GT Hemanth Kumar, News18, Tirupati
రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ఈగ సినిమా (Eega Movie) ఎంతో ప్రత్యేకం. ఓ ఈగ అలాంటి పనులు నిజంగా చేస్తుందా అనే సందేహం రాకమానదు. ఈగతో చేయించిన విన్యాసాలు అలా ఉంటాయి ఆ సినిమాలో. నాని ఈగగా మరీనా నాటి నుంచి సినిమా మరింత రసవత్తరంగా మారుతుంది. తనను చంపినా విలన్ సుదీప్ (Actor Sudeep) పై ప్రతీకారం తీర్చుకుంటుందనేది కథ. కానీ నిజమైన లైఫ్ లో అలా చేస్తాయా అంటే అది అబ్బదమే. కానీ ఈగలు మనుషులకు ప్రాణాంతక వ్యాధులు ప్రబలెలా చేస్తాయి. ముఖ్యంగా కలరా, ఈ కోలి, టైఫాయిడ్ ఫీవర్ వంటి వ్యాధులు ప్రబలుతోంది. ఒక్క ఈగతో ఇన్ని దుష్ప్రభావాలు ఉంటె... వేల ఈగలు పల్లెపై దాడి చేస్తే ఎలా ఉంటుంది. ఆ ఊరు ఊరు ఎలాంటి పరిస్థితిలో ఉందొ తెలుసా..? ఈగలు దండయాత్ర చేస్తున్న ఆ గ్రామం ఎక్కడ ఉంది..? ఈగలు వేల సంఖ్యలో ఉండటానికి కారణం ఏంటి.
ఈగలు. ఇప్పుడీ పేరు చెబితేనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) బైరెడ్డిపల్లి మండలం నగరే పల్లి గ్రామం వణుకుతోంది. ఓ ఈగ తలచుకుంటే ఎలాంటి ఇబ్బందులు పెడుతుందో ఈగ సినిమాలో చూశాం. అది సినిమా.. మరి నిజ జీవితంలోనూ ఈగలు ఓ గ్రామానికి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. లక్షలాది ఈగలు ఒక్కసారిగా ఆ గ్రామాన్ని చుట్టు ముడుతున్నాయి. దీంతో గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తృప్తిగా భోజనం చేయలేము.. నిద్రపోదాం అంటే చెవి దగ్గర వచ్చి గుయ్ మంటూ ప్రశాంతంగా నిద్రపోయే వారిని సైతం లేపేస్తుంది. ఆహ్లాదం కోసం ఇంటి బయటకు రాలేరు.. ఇంట్లో ఉన్నా.. బయట ఉన్నా.. ఆహారంలో ఈగలు స్విమ్మింగ్ చేస్తున్నాయి.
ఇది చదవండి: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సుల్లో ఆ సమస్యకు చెక్.. ఆర్టీసీ వినూత్న ఆలోచన..!
గ్రామంలో 120 నుంచి 150 రైతు., కూలి కుటుంబాలు ఉన్నాయి. ఇంటి ఆవరణ మొదలు అన్నం తినే కంచం వరకు అంతా ఈగలే. భోజనం తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ గ్రామ ప్రజలు. పగలే అనుకుంటే రాత్రుళ్లు ఇదే పరిస్థితి. ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామస్తులకు కంటి మీద కునుకు కూడా కరువైంది. ఈగల బెడదతో గ్రామంలోని చిన్నపిల్లలు తరచుగా అనారోగ్యం బారిన పడుతున్నారు.
ఈగల దండయాత్రతో చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. నగరేపల్లెలో ఈగల మోతకు కారణం గ్రామానికి దగ్గర్లో ఉన్న కోళ్ల ఫారాలే అంటున్నారు గ్రామస్థులు. గ్రామానికి అతి దగ్గర్లో పదుల సంఖ్యలో కోళ్ల ఫారాలు ఉన్నాయి. వాటి వ్యర్ధాల కారణంగానే ఈగలు గ్రామంపై దాడి చేస్తున్నాయని అంటున్నారు గ్రామస్తులు. కోళ్లఫారాల యజమానులు కూడా తగిన జాగ్రత్తలు చేపట్టడం లేదు. దింతో ఆ గ్రామా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారులు చొరవ చూపి ఈగల నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు గ్రామస్థులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bees, Chittoor