హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

భర్తను మర్మాంగంపై కొట్టి చంపిన భార్య.. అంతలోనే ఊహించని ట్విస్ట్ ఇచ్చింది... కానీ మూడు నెలల తర్వాత..

భర్తను మర్మాంగంపై కొట్టి చంపిన భార్య.. అంతలోనే ఊహించని ట్విస్ట్ ఇచ్చింది... కానీ మూడు నెలల తర్వాత..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

భార్యాభర్తల మధ్య అనుబంధం.... నూరేళ్ళ పాటు సాగాలని పెద్దలు అగ్ని సాక్షిగా జంటను ఒక్కటి చేస్తారు. కానీ వారి జీవితాలు...

    GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి. న్యూస్18

    భార్యాభర్తల మధ్య అనుబంధం.... నూరేళ్ళ పాటు సాగాలని పెద్దలు అగ్ని సాక్షిగా జంటను ఒక్కటి చేస్తారు. వారి జంట పిల్లాపాపలతో కలకాలం జీవించాలని ఆశీర్వదిస్తారు. దాంపత్య జీవితం మొదట్లో సజావుగానే సాగినా.. జీవితంలో ఏదురయ్యే సమస్యలు, ఒత్తుళ్లు కొందరి వైవాహిక జీవితాలను దెబ్బతీస్తాయి. ఆధునిక సమాజంలో భార్యభర్తల మధ్య చోటు చేసునే చిన్నపాటి వివాదాలు విడాదులకు అవసరమైన హత్య చేసేంతవరకు తీసుకెళ్తున్నాయి. ఇక వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చురేపుతుంటే.., మద్యం కుటుంబాలను కుదేలు చేస్తోంది. మద్యం మత్తులో కొన్నిసార్లు అమాయకులైన మహిళలు భర్తల చేతుల్లో హతమవుతున్నారు. కొన్నిసార్లు భర్త పెట్టే బాధలు భరించలేని భార్యలు చేజేతులో తాళిబొట్లు తెంచేసుకుంటున్నారు. అలా మద్యం మత్తులో భర్త పెట్టే హింసను భరించలేని ఓ భార్య తానే అతడ్ని హత్య చేసింది. ప్రమాదవశాత్తూ చనిపోయాడని అందర్నీ నమ్మించింది. కానీ మూడు నెలల తర్వాత అసలు నిజం బయటపడటంతో కటకటాల్లోకి వెళ్లింది.

    వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన కేశవ, రేఖకు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వీరి కాపురం తొలుత సజావుగానే సాగింది. కానీ ఆర్ధిక ఇబ్బందులు, ఇతర సమస్యల కారణంగా కేశవ మద్యానికి బానిసయ్యాడు. పలమనేరు టమాటా మార్కెట్లో హమాలిగా పనిచేసే కేశవ వచ్చిన డబ్బంతా మద్యానికి తగలేస్తుండేవాడు. అనంతరం ఇంటికొచ్చి భార్యతో గొడవపడుతుండేవాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ ఘర్షణ జరిగేది.

    ఇది చదవండి: అర్ధరాత్రి రోడ్డు పక్కన అమ్మాయిలు చేసిన ఆ పనికి అంతా షాక్... సీసీ ఫుటేజ్ వైరల్...



    ఈ క్రమంలో ఈ ఏడాది మే 23వ తేదీన ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ ఇంటి మేడపైకి ఎక్కి గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో కేశవ.. రేఖను దూషించాడు. అక్కడితో ఆగకుండా ఆమెను కొట్టాడు. భర్త చేసిన పనికి కోపోద్రిక్తురాలైన రేఖ ఒక్కసారిగా అతడి మర్మాంగంపై కాలితో తన్నింది. ఆవేశంలో పలుసార్లు తన్నడంతో నొప్పి భరించలేక మేడపై నుంచి కిందపడి మృతి చెందాడు. దీంతో తన భర్త మద్యం మత్తులో మేడపై నుంచి కిందపడిపోయాడని అందప్నీ నమ్మించింది. ఐతే కేశవ తల్లి మాత్రం తన కొడుకు ప్రమాదవశాత్తూ చనిపోలేదని హత్య చేశారని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. తాజాగా పోస్ట్ మార్టం రిపోర్టులో మర్మాంగాలపై బలమైన గాయాలున్నట్లు వెల్లడైంది.

    ఇది చదవండి: ఆషాఢమని పుట్టింటికి వచ్చిన నవ వధువు.. ఇంతలో మాజీ ప్రియుడు కలిశాడు.. ఆ తర్వాత...


    రేఖను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక తానే హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండుకు తరలించారు.

    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Chittoor, Wife kill husband

    ఉత్తమ కథలు