హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala: నటి అర్చన గౌతమ్ వివాదానికి కారణం ఇదే.. టీటీడీ వాదన ఏంటి..?

Tirumala: నటి అర్చన గౌతమ్ వివాదానికి కారణం ఇదే.. టీటీడీ వాదన ఏంటి..?

తిరుమలలో నటి అర్చన గౌతమ్ హల్ చల్

తిరుమలలో నటి అర్చన గౌతమ్ హల్ చల్

Tirumala: ఉత్తర ప్రదేశ్ నటి అర్చన గౌతమ్ వివాదానికి ఇప్పట్లో పుల్ స్టాప్ పడదా..? ఆమె మాత్రం వరుస ట్వీట్లను ఆపడం లేదు.. అసలు ఈ వివాదానికి కారణం ఎవరు..? ఏంటి..? లేటుగా స్పందించిన.. టీటీడీ వాదన ఏంటి..? ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లబోతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Tirumala, India

GT Hemanth Kumar, Tirupathi, News18

Tirumala: కలియుగ దైవంగా భావించే  తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుండి భక్తులు వస్తుంటారు. ఇలా శ్రీవారి దర్శనంకు (Tirumala Darshan) విచ్చేసే భక్తులకు సరైన అవగాహన ఉండదు. దీని కోసం ప్రత్యేకించి తిరుమలలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేసింది టిటిడి (TTD). కాలక్రమేణ వాటి సంఖ్య తగ్గు ముఖం పట్టింది. సమాచారం కోసం భక్తులు ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి పరిస్ధితి ఓ యూపీ నటికి (UP Actress) ఎదురైంది. అయితే ఆ వివాదం చిన్నదే అయినా ఇప్పుడు చిలికి చిలికి గాలి వానగా మారింది. ఆమె ఇప్పటికీ సోషల్ మీడియా (Social Media)లో తన పోరాటం కొనసాగిస్తోంది. విరామం లేకుండా వరుస ట్వీట్ల వర్షం కురిపిస్తోంది. ఈ వివాదంలో తప్పు ఎవరిదైనా..?  వెంకన్న దర్శనార్ధం వచ్చిన  నటి అర్చనా గౌతం పట్ల టీటీడీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

కేంద్ర మంత్రి సిఫారస్సు లేఖతో వచ్చిన అర్చనా గౌతం తనకు దర్శనం కేటాయించా లంటూ అదనపు ఈవో కార్యాలయం సిబ్బందిని అభ్యర్ధించగా భక్తురాలి పట్ల అదనపు ఈవో కార్యాలయం సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన విడియో ఇప్పడు నెట్టింట వైరల్ గా మారి చక్కర్లు కొడుతుంది.. తనకు జరిగిన అవమానాని భక్తురాలు తన ట్విటర్ ఖాతా ద్వారా తెలియజేస్తూ తనకు న్యాయం చేయాలని ఏపి ప్రభుత్వాన్ని అభ్యర్ధించింది.

కలియుగంలో భక్తులను రక్షించేందుకు వైకుంఠంను వదిలి భువిపై ఏడుకొండల్లో స్వయంభుగా వెలసిన శ్రీనివాసుడి దర్శనార్ధం నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల పుణ్యక్షేత్రంకు వస్తుంటారు.. ఇలా తిరుమల పుణ్యక్షేత్రంకు విచ్చేసిన భక్తులు వివిధ రూపాల్లో స్వామి వారి దర్శనం పొందుతుంటారు.. కొందరు భక్తులు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, బడా పారిశ్రామిక వేత్తల సిఫార్సు లేఖలతో విఐపి బ్రేక్, ఆర్జిత సేవ టిక్కెట్లు పొందితే, మరి కొందరు టిటిడి ఆన్లైన్ ద్వారా విడుదల చేసే ప్రత్యేక ప్రవేశ దర్శనం గానీ, లక్కి డ్రిప్ ద్వారా దర్శనాలు పొందుతారు.

ఇదీ చదవండి : పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి.. 6 ఏళ్ళకే మరొకరితో ఎఫైర్.. ఆ భర్త ఏం చేశాడంటే?

