TIRUPATI VILLAGERS USING AYURVEDA NAMED PRODUCT TO CURE CORONA VIRUS IN NELLORE DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
Andhra Pradesh: కరోనాకు కొత్త మందు.. ఎగబడుతున్న జనం.. డాక్టర్లేమంటున్నారు..?
నెల్లూరు జిల్లాలో కరోనాకు నాటుమందు
కరోనా (Corona Virus) వేళ ఇంటి చిట్కాల పేరుతో ఎన్నో మందులను ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని నాటు మందులను యథేచ్ఛగా పంపిణీ చేస్తున్నారు.
కరోనా కాలంలో ఎవరు ఏమి చెప్పిన గుడ్డిగా నమ్మేసి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ముక్కులో నిమ్మరసం వేసుకోవడం ద్వారా కరోనా రాదని.., నాటు మందులు వాడితే వైరస్ దరిచేరదనే అపోహలు ఎక్కువగానే ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ లో మహమ్మారి సునామీలాగా విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఈ నమ్మకాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పుడు పల్లెవాసులు నాటు వైద్యం బాట పట్టడం, ఆయుర్వేదం పేరుతో ఇచ్చే మందులుపై ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తికి వ్యాక్సిన్ వేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం ఆయుర్వేద మందులు వేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇప్పటికే మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కరోనా వైరస్ నివారణకు ముందస్తుగా ఆయుర్వేదం మందులు వాడుకుంటున్నారు. కరోనా వైరస్ వచ్చినా.., రాకపోయినా ఈ ఆయుర్వేదం మందులు వాడుతున్నారు. ప్రకృతి పరంగా లభిస్తున్న వనమూలికలతో ఆయుర్వేదం మందులు చేస్తున్నారని అంటున్నారు.
శాస్త్రీయంగా అనుమతి లేని., కనీసం కరోనా తగ్గుతుంది అనే ప్రమాణాలు లేకుండా ఇలాంటి నాటు మందులు పంపిణి చేస్తున్నారు.చుట్టూ ప్రకన్నా గ్రామాలూ అధిక సంఖ్యలో ఇక్కడకు చేరుకోని ఆయుర్వేద పేరుతో నాటు మందును తయారు చేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కరోనా సోకిన వారికి, కరోనా వైరస్ రానివారికి ఈ నాటు మందు ఉచితంగా అందజేస్తున్నారు. ఐతే దీని వల్ల కరోనా తగ్గుతుందా అంటే గ్యారెంటీ లేదు.
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం గ్రామంలో వివిధ రకాల ఆకులు, పొడులతో తయారు చేసిన మందును కరోనా మెడిసన్ పేరుతో అందిస్తున్నారు. ఈ గ్రామంలో కొంతమంది ఆయుర్వేద మందు పేరుతో నాటు మందు తయారు చేసి ప్రజలకు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. వివిధ రకాల ఆకులు, తేనే, శొంఠి, మిరియాలు, అల్లం, ధనియాలు, ఇలా కొన్ని రకాల వస్తువులతో కషాయం, తైలం తయారుచేసి వచ్చిన వారికి ఉచితంగా పెడుతున్నారు. స్థానిక ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా జనం వచ్చి ఈ మందును తీసుకువెళ్తున్నారు. ఈ ఆయుర్వేద మందులు చాలా బాగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవని కరోనా వచ్చిన వారు కూడా ఆరోగ్యకరంగా ఉంటున్నారని చెపుతున్నారు. ఐతే ఈ నిర్వాహకులు ఈ మందును ఊచితంగా పంపిణీ చేస్తుండటం గమనార్గం.
అయితే ఈ మందు విషయంలో డాక్టర్లు ప్రజలను హెచ్చరిస్తున్నారు. శాస్త్రీయంగా రుజువుకాని మందులు లేహ్యాలు వాడటం ద్వారా కరోనా ఏమోగానీ ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ చేసకుండా.., అసలు దాని ప్రయోజనం ఎంత వరకు ఉంటుందో తెలియకుండానే జనాలు ఎగబడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని స్పష్టం చేస్తున్నారు. వైరస్ వచ్చిన వారు రాని వారు అక్కడకు చేరుకోవడం వల్ల వైరస్ వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు.
ఈ నాటు మందు వ్యవహారం వైద్య శాఖ అధికారుల వరకూ వెళ్లింది. విషయం తెలుసుకున్న డీఎంహెఓ కృష్ణపట్నం పల్లెకు చేరుకొని విచారణ చేపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కరోనాకు మందు పంపిణి చేయడం ఏంటని నిర్వాహకులను ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపి జిల్లా కలెక్టర్ కి నివేదిక సమర్పించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.