Husband stand for wife: గాంధేయ మార్గాన్ని ఆయన ఎంచుకున్నాడు. అయితే.. ఆయనకు తగ్గట్టే.. తనను అర్థం చేసుకునే జీవిత భాగస్వామి తోడైంది. ఇంకేముంది గత 22 ఏళ్ల పాటు ఇద్దరూ ఎన్నో సామాజిక అంశాలపై ప్రజలకు చైతన్యం కల్పించాలన్న ఆశయంతో పాదయాత్ర ప్రారంభించారు. సైన్స్ (Science), టెక్నాలజీ (Technology), పర్యావరణ పరిరక్షణ అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రెండు నెలల క్రితం తమిళనాడు (Tamilanadu) లోని మధురై ప్రాంతం నుంచి శ్రీహరికోట (Sriharikota) వరకు యాత్రను చేపట్టారు. అయితే నాలుగు రోజుల్లో యాత్ర ముగుస్తుందన్న సమయంలో భార్య (Wife) అస్వస్థతకు గురై కళ్ళ ఎదుటే కుప్పకూలింది. ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించినా ఫలితం కనిపించలేదు.. భర్త అడుగు జాడల్లో నడుస్తూ, తోడు నీడగా ఉండి ఒక్కసారిగా ఒంటరి వాడిని చేసి కళ్లముందే కన్ను మూసింది. అయితే ఆ బాధ తనను వేధించినా..? ఆయన ఆలోచనలతో ఖాళీగా కూర్చోలేదు. సేవ కోసమే జీవితాన్ని కొనసాగించాలన్న సంకల్పంతో భర్త మరో యాత్రకు శ్రీకారం చుట్టి ముందుకు సాగుతున్నారు. ఇంతకీ వీరి కధ ఏంటో తెలుసా..?
తమిళనాడు రాష్ట్రం, మధురైకు చెందిన కరుపయ్యకు చిన్నతనం నుండి మహాత్మా గాంధి అంటే ఎంతో ఇష్టం.. అంతే కాకుండా మహత్మ గాంధీ లా తాను దేశానికి ఏదో ఒకటి చేయాలని భావించాడు. గాంధీ అడుగు జాడల్లో నడుస్తూ అందరికి ఆదర్శంగా నిలిచేవాడు. దీంతో కరుపయ్యను చుట్టు పక్కల వారందరూ చిన్న గాంధీగా పిలుచుకునే వారు.
ఇక గాంధీయన్ థాట్స్ (టీజీటీ) ప్రత్యేక కోర్సును మధురైలో కరుపయ్య అభ్యసించాడు.. అదే సమయంలో కరుపయ్య భావాలకు అతి దగ్గరగా ఉన్న చిత్ర పరిచయం ఏర్పడింది.. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్ళి పీఠలు ఎక్కించింది. పెళ్ళి తరువాత ఇద్దరి భావాలు ఏకం కావడంతో గాంధీ సిద్ధాంతాలను, ఆలోచనలను ప్రచారం చేస్తూ చిన్న స్టేషనరి దుకాణం నడుపుకుంటూ జీవనం సాగించేవారు.
ఇదీ చదవండి : కోడలితో వివేహాతర సంబంధం.. చివరికి అత్తను ఏం చేశాడంటే..?
22 సంవత్సరాల "క్రితం పాదయాత్ర ద్వారా దేశంలో పలు ప్రాంతాలకు వెళ్లి సామాజిక అంశాలపై ప్రచారం చేయాలని భావించారు. సుమారు 97 వేల కిలోమీటర్ల యాత్రలో ఎన్నో ప్రశంసలు, మరెన్నో అభి నందనలు, సత్కారాలు అందుకుని గాంధీయన్ కపుల్స్ గా గుర్తింపు పొందారు. ఈ ఏడాది జూన్ 28వ తేదీన తిరుచ్చి ప్రాంతం వైఎంవట్టి ప్రాంతం నుంచి శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం వరకు చేరుకునేలా యాత్రను ప్రారంభించారు గాంధీయన్ కపుల్స్.. ఆగస్టు 15వ తేదీన యాత్ర ముగించి స్వాతంత్ర్య దినోత్సవాలకు హాజరు కావాలని భావించారు.
ఇదీ చదవండి: దోచుకో.. పంచుకో.. దాచుకో.. ఇది వారి నినాదం.. సామాజిక న్యాయం మన విధానం
11వ తేదీన సూళ్లూరుపేటలో వెళుతుండగా కరుపయ్య సతీమణి చిత్ర తీవ్ర అస్వస్థతకు గురై తనువు చాలించింది.. దీంతో భార్య మృతదేహాన్ని సూళ్లూరుపేటలోనే ఖననం చేసి.. ఆమె లేదనే వేదన మనసును మెలిపెడుతున్ననా..? తన ఆశయం కోసం ముందుకు సాగుతూ.. కరుపయ్య ఆగస్టు 15వ తారీకున జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో యాత్రను ముగించారు.
ఇదీ చదవండి : రోడ్డుపైనే బైఠాయించిన చంద్రబాబు.. కుప్పం వేదికగా సంచలన ప్రకటన
శ్రీహరికోట నుంచి బెంగళూరులోని ఇస్రో హెడ్క్వార్ట ర్స్ కు ఆజాద్ కా అమృత్ వారోత్సవాలపై మరో యాత్రకు కరుపయ్య శ్రీకారం చుట్టారు. భార్యను కోల్పోయి ఒంటరిగా ఉన్న కరుపయ్యకు ఓ దాత ముందుకు వచ్చి ఓ సైకిల్ అందజేశాడు. దీంతో దాత ఇచ్చిన సైకిల్ తో కరుపయ్య యాత్ర ప్రారంభించారు. రెండు రోజులుగా జ్వరంతో ఉన్నప్పటికీ ఈ నెల 16వ తేదీన యాత్రను ప్రారంభించిన కరుపయ్య.. సోమవారం సాయంత్రం చీకటిపడే సమయానికి చిత్తూరుకు చేరుకున్నారు. గాంధీ సిద్ధాంతాలు భావితరాలకు చాలా అవసరంమని కరుపయ్య పిలుపు నిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tirupati, Wife and husband