ఎక్కువ శాతం మంది భక్తులు సర్వదర్శనం గుండా స్వామి వారి దర్శన భాగ్యం పొందుతుంటారు. విఐపి బ్రేక్ దర్శనం పొందడానికి ఒక రోజు ముందు భక్తులు తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంకు చేరుకుని సిఫార్సు లేఖను టిటిడి సిబ్బందికి అందించాల్సి ఉంటుంది. ఇలా భక్తులు సమర్పించిన సిఫార్సు లేఖను పూర్తి స్ధాయిలో పరిశీలించిన తరువాత టిటిడి అదనపు ఈవో కార్యాలయంలో భక్తులకు విఐపి బ్రేక్ దర్శనం కేటాయిస్తారు. అయితే చాలా మంది భక్తులకు స్వామి వారి దర్శన విధి విధానాలపై సరైనా అవగాహన ఉండదు.. దీంతో భక్తులు తిరుమలలో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుంటారు.

ఇదీ చదవండి : సంగం బ్యారేజ్ జాతికి అంకితం.. ప్రత్యేకతలు ఇవే.. సీఎం జగన్ వరాల జల్లు

విఐపి బ్రేకు దర్శనంలో స్వామి వారిని దర్శించుకునేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ కు చెందిన ప్రముఖ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి అర్చనా గౌతం ఈ నెల 30వ తేదీన తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంకు చేరుకున్నారు.. ఆమెతో పాటుగా తన కుటుంబ సభ్యులకు బ్రేకు దర్శనం కల్పించాలంటూ ఓ కేంద్ర మంత్రి సిఫారస్సు లేఖను అదనపు ఈవో కార్యలయంలో సమర్పించింది.. అయితే అదనపు ఈవో కార్యాలయ సిబ్బంది ఆమెతో పాటు వారి కుటుంబ సభ్యులకు బ్రేకు దర్శనంకి బదులుగా ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను కేటాయించారు.. దీనిపై అవగాహన లేని అర్చనా గౌతం 31వ తేదిన ఉదయం బ్రేకు దర్శనం సమయంలో క్యూలైన్ వద్దకు వెళ్ళగా, ఇది బ్రేకు దర్శనం టిక్కెట్టు కాదని అక్కడి సిబ్బంది ఆమెని పంపించి వేయడంతో తీవ్ర ఆవేదనకు గురైన అర్చనా గౌతం, తిరిగి అదనపు ఈవో కార్యాలయం వద్దకు వెళ్ళి తాను బ్రేకు దర్శనంకు సిఫారస్సు లేఖ సమర్పిస్తే తనకు టిక్కెట్టు ఎందుకు కేటాయించలేదంటూ అక్కడి సిబ్బందిని నిలదీసింది..

ఇదీ చదవండి : రెచ్చిపోయిన మానవ మృగం.. 9వ తరగతి బాలిక నోట్లో యాసిడ్‌ పోసి, గొంతుకోసి.. ఆపై దారుణం

అయితే అక్కడి సిబ్బందికి ఆమెకు సరైన సమాధానం చెప్పక పోవడంతో అక్కడి నుండి వసతి గృహంకు వెళ్ళారు.. వివిధ రూపాల్లో స్వామి వారి దర్శనంకు వెళ్ళేందుకు అర్చనా గౌతం ప్రయత్నం చేశారు.. కానీ అవేమి ఫలించక పోవడంతో తిరిగి అదనపు ఈవో కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు.. తనకు ఎందుకని విఐపి బ్రేక్ దర్శనం కేటాయించలేదని మరోక సారి టిటిడి సిబ్బందిని ఆమె ప్రశ్నించగా, అందుకు టిటిడి సిబ్బంది ఎటువంటి సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, దురుసుగా సమాధానం చెప్పారు.

ఇదీ చదవండి : కేంద్రీయ విద్యాలయంలో కలకలం.. ఊపిరాడక 30 మంది విద్యార్థులకు అస్వస్థత

మీరు దర్శనంకు వెళ్ళాలంటే పది వేల రూపాయలు పెట్టి శ్రీవాణి ట్రస్టు ద్వారా టిక్కెట్ తీసుకోవాలని చెప్పి అక్కడి నుండి భధ్రతా సిబ్బంతితో బయటకు పంపించేందుకు ప్రయత్నించారు.. దీంతో ఒక్కసారిగా తీవ్ర వేదనకు గురైన అర్చనా గౌతం అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పాటు వీడియో తీసేందుకు ప్రయత్నించింది.. అక్కడ ఉన్న సిబ్బంది ఆమెను నిలువరించే ప్రయత్నం చేసే సమయంలో ఓ సూపరింటెండెంట్ స్ధాయి అధికారి అర్చనా గౌతంపై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి..

ఇదీ చదవండి : ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం.. ఒకే వేదికపై జూనియర్ ఎన్టీఆర్-పవన్.. స్కెచ్ మామూలుగా లేదుగా?

తనతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో అర్చనా ఈ ఘటనపై పోలీసులకు పిర్యాదు చేసేందుకు వెళ్ళినప్పటికీ కొందరు సిబ్బంది వారిని బుజ్జగించి పంపారనే గుస గుసలు వినిపిస్తున్నాయి.. తనకు జరిగిన అవమానాని తెలియజేస్తూ అదనపు ఈవో కార్యాలయంలోనే అర్చనా గౌతం ఓ సెల్ఫీ వీడియోను తీయడం అటుతరువాత ఆమె ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది..

ఇదీ చదవండి: భూమా మౌనికతో మంచు మనోజ్ ఏడు అడుగులు..! రాజకీయ అడుగులు అటువైపేనా..? చంద్రబాబుకు మోహన్ బాబు అదే చెప్పారా?

ఆ సెల్ఫీ వీడియోలో అర్చనా గౌతం ఏం చెప్పారంటే..?

శ్రీనివాసుడి దర్శనంకు విచ్చేసే భక్తులను టిటిడి దోచేస్తుందని, భక్తులతో టీటీడి సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని, శ్రీవాణి ట్రస్టు టిక్కెట్టును కోనుగోలు చేయాలంటూ భక్తులపై ఒత్తిడి తెచ్చి తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాని వ్యాపార కేంద్రంగా మార్చేస్తున్నారని ఆమె టీటీడిపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.. తనకు జరిగిన అవమానం పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె తన ట్విటర్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించారు. అయితే అర్చనా గౌతం వీడియోను ట్విట్టర్ పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ గా మారింది.. దీనిపై భక్తులు తీవ్ర స్ధాయిలో మండి పడుతూ, విమర్శలు చేశారు.

ఇదీ చదవండి : భక్తులకు అలర్ట్.. గురువారం నుంచి పవిత్రోత్సవాలు.. సెప్లెంబర్ లో అన్ని ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు.. ఎందుకంటే..

వైరల్ గా మారిన వీడియోపై స్పందించిన టీటీడీ..

సోషల్ మీడియాలో అర్చనా గౌతం పోస్టు చేసిన సెల్పీ వీడియా తీవ్ర స్ధాయిలో దుమారం నెటిజన్లు తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.. దీనిపై స్పందిస్తూ టిటిడి ఓ ఒ్రకటన సైతం విడుదల చేసింది.. యూపీకి చేందిన అర్చనా గౌతం టిటిడి సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించందంటూ చూపుతూ ఓ వీడియోను సైతం విడుదల చేసింది.. ఆరోజు పరిస్ధితుల దృష్ట్యా ఆమెకు విఐపి బ్రేక్ కేటాయించలేక పోయాంమని, అయితే ఆ స్ధానంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం కేటాయించడం జరిగిందని అందుకు ఆమె నిరాకరించిందంటూ తెలియజేసింది.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసినప్పటికీ టిటిడి అధికారులు దీనిపై ఎటువంటి వివరణ ఇవ్వలేదు..

ఇదీ చదవండి : పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి అనుకుంటున్నారా..? మీకో గుడ్ న్యూస్

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వివిధ రకాల సిఫార్సు లేఖల ద్వారా దర్శనాలు పొందే భక్తులకు అప్పటి పరిస్ధితుల నేపథ్యంలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసి ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కేటాయిస్తూ ఉంటారు.. ఇదే విషయాన్ని సున్నితంగా టిటిడి సిబ్బంది భక్తులకు తెలియజేయాల్సిన భాధ్యత సిబ్బందిపై ఉంది.. కానీ కార్యాలయంకు విచ్చేసే భక్తుల పట్ల టిటిడి దురుసుగా  ప్రవర్తించడంతో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

ఇదీ చదవండి: ఇవేవో విటమిన్‌ టాబ్లెట్స్‌ అనుకుంటే పొరపాటే..! అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు

ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్న నేపధ్యంలో అదనపు కార్యాలయంలో సిబ్బందిపై టిటిడి పాలక మండలి, ఈవో దృష్టి సారించాల్సి ఉంది.. అర్చనా గౌతం తీవ్ర ఆవేదనతో సెల్పీ వీడియో తీస్తున్న నేపధ్యంలో అక్కడే ఉన్న ఓ టిటిడి ఉద్యోగి వీడియో తీసిన క్రమంలో ఓ సిబ్బంది ఏం జరిగింది అని అడుగగా, అందుకు ఆ వీడియో తీసే సిబ్బంది స్పందిస్తూ  అసభ్యకరమైన మాటలు మాట్లాడంపై భక్తులు మండిపడుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirumala tirupati devasthanam, Ttd news