తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. సోమవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు, ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే వాసుబాబులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఎమ్మెల్యే వాసుబాబు మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి దర్శించుకోవడం ఆనందంగా ఉందని, తిరుమల పవిత్రత కాపాడుతూ భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తున్న టిటిడి అధికారులకు,పాలక మండలికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అన్న అన్నా రాంబాబు కొంచెం ఇబ్బంది పడి ఉండవచ్చని, టిటిడి నిబంధనలు పాటిస్తూ దర్శనాలు పొందాలని ఆయన చెప్పారు.. తిరుమల పవిత్రత కాపాడే విధంగా రాజకీయ నాయకులు ప్రస్తావించాలని, చిన్న చిన్న తప్పులు జరిగి ఉండచ్చు కానీ వాటిని రాజకీయం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Tirumala news, Tirumala Temple, Ttd, Ttd news