Home /News /andhra-pradesh /

TIRUPATI VIRAL VIDEO NEWS ONE COW CAME TO DOOR STEP AND GAVE MILK IN KURNOOL DISTRICT NGS TPT

Viral Video: వరలక్ష్మీ వ్రతం మహత్యమా..? గడప ముందుకే వచ్చి పిండకుండానే పాలిస్తున్న గోమాత.. మీరే చూడండి

పిండకుండానే ఇంటింటికీ వచ్చి పాలు ఇస్తున్న ఆవు

పిండకుండానే ఇంటింటికీ వచ్చి పాలు ఇస్తున్న ఆవు

Viral Video: అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతాయి అంటారు.. అలాంటిదే ఇది కూడా.. వరలక్ష్మీ వ్రత మహత్యం అంటున్నారు.. లేదంటే అవు తనంతన తనే.. ఇంటింటికీ వచ్చి పాలు ఇవ్వడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు.

    GT Hemanth Kumar, Tirupathi, News18

    Viral Video: నమ్మలేని నిజాలు కొన్ని ఉంటాయి అంటారు.. ఈ వీడియో చూసిన ఎవరైనా అవును నిజమే అనాల్సిందే..? చూసినవారంతా ఇది అద్భుతమే అంటున్నారు.. అసలు ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని.. ఇది కచ్చితంగా అమ్మవారి మహిమే అని నమ్ముతున్నారు.. ఎప్పుడూ లేనిది ఈ రోజే ఇలా జరుగుతోంది అంటే.. అది వరలక్ష్మీ వ్రతం (Varalakshmi Vratam) మహిత్యం అంటున్నారు. ఆ అమ్మవారి దయ తమపై ఉందని.. అందుకు గోమాత (Cow) ప్రతి ఇంటికి వచ్చి.. ఇలా ఆశీర్వాదాలు అందిస్తోంది అంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది అంటే..? ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లా (Kurnool District) కొడుమూరులో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. మొదట ఓ ఇంట్లోకి పిలవకుండానే ప్రవేశించిన ఓ ఆవు పాలు పితకకుండానే నేరుగా దార విడుస్తోంది. దీంతో ఏంటి ఈ మహిమ అని వారంతా షాక్ అయ్యారు.. ఇది నిజంగా పరమ శివుడి (Lord Shiva) మహిమే అని, ఆ భగవంతుడి ఆశీర్వాదం తమకు దక్కిందంటూ ఆనందపరశవంతో మునిగిపోతున్నారు.

    కొడుమూరులోని ఎస్ఐ విష్ణు నారాయణ ఇల్లు ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన అక్కడే నివసిస్తున్నారు. అయితే ఇవాళ శ్రావణ శుక్రవారం.. ఈ రోజును హిందువులు అంతా చాలా పవిత్రంగా భావిస్తారు. నియమ నిష్టలతో అమ్మవారిని కొలిచి.. ముత్తైదువులకు వాయినాలు ఇస్తారు.. అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి.. పలు రకాల పిండి వంటలతో.. నైవేజ్యాలు పెట్టి మనసారా...? పూజలు చేస్తారు..

    శ్రావణ శుక్రవారం పూజలో భాగంగా ఎస్ఐ విష్ణు నారాయణ సతీమణి గుర్రమ్మ ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఇంటి గడప దగ్గరకు వచ్చిన ఆవు.. తానంతట తానే పాలు ఇస్తోంది. అలా ఆవు పాలు వదులుతుండటం గమనించిన గుర్రమ్మ.. ఇంట్లో వారిని, ఇరుగు పొరుగు వారిని పిలిచి చూపించింది. అయితే ఆ దృశ్యాన్ని చూసిన వారంతా ఆశ్చర్యయానికి గురై.. అదంతా అమ్మవారి కటాక్షం అని సంబరపడ్డారు.



    ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే..? ఒకవేళ ఎవరైనా ఆవుకు పాలు పిండితే..? మాత్రం రావడం లేదు. తనంతకు తానే పాలు వదులుతోంది గోమాత. దాదాపు మూడు గంటల సేపు పాలు వదలడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కేవలం ఆ ఇంటికి మాత్రమే కాదు.. అలా అక్కడ ఉన్న కొందరి ఇళ్లకు వెళ్తూ.. గోమాత పాలు ఇచ్చింది. ఇక తమ ఇంట్లోకి గోమాత వచ్చి పాలు వదలడాన్ని అదృష్టంగా భావిస్తున్నారు ఎస్ఐ విష్ణు నారాయణ, గుర్రమ్మ దంపతులు. సాధారణంగా గోమాతను అమ్మవారి రూపంగానే చాలామంది భావిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు.. అందుకే సాక్షాత్తూ అమ్మవారే ఇలా వచ్చి తమను అనుగ్రహించారని అంటున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Kurnool, VIRAL NEWS, Viral Videos

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు