TTD News: తిరుమల తిరుపతి దేవస్థానం తీరు స్వరూపానందేంద్ర స్వామికి నచ్చడం లేదా..? టీటీడీ చైర్మన్ తో స్వామికి మధ్య గ్యాప్ పెరిగిందా..? లేదా ప్రభుత్వం పైనా స్వామీజికి వ్యతిరేకత వచ్చిందా..? ఆయన తాజా వ్యాఖ్యలకు అర్థం ఏంటి..?
TTD News: తిరుమల తిరుపతి దేవస్థానం (Tiruamala Tirupati Devasthanam) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) కి విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపనంద స్వామి (Swaroopananda Swamy)కి మంచి సంబంధాలే ఉండేవి.. సీఎం జగన్ (CM Jagan) తో పాటు ఆయన కూడా పీఠానికి వెళ్లి.. స్వామి ఆశీస్సులు తీసుకునే వారు.. కానీ ఈ మధ్య వారి మధ్య ఏదైనా తేడా వచ్చిందో.. లేక వైవీ సుబ్బారెడ్డి కోపం ఉందా అంటూ ప్రచారం మొదలైంది. అందుకు కారణం ఏంటంటే.. తాజాగా స్వరూపనందేద్ర స్వామి వ్యాఖ్యలే.. ఆయన ఏమన్నారంటే.. ? ప్రస్తుతం ఉన్న పాలకమండలి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని విమర్శించారు.. కరోనా కారణమో లేక బుద్ది మాంద్యమో మాకు తెలియడం లేదన్నారు. అయితే ఈ వ్యాఖ్యలన్నీ పరోక్షంగా వైవీ సుబ్బారెడ్డినివి టార్గెట్ చేసిన మాట్లాడినవే అని ప్రచారం ఉంది. అదే సమయంలో కరుణాకర్ రెడ్డి (Karunakar Reddy)ని మాత్రం ఆకాశానికి ఎత్తేశారు.. ఆయన లాంటి పాలకమండలి సభ్యులు రారు... రాలేరు అంటూ కొనియాడారు.. ఇలా పాలకమండలిని తిడుతు.. కరుణాకర్ రెడ్డిని పొగడం వెనుక అంత్యర్యమేంటని వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది.
తిరుపతి గంగమ్మను దర్శించుకున్న స్వరూపానంద సరస్వతీ టీటీడీ పాలకమండలి పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 900 ఏళ్ళ క్రితం అనంతళ్వార్ చేతుల మీదగా ప్రతిష్టించిన విగ్రహమే తాతయ్య గుంట గంగమ్మ వారిని చెప్పారు. తన ప్రియ శిష్యుడు కరుణాకర్ రెడ్డి కోరిక మేరకు తాను ఇక్కడకు వచ్చాను అన్నారు. టీటీడీ పాలక మండలి చైర్మన్ గా అనేక కార్యక్రమాలు చేపట్టిన ఏకైక వ్యక్తి కరుణాకర్ రెడ్డి అని ఆయన కొనియాడారు.. టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి చేపట్టిన పనులకు అండగా శారదా పీఠం ఉండేదన్నారు.
దళిత గోవిందం, కళ్యాణమస్తు కార్యక్రమలను విశాఖ పీఠం చేపట్టినట్లు చెప్పారు.. కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తి టీటీడీ పాలక మండలి రారు పుట్టబోరు అని, ఇప్పుడు ఉన్న పాలక మండలి పెద్దగా కార్యక్రమాలు చేపట్టిన దాఖలు లేవని విమర్శించారు. తిరుపతి మీడియా ఎన్నో అటు పోట్లు ఎదుర్కొంటుందని, తిరుపతి కపిలతీర్థం సమీపంలో ఆదిశంకరాచార్యులు విగ్రహం ప్రతిష్టించాలని ఆయన కోరారు.. ఆర్జిత సేవల రద్దుపైనా స్పందిస్తామన్నారు. తమకు ఏ ప్రభుత్వమైనా ఒక్కటే, మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతానని ఆయన సమాధానం ఇచ్చారు.
అంతకుముందు తిరుమల శ్రీవారి పాదాల చెంత విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానంద సరస్వతీ స్వధర్మ వాహిని ట్రస్టు లోగో ఆవిష్కరించారు. గిరిజన ప్రాంతాల్లో సనాతన హిందూ ధర్మప్రచారానికి స్వధర్మ ట్రస్టు నిరంతరం కృషి చేసేందుకు స్థాపించమని అన్నారు. ఏపీ, తెలంగాణలలో ధర్మ ప్రచారం చేసేందుకు సరైన సంస్థలు లేవని తెలిపారు.చాలామంది స్వామీజీలు పట్టణ ప్రాంతాల్లో ఆశ్రమాలు నిర్మించుకొని...అక్కడే చేసే ప్రసంగాలకే పరిమితమయ్యారని విమర్శించారు. ధర్మ ప్రచారం విస్త్రతంగా చేసేందుకు స్వధర్మ వాహిని ట్రస్టును ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. హిందూ ధర్మం అంటే పూజలకే పరిమితం కాదు, జ్ఞాన వాహిని అని అర్థమయ్యేలా గిరిజనులకు జ్ఞానబోధ చేస్తామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.