Home /News /andhra-pradesh /

Mystery Sounds: భూమిలో నుంచి వింత శబ్ధాలు.. హడలిపోతున్న ఊరిజనం.. దెయ్యాలు పగబట్టాయా..?

Mystery Sounds: భూమిలో నుంచి వింత శబ్ధాలు.. హడలిపోతున్న ఊరిజనం.. దెయ్యాలు పగబట్టాయా..?

చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు

చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) చిత్తూరు జిల్లా (Chittoor District) లోని ఓ గ్రామంలో ఉన్న బోరు బావిలో వింత శబ్దాలు, గ్రామంలో అక్కడక్కడా భూ ప్రకంపనలు రావడం మొదలయ్యాయి. దీంతో దెయ్యాలు తమ గ్రామంపై పగబట్టాయని స్థానికులు హడలిపోతున్నారు.

    GT Hemanth Kumar, Tirupathi, News18

    ఆ గ్రామం పచ్చని పొలాలతో కళకళలాడుతుంటుంది. ఎప్పుడూ ప్రశాంతంగా కనపిస్తుంటుంది. గొడవలు, వివాదాలు కూడా పెద్దగా జరగవు. అలాంటి ఊళ్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) చిత్తూరు జిల్లా (Chittoor District) లోని ఓ గ్రామంలో ఉన్న బోరు బావిలో వింత శబ్దాలు, గ్రామంలో అక్కడక్కడా భూ ప్రకంపనలు రావడం మొదలయ్యాయి. అసలే పల్లెటూరు కావడంతో స్థానికులకు మూఢనమ్మకాలెక్కువ. దెయ్యాల భయంతో అక్కడి జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఆ వింత శబ్ధాలు వచ్చినప్పుడుల్లా జనం భయంతో వణికిపోతున్నారు. ఏ ఇంట్లో ఏ వస్తువు కదిలినా పరుగులు పెడుతున్నారు. ఈ మిస్టరీ వెనుక దెయ్యాలున్నాయా..? లేక ఏమైనా శక్తులున్నాయా..? లేక మరేదైనా కారణముందా తెలియక అధికారులే అసలు సంగతి తేల్చాలని కోరుతున్నారు.

    చిత్తూరు జిల్లా (Chittoor District) పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల మండలంలోని అబ్బుగుండు గ్రామంలో వింత ఘటనలు చోటు చేసుకున్నాయి. గత మూడు, నాలుగు రోజులుగా భూమిలో నుంచి వింత శబ్దాలు వస్తుండటంతో ప్రజల తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అలాగే స్వల్ప భూ ప్రకంపనలు రావడంతో ఇళ్లలో పాత్రలు., ఇతర వస్తువులు కింద పడిపోతున్నాయి. పలు ఇళ్ల గోడలు బీటలు బారుతున్నాయి. ఈ పరిణామాలను చూసి స్థానికులు వణికిపోతున్నారు.

    ఇది చదవండి: భర్తకు పోటీగా బరిలో దిగిన ఎమ్మెల్యే రోజా.. కబడ్డీ కోర్టులో అదరగొట్టిన ఫైర్ బ్రాండ్..


    తమ గ్రామానికి ఏమైనా శాపం తగిలిందా లేక... దెయ్యాలు పగబట్టాయా అని జనం ఆందోళన వ్యక్తం చేసత్న్నారు. ఇళ్లలోనుంచి పరుగులు తీసిన ప్రజలు ఒకే చోట చేరుకొని తమ ఊరికి ఏదో దోషం పట్టుకుందని, పూజలు చేస్తే అరిష్టం పోతుందని చర్చించుకుంటున్నారు.

    ఇది చదవండి: విద్యార్థులకు ఆంధ్రా యూనివర్సిటీ షాక్.. ఈ కోర్సులకు గుడ్ బై..! కారణం ఇదే..!


    అధికారులేం తేల్చారంటే..
    స్థానిక వీఆర్వో.. తహసిల్దార్ కు సమాచారం ఇవ్వడంతో గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వింతశబ్దాలు రావడాన్ని గుర్తించి.., వెంటనే మైనింగ్ అధికారులకు సమాచారాన్ని అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న మైనింగ్ అధికారులు గ్రామాన్ని మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. గ్రామంలో ఖాళీగా ఉన్న 12 బోర్లను గుర్తించారు. అవన్నీ పూర్తిగా ఎండిపోయాయని గుర్తించారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ఖాళీగా ఉన్న బోరుబావుల్లోకి నీరు చేరడంతో ఇలాంటి వింత శబ్దాలు, స్వల్ప భూ ప్రకంపనలు వస్తున్నాయని మైనింగ్ అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని ధైర్యం చెప్పారు.

    ఇది చదవండి: పెళ్లైన నెలరోజుల తర్వాత మాజీ ప్రియుడి ఫోన్... యువతి చేసిన పనికి అంతా షాక్..

    ఐతే అధికారులు వచ్చి అసలు విషయం తేల్చినా గ్రామస్తుల్లో మాత్రం భయం వీడటం లేదు. చుట్టపక్కల గ్రామాల వాళ్లు అబ్బుగుండు వెళ్లాలంటే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. తమ గ్రామంపై దుష్టశక్తులు ప్రభావం చూపుతున్నాయని.. ఈ కష్టం నుంచి దేవుడే రక్షించాలని కొందరు వేడుకుంటున్నారు.

    మీ నగరం నుండి (​తిరుపతి)

    ఆంధ్రప్రదేశ్
    ​తిరుపతి
    ఆంధ్రప్రదేశ్
    ​తిరుపతి
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Chittoor, Earthquake

    తదుపరి వార్తలు