హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala: ఫలితాలు ఇస్తున్న విఐపి బ్రేక్ దర్శనంలో మార్పులు.. కీలక నిర్ణయం దిశగా టీటీడీ

Tirumala: ఫలితాలు ఇస్తున్న విఐపి బ్రేక్ దర్శనంలో మార్పులు.. కీలక నిర్ణయం దిశగా టీటీడీ

సత్ఫలితాలు ఇస్తున్న వీఊపీ బ్రేక్ దర్శనాల సమయం మార్పు

సత్ఫలితాలు ఇస్తున్న వీఊపీ బ్రేక్ దర్శనాల సమయం మార్పు

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో సామాన్య భక్తులకే పెద్ద పీట వేస్తోంది టీటీడీ.. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో మార్పులు చేసింది. ఆ మార్పు ఇప్పుడు సత్పలితాలు ఇస్తోంది. దీంతో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Tirumala, India

GT Hemanth Kumar, Tirupathi, News18

Tirumala: కలియుగ వైకుంఠం భక్తుల పాలిట దివ్యధామం తిరుమల తిరుపతి (Tirumala Tirupati) దేవస్థానం.. అందుకే వెంకన్న దర్శనానికి పేద ధనికులు అనే తారతమ్యం లేకుండా నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఇల వైకుంఠానికి చేరుకుంటారు. స్వామి వారి దివ్యమంగళ స్వరూపాన్ని తనివితీర చూసినా.. మళ్లీ...మళ్లీ చూడాలనే తాపత్రయం ప్రతి మనిషిలో కలుగుతుంది. వైకుంఠ నిలయుడైన శ్రీవారి దర్శన విధానంలో సామాన్యులు సర్వ దర్శనం., టైం స్లాట్ దర్శనం., ప్రత్యేక ప్రవేశ దర్శనం., లక్కీ డిప్ ఆర్జిత సేవల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. దీనికి తోడు ఇక విఐపిలు వీవిఐపిలు.. తమ వ్యక్తిగత సిపార్సు.. బంధు మిత్రులకు సిపార్సు లేఖలు అందించడం వంటివి చేస్తుంటారు.

ఇలా వివిధ అర్జితసేవలు.. బ్రేక్ దర్శనాలు రద్దీని బట్టి కల్పిస్తూ వస్తోంది టీటీడీ. ఏఏడీ దర్శనం నుంచి విఐపి బ్రేక్ గా రూపాంతరం చెందడం.. రోజుకు రెండు సార్లు విఐపి బ్రేక్ దర్శనాలు నిర్వహించే వారు. కాలక్రమేణా పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా రోజుకు ఒక్కసారి మాత్రమే బ్రేక్ విధానాన్ని అమలు చేశారు. ఆ విధానానికి స్వస్తిపలికి సోమ, మంగళ, బుధ, గురు వారాల్లో సిపార్సు లేఖలపై బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు టీటీడీ అధికారులు.

ఇంత వరకు బాగానే ఉన్న క్యూలైన్ లో రాత్రంతా వేచి ఉండే భక్తుల కోసం టైం స్లాట్ విధానం.. వైకుంఠం కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చి మళ్లీ వెళ్ళడానికి రీ ఎంట్రీ టికెట్ విధానం అమలైనా.. అంత ఆదరణ దక్కలేదు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో సామాన్య భక్తుల కోసం.. వారు వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ఆలోచన చేశారు. అదే తరుణంలో బోర్డు సభ్యుల ముందు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి., ఈవో ఏవి ధర్మారెడ్డి బ్రేక్ దర్శనం మార్పుపై చర్చ సాగించారు.

ఇదీ చదవండి : నేడు.. రేపు ప్రత్యేక పూజలు.. మార్గశిర మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే ధనవంతులవ్వడం ఖాయం..

సభ్యుల దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త విధానాన్ని అమలు చేశారు. మొదటి రోజు అమలులో కొంత గందరగోళం ఏర్పడిన..  రెండో రోజు నుంచి మంచి స్పందన రావడం ప్రారంభమైంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో అర్ధరాత్రి ప్రవేశించిన భక్తులు విఐపి బ్రేక్ సమయం అయ్యే వరకు వేచి ఉండాల్సిందే. దాదాపు 10 గంటల సేపు వైకుంఠం 2లోని కంపార్ట్మెంట్ లో వేచి ఉండక తప్పేది కాదు.

ఇదీ చదవండి : శ్రీకాళహస్తిలో చొక్కాని ఉత్సవంలో అపశ్రుతి.. చెలరేగిన మంటలు.. 8 మందికి గాయాలు

ఈ విధానికి పూర్తిగా స్వస్తి పలకకున్నా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి., ఈవో ఏవి ధర్మారెడ్డి బ్రేక్ సమయం ఉదయం 8 నుంచి 12 లోపు తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలు కాగా... ఉదయం 5:30 నుంచి 8 గంటల సమయం లోపు దాదాపు 15 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇదే విధానం అమలుతో సామాన్యులకు త్వరిత గతిన దర్శన భాగ్యం కలుగుతోంది. దింతో సామాన్యముల నుంచి మాన్యుల వరకు టీటీడీని ప్రశంసితున్నారు.

ఇదీ చదవండి : త్వరలో జనసేనలోకి మాజీ ఐఏఎస్, ఐపీఎస్ లు.. ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు..!

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన తెలంగాణా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ టీటీడీ తీసుకున్న నిర్ణయం..  శ్రీవారి దర్శన విధానంలోనే నూతన ఒరవడిని కొనియాడారు. సామాన్య భక్తులే విఐపిలు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్న అధికారులు., పాలకమండలిని అభినందించారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వానికి.. ప్రస్తుత పాలక మండలికి శత్రువులైన బీజేపీ నాయకులు కూడా టీటీడీ తీసుకున్న నిర్ణయం చాల ఉత్తమమని కొనియాడుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Tirumala news, Tirumala tirupati devasthanam

ఉత్తమ కథలు