హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Viral: భర్తకు దగ్గరుండి రెండో పెళ్లి చేసిన భార్య.. ముగ్గురూ కలిసి కాపురం..! మరో ట్విస్ట్ ఏంటంటే..!

Viral: భర్తకు దగ్గరుండి రెండో పెళ్లి చేసిన భార్య.. ముగ్గురూ కలిసి కాపురం..! మరో ట్విస్ట్ ఏంటంటే..!

భర్తతో నిత్యశ్రీ, విమల

భర్తతో నిత్యశ్రీ, విమల

Viral: ఒక రోజు రాత్రి కళ్యాణ్ మూడీగా ఉండటానికి కారణమైన ఓ యువతి ఇంటి గుమ్మం ముందు ఎంట్రీ ఇచ్చిది. సినిమాలో ఇంటర్వెల్ సీన్ లాగా కళ్యాణ్ మూడీగా ఉండటానికి గల కారణం విమలకు అర్థమైంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Tirupati, India

  GT Hemanth Kumar, News18, Tirupati

  సమాజంలో అప్పుడప్పుడూ కొన్ని విచిత్రమైన ఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా కుటుంబాల్లో కొన్ని సంబంధాలు నేరాలకు కూడా దారిస్తాయి. కానీ ఇక్కడ ఓ భార్య మాత్రం.. భర్త కోసం ఎవరూ చేయని పని చేసింది. టిక్ టాక్ (TikTok) కారణంగా చాల మంది మనసులు దగ్గర అయ్యాయి. టిక్ టాక్ పక్షులంతా ఒక గూటికి చేరినట్లు.... పరిచయం ఏర్పడిన వెంటనే ప్రేమ... అటు తరువాత వివాహం చేసుకున్న వారు కొందరైతే... అక్రమ సంబంధాలు పెట్టుకున్న వల్ల మరి కొందరు. తిరుపతి జిల్లాలో జరిగిన ఘటన ఇప్పుడు అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇలాంటి సంఘటన మల్లి మల్లి చూడతరమా అంటూ ముక్కున వేలేసుకుంటారు ఇక్కడి ప్రజలు. ఇప్పుడునా సమాజంలో ఇది ఎలా సాధ్యం అంటూ అవాక్కఅవుతున్నారు.

  వివరాల్లోకి వెళితే.., తిరుపతి జిల్లా (Tirupati) డక్కిలి అంబేద్కర్ నగర్ కు చెందిన కల్యాణ్ టిక్ టాక్ లో ఫేమస్. తరచూ టిక్ టాక్ వీడియో (TikTok Videos) లు చేస్తూ సామజిక మాధ్యమాల (Social Media) లో పోస్టింగ్ పెట్టేవాడు. టిక్ టాక్ బ్యాండ్ అయినా అనంతరం యూట్యూబ్ షాట్స్, షేర్ చాట్ వంటి షార్ట్ వీడియో ఫ్లాట్ ఫార్మ్ లో దుమ్ము దులిపే వాడు. ఇతనికి షార్ట్ వీడియోలతో కొంతకాలం క్రితం కడపకు చెందిన విమలతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకున్నారు.

  ఇది చదవండి: ప్రేమగా మజ్జిగ ఇచ్చి భర్తను చంపేసింది.. మూడు నెలల తర్వాత ఊహించని ట్విస్ట్..!

  ఇద్దరూ టిక్ టాక్‌లో మంచి ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ఇద్దరూ కలసి షార్ట్ వీడియోలు చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. షార్ట్ వీడియో యాప్స్ లలోనూ.. ఇతర సోషల్ మీడియా యాప్‌లలో యాక్టివ్‌గా ఉంటున్నారు. కొన్నాళ్ళు బాగానే ఉన్న అనంతరం కళ్యాణ్ పెళ్లి తర్వాత కాస్త మూడీగా ఉండటం గమనించింది విమల. కారణం ఏంటి అని పలుమార్లు కళ్యాణ్ ను అడుగుతూ ఉండేది విమల. ఒక రోజు రాత్రి కళ్యాణ్ మూడీగా ఉండటానికి కారణమైన ఓ యువతి ఇంటి గుమ్మం ముందు ఎంట్రీ ఇచ్చిది. సినిమాలో ఇంటర్వెల్ సీన్ లాగా కళ్యాణ్ మూడీగా ఉండటానికి గల కారణం విమలకు అర్థమైంది.

  ఇది చదవండి: దోశ ప్రియులకు అదిరిపోయే న్యూస్‌..! అక్కడ దొరికే వెరైటీ దోశలు చూస్తే మతిపోవాల్సిందే..!

  కల్యాణ్ కు నిత్య శ్రీల మధ్య సాగిన ప్రేమ వ్యవహారాన్ని విమల తెలుసుకుంది. నిత్యశ్రీ కూడా విశాఖపట్నంలో ఫేమస్ టిక్ టాక్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. అప్పట్లో టిక్ టాక్ తోనే వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. కొంతకాలం బాగానే సాగిన ప్రేమ వ్యవహారానికి కొన్ని కారణాల వల్ల బ్రేక్ పడింది. ఇదే క్రమంలో ఫోన్ కాంటాక్ట్ కూడా తెగిపోయింది. చివరకు ఆమెను మరచిపోయి విమలను పెళ్లి చేసుకున్నాడు కల్యాణ్.

  ఇది చదవండి: వరదలొస్తే వాళ్లకు పండగే..! ఎర్రనీళ్లలో ఎన్నో రకాల చేపలు..! తింటే ఎన్నో లాభాలు..!

  సడన్ గా ఇప్పుడు నిత్యశ్రీ ఎంట్రీ ఇచ్చింది. మేటర్ నేరుగా విమలతోనే చెప్పింది. తామిద్దరం గతంలో ప్రేమించుకున్నామని, ఆయన్ను వదిలి ఉండలేనని ఏడ్చేసింది. ఎలాగైనా తామిద్దర్ని ఒకటి చేయాలని వేడుకుంది. ఈ సీస్ లో విమల రియాక్షన్ మాత్రం ఎవరు ఊహించలేము. ఏ భార్య చేయని సాహసం విమల చేసేదుకు సిద్దం అయింది. తన భర్త కల్యాణ్ కి ఆయన ప్రేయసి నిత్యశ్రీని ఇచ్చి పెళ్లి చేసేందుకు విమల రెడీ అయింది. అయితే తాను కూడా వారితోనే కలసి ఉంటానంది. ఈ ప్రపోజల్ నిత్యశ్రీకి నచ్చింది.

  కల్యాణ్ కూడా డబుల్ బొనాంజా కావాలనే అనుకున్నాడు. మొదటి పెళ్లాం చేతుల మీదుగా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ముగ్గురూ కలిసి హ్యాపీగా ఉంటామంటున్నారు. పెళ్లి ఏర్పాట్లన్నీ మొదటి భార్యే చూసుకోవడం ఇక్కడ విశేషం. తన భర్త రెండో పెళ్లికి ఆమె పెళ్లి పెద్దగా వ్యవహరించింది. తన భర్తను, ఆయన ప్రేయసిని గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసింది. వారిద్దరితో కలసి ఫొటోలు కూడా దిగింది. త్యాగమూర్తి విమల అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఐతే వివాహం అనంతరం ముగ్గురు ఎక్కడికి వెళ్లారనేది మాత్రం సస్పెన్స్‌ గా మారింది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Second marriage, Tirupati

  ఉత్తమ కథలు