హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Rare Disease: నాటు పందులు మృత్యువాత కలవరం.. అసలు వ్యాధి ఏంటి..? నివారణకు టీకా ఉందా..?  

Rare Disease: నాటు పందులు మృత్యువాత కలవరం.. అసలు వ్యాధి ఏంటి..? నివారణకు టీకా ఉందా..?  

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rare Disease: ఏపీ వ్యాప్తంగా ఇటీవల పందుల మరణాలు కలకలం రేపుతున్నాయి. వరుసగా ఎక్కడో ఒక చోట నాటు పందులు మరణిస్తున్నాయి.. అరుదైన వ్యాధే అందుకు కారణమా..? మరి ఆ వ్యాధికి మందులేదా..?

  • News18 Telugu
  • Last Updated :
  • Chittoor, India

GT Hemanth Kumar, Tirupathi, News18

రాష్ట్ర వ్యాప్తంగా పందుల పెంపకం ఘననీయంగా పెరుగుతూ వస్తుంది. రాష్ట్రంలో పోర్క్  ఉన్న డిమాండ్ తో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అధికంగా ఉండటం మరో కారణం. ప్రతి జిల్లాలో దాదాపు 10 వేల వరకు పందులు పెంచుతున్నారు. గణాంకాల్లోకి రాకుండా మరి కొందరు సంచార జాతుల వారు పట్టణాలలోని శివారు ప్రాంతాలలో ఈ పందుల పెంపకం అధికంగా పెంచుతున్నారు. పెట్టుబడి తక్కువ అధిక రాబడి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. కానీ ఇటీవల కాలంలో అనూహ్య రీతిలో పందులు మృత్యువాత పడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా అంతుచిక్కని వ్యాధితో ఒక్కో పంది నీటిలోకి వెళ్ళగానే ప్రాణాలు కోల్పుతున్నాయి. అసలు ఈ పందులకు ఏమైంది...?  పందులకు వచ్చే వ్యాధి అంత భయంకరమైందా?  శాస్త్రవేత్తలు ఎంచెపుతున్నారు.

తిరుపతి శివారు ప్రాంతాల్లో సంచార జాతులకు చెందిన కొన్ని కుటుంబాలు అటవీ ప్రాంతానికి సమీపంలో నాటు పందుల పెంపకం చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కో కుటుంభం 50 నుంచి 100 పందులను పెంచుతున్నాయి. ఇందులో 40కి పైగా పందులు 90 కేజీల నుంచి 110 కేజీల వరకు పెరుగగా...మరో 20 పందులు 70కేజీల లోపు ఉంటాయని అంటున్నారు. ముగిలినవన్నీ పంది పిల్లలు ఉన్నట్లు తెలిపారు.

తిరుపతి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో దాదాపు 200 కుటుంబాలు ఉంటున్నాయని చెప్తున్నారు. గత నెల క్రితం నుంచి ఒక్కో పంది కరెంటు తీగ తాకినట్లు రెండు రోజుల పాటు నీరసంగా ఉంటూ.... మూడవ రోజు నీటిలోకి వెళ్ళగానే మృతి చెందుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.  ఇలా వారి దగ్గర ఉన్న పందులన్నీ చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఒక్కో పంది  5 వేల నుంచి 10 వేల రూపాయల వరకు ఉంటుంది. ఒక్కో కుటుంబానికి 5 నుంచి 7 లక్షల మేర నష్టం వాటిల్లిందని కన్నీరుమున్నీరు అవుతున్నారు. తిరుపతి ప్రాంతాల్లో 15 వేలకు పైగా పందులు చనిపోయాయని.. అవన్నీ తమలాంటి సంచార జాతులు పెంచేవేనని అంటూ తమ ఆవేదన న్యూస్18 తో పంచుకున్నారు.

అసలు పందులకు వచ్చిన వ్యాధి ఏంటి? వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి?  

ఈ మధ్య కాలంలో క్లాసికల్ స్వైన్ ఫీవర్ అనే వ్యాధిని పందుల్లో అధికంగా గుర్తించామని అన్నారు పందుల పరిశోధన శాస్త్రవేత్త కళ్యాణ్ చక్రవర్తి. "ఈశాన్య రాష్ట్రాల్లో ప్రారంభం అయ్యి.. క్రమేపీ దక్షిణ భారత దేశం వైపు వ్యాపిస్తున్నాయి. దింతో మన రాష్ట్రంలోని చాల జిల్లాలో క్లాసికల్ స్వైన్ ఫీవర్ తో నాటు పందులు అధికంగా మృత్యువాత పడుతున్నాయి అంటున్నారు. ఈ వ్యాధి మన రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గుర్తించారు. ఈ వ్యాధితో ఇక్కడ 80 శాతం పందులు మృతి చెందాయి. వాటి రక్త నమూనాలను సేకరించి విజయవాడలోని వ్యాధి నిర్ధారణ కేంద్రంలో పరీక్షా నిర్వహించడం జరిగిందని. ఆ పరీక్షలో నాటు పందులు క్లాసికల్ స్వైన్ ఫీవర్ వ్యాధి వల్ల చనిపోయినట్లు నిర్ధారణ అయింది అంటున్నారు. వ్యాధి లక్షణాల్లో ముఖ్యంగా పందుల చెవుల కింద.,  తొడల కింది భాగంలో..  చర్మంపై వైలెట్ రంగులో మచ్చలు వస్తాయని గుర్తించుకోవాలి. జ్వరం రావడం., నీరసంగాను మరి కొన్ని పందులు వాంతులు విరోచనాలు ఉంటాయని" కళ్యాణ్ చక్రవర్తి న్యూస్18తో చెప్పారు.

క్లాసికల్ స్వైన్ ఫీవర్ అనే వ్యాధికి టీకా ఉందా?

క్లాసికల్ స్వైన్ ఫీవర్ అనే వ్యాధికి టీకా అందుబాటులో ఉందంటున్నారు శాస్త్రవేత్త కళ్యాణ్ చక్రవర్తి. "మూడు నెలలు పైబడిన పందులకు వ్యాధి నిరోధక టీకా అందుబాటులో ఉంది. ఒక్కో పందికి 1ఎంఎల్ చొప్పున పంది కండకు  వేయాలి. ఒక్కసారి టీకా వేస్తే ఏడాది పాటు టీకా తీసుకున్న పందుల్లో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది అంటున్నారు. .ఒక్కో టీకా ధర 20 వేలు  మాత్రమే అని చెబుతున్నారు.  ఈ టీకా బెంగళూరులోని ఐఏహెచ్ఈబీ లో లభ్యం అవుతుందని... పందులను బయట విడిచిపెట్టకుండా..  తద్వారా బయట పందుల నుంచి ఎలాంటి వ్యాధి సంక్రమించదంటున్నారు.  చనిపోయిన పందులను ఐదు అడుగుల గొయ్యి తవ్వి అందులో పూడ్చివేసిన తరువాత పైన సున్నం చల్లడం ద్వార వ్యాధి వ్యాపించదని" న్యూస్18 తో శాస్త్రవేత్త కళ్యాణ్ చక్రవత్తి తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chitoor

ఉత్తమ కథలు