హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tragedy: ఆస్పత్రుల తీరు ఇంతేనా..? వైద్యుల, సిబ్బంది నిర్లక్ష్యంతో రోడ్డుపైనే శిశువు జననం

Tragedy: ఆస్పత్రుల తీరు ఇంతేనా..? వైద్యుల, సిబ్బంది నిర్లక్ష్యంతో రోడ్డుపైనే శిశువు జననం

అమానుషం.. వైద్యుల నిర్లక్ష్యంతో నడిరోడ్డుపై శిశువు జననం

అమానుషం.. వైద్యుల నిర్లక్ష్యంతో నడిరోడ్డుపై శిశువు జననం

Tregady: తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా..? ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా.. ఆస్పత్రుల తీరు మారడం లేదు.. జాలి.. పాపం అనే సంగతి మరిచిపోతున్నారు ఆస్పత్రిల్లో ఉండే సిబ్బంది.. వైద్యులు.. తాజాగా మరో ఆమానుష ఘటన అందర్నీ కలచి వేస్తోంది. ఏం జరిగింది అంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India

Tregady: ఎన్ని దారుణాలు జరుగుతున్నా ఆస్పత్రుల (Hospitals) తీరు మారడం లేదు.. అక్కడి వైద్యులు, సిబ్బంది మానవత్వం, జాలీ అనే వాటిని మరిచిపోతున్నారు. చిన్న చిన్న కారణాలతో వైద్యానికి నిరాకరిస్తూ.. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా చలించిపోయే ఘటన ఒటకి చోటు చేసుకుంది. నిండు గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోకపోవడం కారణంగా..? ఓ మహిళ నడిరోడ్డుపై శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన తిరుపతి (Tirupati) ప్రసూతి ఆసుపత్రికి కూతవేటు దూరంలో చోటుచేసుకుంది. అక్కడే ఉన్న స్థానికులు ఎటువంటి అపాయం కలుగకుండా ప్రసవించేలా సహాయం చేశారు. దీంతో రోడ్డుపై బెడ్ షీట్‌ చాటున గర్భిణి ప్రసవించింది. ప్రస్తుతం ఈ అమానుష ఘటన కలకలం రేపుతోంది. ఆస్పత్రి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిండు గర్భిణినిలా రోడ్డుపై వదిలేస్తారా అంటూ అంతా మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది అంటే..?

డెలివిరీ కోసం అని ఓ నిండు గర్భవతి ఆస్పత్రికి వచ్చింది. అయితే గర్భవతికి తోడుగా అటెండర్ లేకపోవడంతో ఆస్పత్రిలో చేర్చుకోలేదు యాజమాన్యం. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం అటెండర్ లేకుండా ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోకూడదనే నిబంధనలు ఉన్నట్లు యాజమాన్యం చెబుతోంది. రూల్స్ పేరు చెప్పి నిండు గర్భిణి ఎలా బయటకు వదిలేస్తారని స్థానికులు మండిపడుతున్నారు. ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తిరుపతి ఘటనతో హృదయం చలించిపోతోందని చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై మహిళ ప్రసవం గుండెను కలచివేస్తుందన్నారు. కేవలం తోడుగా సహాయకులు లేరని పురిటి నొప్పులతో వచ్చిన మహిళలను ప్రసూతి ఆసుపత్రి సిబ్బంది చేర్చుకోకపోవడం దారుణమన్నారు.

ఇలాంటి దుస్థితిపై ఎలా చెపితే ఈ ప్రభుత్వానికి అర్ధం అవుతుంది? ఇది కాదా వ్యవస్థల విధ్వంసం అంటే? ఒకటి రెండు కాదు.. ఇలాంటి అమానుష ఘటనలు ఇటీవల ఎన్నో చూస్తున్నామని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : నేడు నరసాపురంలో సీఎం జగన్ .. ఆ రైతులకు శుభవార్త.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ లో ఆస్పత్రుల నిర్లక్ష్యం రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఎన్ని అమానుష ఘటనలు జరుగుతున్నా ఆస్పత్రుల యజమాన్యాల తీరు మారడం లేదు. కేవలం ఆస్పత్రుల యాజమాన్యాలే కాదు.. ఆస్పత్రిలో ఉండే సిబ్బంది.. అంబులెన్స్ డ్రైవర్లు.. ఇలా మొత్తం అంతా కర్కశంగా ప్రవర్తిస్తూ మనుషుల ప్రాణాలు తీస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Hospitals, Tirupati

ఉత్తమ కథలు