ్లి...


  దీంతో భయపడిపోయిన కాంతమ్మ.. భర్తను చంపాలని నిర్ణయానికి వచ్చింది. మాధవరెడ్డి నిద్రపోతున్న సమయంలో అతని తలపై రోకలిబండతో మోదింది. రక్తపుమడుగులో ఉన్న భర్త చనిపోయాడో లేదో అనుకొని కత్తితో మెడపై నరికింది. అప్పటికీ నమ్మకం లేక నోట్లో పురుగుల మందు పోసింది. విషయం బయటకు పొక్కడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఘటనాస్థలిని పరిశీలించిన పుట్లూరు సీఐ మల్లికార్జునగుప్త, పెద్దపప్పూరు ఎస్‌ఐ గౌస్ మహ్మద్ కాంతమ్మను అదుపులోకి తీసుకున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, Wife and husband, Wife kills husband

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు