హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Gold Business: ఏపీలో ముంబై గురించి విన్నారా? రాయలసీమలో ఈ ప్రాంతం ప్రత్యేకత ఏంటో తెలుసా?

Gold Business: ఏపీలో ముంబై గురించి విన్నారా? రాయలసీమలో ఈ ప్రాంతం ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఏపీలో మరో ముంబై

ఏపీలో మరో ముంబై

Gold Business: ఏపీలో ఉన్నముంబై గురించి ఎప్పుడైనా విన్నారా..? ఎందుకు ఆ పేరు వచ్చిందో మీకు తెలుసా..? అసలు బంగారం అమ్మాకాలకు కేరాఫ్ గా ఎలా మారింది..?

  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India

GT Hemanth Kumar, Tirupathi, News18


Gold Business:  భారత దేశంలో పసిడి వ్యాపారం (Gold Business in india) అంటే ముందుగా గుర్తు వచ్చేది ముంబై (Mumbai).. ఎందుకంటే ముంబైలోనే అత్యధిక శాతం బంగారు వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. అయితే ముంబైలానే.. దక్షిణాదిలో సైతం బంగారు వ్యాపారంలో తిరుగులేని రారాజులా., నాణ్యమైన బంగారం అందించే ప్రదేశంగా ప్రసిద్ధిగాంచింది రాయలసీమలోని ఓ ప్రాంతం. ఆ ప్రాంతాన్ని పసిడిపురిగా గా పిలుస్తారు. అక్కడ బంగారం కొంటే.. నమ్మకానికి డోకాలేదని చిన్న చిన్న వ్యాపారులు కూడా నమ్ముతారు. నాణ్యతాలోనూ.. తూకంలోనూ పక్కా అని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ ప్రాంతం ఏంటేంట? అదే రెండవ ముంబై గా ప్రసిద్ధి గాంచింది ప్రొద్దుటూరు. ఇక్కడ బంగారం అంటేనే దక్షిణాది (South India)లో చాలామంది పసిడి ప్రియులకు మిక్కిలి ఇష్టం. ఎందుకంటే ఇక్కడ అందించే బంగారంలో ఏమాత్రం కల్తీ ఉండదు. ఇక్కడి నాణ్యత మరెక్కడా దొరకదు, తూకంలో తేడా కనిపించదు. అన్ని చోట్ల మాదిరిగా కాకుండా కచ్చితమైన ధర ఉంటుంది.మనకు నచ్చిన., మెచ్చిన వెరైటీస్....డిజైన్‌లో నగలు తయారు చేసే అద్భుత ప్రతిభ కలిగిన స్వర్ణకారులు ఏందరో ఉన్నారు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం కావాలంటే వైఎస్సార్‌ జిల్లాలోని ప్రొద్దుటూరుకు రావాల్సిందే. ఇక్కడి బంగారు వ్యాపారానికి వందేళ్ల చరిత్ర ఉంది.


కడప జిల్లాలోని ఒకప్పుడు మారుమూల పల్లె ప్రాంతంగా ప్రొద్దుటూరు ఉండేది. ఇక్కడ అధికంగా నీలిమందు వ్యాపారం వర్తకులు చేసేవాళ్ళు. ఇక్కడ నుంచి స్వదేశానికే కాదు.. విదేశాలైన నేపాల్, భూటాన్, శ్రీలంక దేశాలకు అధికంగా ఎగుమతి చేస్తూ వచ్చారు. నీలి మందు వ్యాపారం  లావాదేవీలు క్షీణించసాగాయి. వేరొక వ్యాపారం సాగిస్తే బాగుంటుందని భావించి బంగారం వ్యాపారం మొదలెట్టారు.100 ఏళ్ల క్రితం ఓ  20 మంది స్థానికులు ఈ వ్యాపారాన్ని మొదలెట్టారు. నమ్మకాన్నే పెట్టుబడిగా బంగారు వ్యాపారం చేయసాగారు. అప్పట్లో వేళ్ళతో లెక్కేసే విధంగా ఉన్న బంగారు దుకాణాలు ఇప్పుడు లెక్కనేనంత ఉన్నాయి. బంగారానికి అందమైన రూపం అందించే స్వర్ణ కారులు కూడా అధికమే. రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణా, బళ్లారి తదితర ప్రాంతాల నుంచి బంగారు కొనుగోళ్ల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు.


ఇదీ చదవండి : ఏపీలో ఆ రెండు పార్టీలు కలిస్తే వార్ వన్ సైడే.. వైసీపీ ఎంపీ షాకింగ్ సర్వే.. పూర్తి వివరాలివే..!


1968లో అలనాటి  ప్రభుత్వం గోల్డ్‌ కంట్రోల్‌ పై నూతన యాక్ట్‌ను ప్రవేశ పెట్టింది. దాని ఆధారంగా‌ దేశంలో లైసెన్సు లేకుండా బంగారు దుకాణాలు నిర్వహించం నేరమని.. బంగారు దుకాణాలు నిర్వహిస్తే కఠినమైన శిక్షలు విధించే వారు. ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేశారు. దీంతో రాయలసీమలోని ఇతర ప్రాంత బంగారు వ్యాపారులు ప్రొద్దుటూరుపై ఆధారపడేవారు. ఇక్కడి నుంచి బంగారు కొనుగోలు చేసి వారి ప్రాంతాల్లో విక్రయించేవారు.


ఇదీ చదవండి : జనసేన -టీడీపీ పొత్తు ఫిక్స్.. ఎవరికి ఎన్ని సీట్లు.. కేసీఆర్‌ వ్యూహం సిద్ధం చేసిన పవన్‌


నాటి భారత ప్రభుత్వం బంగారాన్ని టెండర్ల ద్వారా విక్రయించేది. ఈ టెండర్లలో పాల్గొన్న ప్రొద్దుటూరు వర్తకులు 90 శాతం బంగారాన్ని దక్కించుకున్నారు. పెద్ద మొత్తంలో బంగారం దక్కించుకోవడంతో దేశమంతా ప్రొద్దుటూరు వైపు చూసింది. ఆ రోజు నుంచి రెండో ముంబైగా, పసిడిపురిగా ప్రొద్దుటూరును పిలుస్తారు. టెండర్ల అనంతరం ప్రొద్దుటూరులో పలుమార్లు సీబీఐ దాడులు జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.


ఇదీ చదవండి :: జనసేన -టీడీపీ పొత్తు ఫిక్స్.. ఎవరికి ఎన్ని సీట్లు.. కేసీఆర్‌ వ్యూహం సిద్ధం చేసిన పవన్‌


మన రాష్ట్రంలోనే బంగారు వ్యాపారం జరిగే భారీ ప్రదేశంగా ప్రొద్దుటూరు ఉంది. ఒకప్పుడు మెయిన్‌బజార్‌ (అమ్మవారిశాల వీధి)లో మాత్రమే దుకాణాలు ఉండగా ప్రస్తుతం 10 వీధులకు దుకాణాలు, వర్క్‌ షాపులు విస్తరించాయి. సుమారు 400కు పైగా బంగారు విక్రయించే దుకాణాలు, 1500కు పైగా వర్క్‌ షాపులు ఉన్నాయి. 12 వేల మంది స్వర్ణకారులు ఈ రంగంపై ఆధార పడి జీవిస్తున్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై మహానగరాలకు ధీటుగా ఇక్కడ పసిడి విక్రయాలు జరుగుతున్నాయి.


ఇదీ చదవండి: చంద్రబాబు దూకుడు.. ఇప్పటికే నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారు.. లిస్ట్ ఇదే


కరోనా లాక్ డౌన్ లో తగ్గుముఖం పట్టిన వ్యాపారం.. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా చాలా వ్యాపారాలు నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఇక్కడ ఉన్న స్వర్ణ వ్యాపారులకు భారీగా వ్యాపారం తగ్గుముఖం పట్టి... విలవిలలాడింది పరిస్థితి. కరోనా భయంతో వినియోగదారులు బయటికి రాకపోవడంతో ఆసించినంత స్థాయిలో వ్యాపారాలు జరగ లేదని వ్యాపారాలు చెబుతున్నారు. రోజుకు రూ. 40–45 కోట్ల మేర క్రయ విక్రయాలు జరుగుతుండగా కరోనా మూడు వేవ్ సమయంలో రూ. 15–20 కోట్లకు పడిపోయినట్లు వ్యాపార వర్గాల సమాచారం.

First published:

Tags: Andhra Pradesh, AP News, Business, Tirupati

ఉత్తమ కథలు