తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుండి భక్తులు వస్తుంటారు. ఇలా శ్రీవారి దర్శనంకు (Tirumala Darshan) విచ్చేసే భక్తులకు సరైన అవగాహన ఉండదు. దీని కోసం ప్రత్యేకించి తిరుమలలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేసింది టిటిడి (TTD). కాలక్రమేణ వాటి సంఖ్య తగ్గు ముఖం పట్టింది. సమాచారం కోసం భక్తులు ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి పరిస్ధితి ఓ యూపీ నటికి ఎదురైంది. గత బుధవారం యూపీకి చెందిన నటి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి అర్చన గౌతంకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ లభించింది. కానీ కొన్ని అవార్య కారణాలతో వారు తిరుమలకు చేరుకోలేక పోయారు. అయితే వివిధ రకాలు దర్శనంకు వెళ్ళేందుకు ప్రయత్నించిన ఆమె.., చివరి అవకాశంగా తిరుమల జేఈవో కార్యాలయంకు వెళ్ళింది.
మొదట సిబ్బంది లోపలకి అనుమతించక పోవడంతో తాను యూపీకి చేందిన ఓ ఎమ్మెల్యే మనిషిని అంటూ చెప్పి కార్యాలయంలోనికి ప్రవేశించింది. అక్కడ ఉన్న సిబ్బంది ఎందుకు వచ్చారని ప్రశ్నించగా, తనకు అంతకముందు రోజు దర్శనం టికెట్ జారీ అయిందని.. కానీ కొన్ని అనివార్య కారణాలతో స్వామి వారి దర్శనం చేసుకోలేక పోయాంమని వివరించింది. తనను దర్శనానికి అనుమతించాలని కోరింది. ఐతే నిబంధనల ప్రకారం ముందు రోజు జారీ చేసిన టిక్కెట్టును మరుసటి రోజు పంపేందుకు వీలులేదని, దర్శనానికి అనుమతించలేమని అక్కడి సిబ్బంది స్పష్టం చేశారు.
స్వామి వారి దర్శనం పొందాలి అంటే ఉచిత దర్శనంకు గానీ, శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శనంకు వెళ్ళే అవకాశం ఉందని సూచించారు. దీంతో కొంత ఆగ్రహించిన అర్చనా గౌతమ్ సిబ్బందిపై వాగ్వాదానికి దిగింది. అదే సమయంలో వీడియో తీసేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న సిబ్బంది ఆమెను నిలువరించే ప్రయత్నం చేశారు.
అదే సమయంలో ఓ సూపరింటెండెంట్ స్ధాయి అధికారి నటి అర్చన గౌతమ్ పై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులకు పిర్యాదు చేసేందుకు వెళ్ళినప్పటికీ కొందరు సిబ్బంది వారిని బుజ్జగించి పంపారనే గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ వీడియో బయటకు రావడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో విషయం వెలుగు చూసినట్లు తెలుస్తోంది.
ఐతే నటి, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఆమెకు టీటీడీలో నిబంధనలు తెలియదా..? ఆ స్థాయిలో ఉన్న ఆమె శ్రీవాణి దర్శనం టికెట్ కోనుగోలు చేయలేకపోయారా..? రూ.300 దర్శనం టికెట్ కోసం అంతలా గొడవపడాలా అనేది చర్చనీయాంశమైంది. మరోవైపు టీటీడీ అధికారి ఆమెపై చేయిచేసుకున్నారన్న ఆరోపణలపై టీటీడీ ఇంకా స్పందించలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.