TIRUPATI WHERE DOES THE HOLY WATER FOR ANOINTING SHIVAYYA COME FROM IN SOUTH KASHI DOES THE WATER IN THE WELL DECREASE DAY BY DAY TPT PVN
దక్షిణ కాశీలో శివయ్యకు అభిషేకం చేసే పవిత్ర జలం ఎక్కడ నుంచి తెస్తారు..ఆ బావిలో రోజు రోజుకు నీరు తగ్గిపోతుందా?
ప్రతీకాత్మక చిత్రం
Abhishekam For Lord Shiva : దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరా ఆలయం.. పంచభూత లింగాలలో వాయులింగమై వెలిశారు వాయులింగేశ్వరుడు.. గ్రహణ కాలంలోనూ నిత్య పూజలు జరిపి, భక్తులకు గ్రహణ దోష నివారణ జరిపే ఏకైక ఆలయంగా ప్రసిద్ధి గాంచిన ఆలయం కూడా శ్రీకాళహస్తి.
Abhishekam For Lord Shiva : దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరా ఆలయం.. పంచభూత లింగాలలో వాయులింగమై వెలిశారు వాయులింగేశ్వరుడు.. గ్రహణ కాలంలోనూ నిత్య పూజలు జరిపి, భక్తులకు గ్రహణ దోష నివారణ జరిపే ఏకైక ఆలయంగా ప్రసిద్ధి గాంచిన ఆలయం కూడా శ్రీకాళహస్తి. వాయులింగేశ్వరుని దర్శనం సకల పాప హరణం, సకల సౌభాగ్యలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.. కొండపై భక్తకన్నప్ప ఆలయం ఉంటే క్రింది భాగంలో స్వామి, అమ్మవార్ల ఆలయం ఉంటుంది.. జ్ఞాన ప్రసున్నంబ సమేత వాయులింగేశ్వర దర్శనం నవగ్రహాల వక్ర చూపు నుంచి విముక్తి లభిస్తుందని ప్రాశిత్యం ఉండడంలో రోజు వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయంలో రాహు-కేతులు పూజలు నిర్వహిస్తుంటారు. ఒక్క రాయలసీమ నుంచే కాకుండా తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక, ఇతర దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయంకు చేరుకుంటుంటారు
శివయ్యకు ప్రతి నిత్యం నిర్వహించే అభిషేకంకు ప్రత్యేక జలాలతో అభిషేకం నిర్వహిస్తుంటారు అర్చకులు..వాయులింగేశ్వరుడికి ప్రధమ,ద్వితీయ, తృతీయ, ప్రదోష కాల సమయాల్లో ముందుగా అమ్మవారికి అభిషేకం నిర్వహించిన తరువాత అయ్యా వారికి అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు పరిచారికలు.. తెల్లవారు జామున బ్రహ్మముహర్తంలో అభిషేక జలాలుగా సేకరించి మంగళ వాయిద్యాల నడుమ ఆలయంకు తీసుకొస్తారు.. అయితే ఇతర ఏ జలాలను స్వామి, అమ్మవార్ల అభిషేకంకు ఉపయోగించరు.. ఇక్కడి క్షేత్ర ప్రాశస్త్యం ప్రకారం ఇందుకు ఆలయ సమయంలో సువర్ణ ముఖి నది తీరంలో సూర్యనారాయణమూర్తి ఆలయాన్ని ఆనుకుని ఉన్న సూర్య పుష్కరిణి అభిషేకాలు జరుపుతారు.. ఇక ఆలయంలో సూర్యుడు కొలువైయున్న సూర్య పుష్కరిణి జలాలు మాత్రమే ఉపయోగించడం విశేషం.. ఇక నివేదనలు తయారీ ఎదురుగా ఉన్న చంద్రపుష్కరిణి జలాలు వినియోగిస్తారు.. ఈ రెండు జలాలు అడుగంటినా,ఏదైనా కారణంతో కలుషితమైనా ప్రత్యామ్నాయంగా ఆలయంలోని నిత్య కళ్యాణమూర్తుల సమీపంలోని పాతాళగంగ(సరస్వతిబావి)జలాలను వాడుతుంటారు.
అంతేకాకుండా శ్రీకాళహస్తి ఆలయంకు ప్రక్కనే ఉన్న సువర్ణముఖీ నదిని భగీరధుడు గోర తపస్సు ఆచరించి ఆకాశం నుండి ఈ సువర్ణముఖీ నదిని శ్రీకాళహస్తి ఆలయం మీదుగా తీసుకెళ్ళినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది.. అంతేకాకుండా సంజోముక్తి వ్రతం ఆచరించే భక్తులు ఉదయాన్నే నిద్రలేచి స్వర్ణముఖి నదిలో స్నానం ఆచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని, దోష నివారణ పూజలు ఆచరించడం ద్వారా అన్ని శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.. అయితే ఏళ్ళ తరబడి ఎండిపోని సూర్య పుష్కరిణి ప్రక్కనున్న సువర్ణముఖీ నదిలో యధేచ్చగా ఇసుక తరలింపు కారణంగా జలాలు అడుగంటే పరిస్ధితి నెలకొంటుంది.. అయితే ఆలయ పాలక మండలి స్వర్ణముఖి నదిలో ఇసుక తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.