Home /News /andhra-pradesh /

TIRUPATI UNIQUE TRADITION AND GOD IN CHITTOOR DISTRICT OF ANDHRA PRADESH AS PEOPLE CALLING HIM SORAKAYASWAMY FULL DETAILS HERE PRN TPT

AP News: ఆ దేవుడికి సొరకాయలే నైవేద్యం.. ఏపీలో వింత ఆలయం.. ఎక్కడంటే..!

చిత్తూరు జిల్లాలో వింత ఆచారం

చిత్తూరు జిల్లాలో వింత ఆచారం

Unique Temple: ప్రపంచంలో ఎన్నో ఆలయాలు మరెన్నో జీవ సమాధులు ఉన్నాయి. శిరిడి సాయిబాబా నుంచి.. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వరకు జీవ సమాధైన అవదూతలు ఎందరో. అలాంటి వారిని భక్తులు దైవంలా కొలుస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఆలయంలో నైవేద్య నివేదన ముడుపులు ఒకేలా ఉంటాయి.

ఇంకా చదవండి ...
  GT Hemanth Kumar, News18, Tirupati

  ప్రపంచంలో ఎన్నో ఆలయాలు మరెన్నో జీవ సమాధులు ఉన్నాయి. శిరిడి సాయిబాబా నుంచి.. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వరకు జీవ సమాధైన అవదూతలు ఎందరో. అలాంటి వారిని భక్తులు దైవంలా కొలుస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఆలయంలో నైవేద్య నివేదన ముడుపులు ఒకేలా ఉంటాయి. తాము కోరుకున్న కోర్కెలు తీరితే వివిధ రకాల మొక్కులు చెల్లించుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) పుత్తూరుకు సమీపంలో ఓ అవధూత సమాదైనా ప్రాంతంలో మాత్రం నైవేద్య నివేదనకు బదులుగా సొరకాయలు కడుతారు భక్తులు. తాము కోరిన కోర్కెలు తీరిన.... కోర్కెలు కోరుకున్న సొరకాయలు కడుతారు భక్తులు. ఇంతటి వింత ఆచారం ఎందుకు వచ్చింది... ఇంతకు ఆ అవధూత ఎవరు...? ఆ అవధూత సమాధి అయినా ఆలయం విశేషాలు ఏంటి..?

  కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు పద్మావతి అమ్మవారిని కళ్యాణం ఆడిన ప్రదేశంగా ప్రసిద్ధి గాంచింది నారాయణవనం పుణ్యక్షేత్రం. ఇక్కడ కల్యాణ వెంకటేశ్వరునిగా శ్రీవారు అర్చావతారా మూర్తిగా వెలిశారు. ఆలయానికి సరిగ్గా అభిముఖంగా సొరకాయల స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సొరకాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. స్థలపురాణం ప్రకారం 1875లో సొరకాయల స్వామి తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని అనంతరం స్వామి అమ్మవార్లకు వివాహం జరిగిన ప్రాంతమైన నారాయణవనానికి వచ్చి ఇక్కడే ఉండిపోయారట.కొందరు స్వామిజి చెన్నై నుంచి తిరుపతికి వచ్చారని అంటుంటే మరి కొందరు ఎక్కడి నుంచి వచ్చాడనేది ఎవరికీ తెలియదని అంటున్నారు.

  సొరకాయను భుజానికి తగిలించుకుని, వెంట రెండు శునకాలతో సొరకాయ డొప్పను పాత్రగా చేసుకుని భిక్షాటన చేస్తూనే ఆ ఊరిప్రజలకు ఉండే అనారోగ్యాలనూ పసుపు, వేప, మరికొన్ని ఔషధాలతోనూ నయం చేసేవారని ప్రతీతి.పూర్వం ఈ ఈ ప్రాంతంలో అధికంగా చేతబడులూ, క్షుద్రపూజలూ జరిగేవట. సొరకాయల స్వామి రాకతో అలాంటివి తగ్గాయని.... ప్రజల్లో చైతన్యం తెప్పించి... చేతబడి., ఆరోగ్య రుగ్మతలతో బాధపడుతున్న వారిని కోలుకునేలా చేసేవారట. మానసిక ఆందోళన ఉన్నవారు ఈ ఆలయానికి వస్తే మనశ్శాంతి కలుగుతుందట ల. అందుకే ఇప్పటికి మానసిక రోగులను ఈ ఆలయానికి తీసుకొస్తుంటారు. బిక్షాటన చేసుకుంటూ నారాయణవనం మొత్తం తిరుగుతూ ఉండే సొరకాయల స్వామి 1902 శ్రావణమాసం గరుడపంచమి రోజున జీవసమాధి అయ్యారు. తరువాత ఊరివాళ్లే జీవసమాధి అయిన చోట ఆలయం నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు.

  ఇది చదవండి: దున్నపోతు తొక్కితే అదృష్టం వరిస్తుందట.. ఏపీలో వింత ఆచారం.. ఎక్కడంటే..!


  సొరకాయల స్వామ. ఎన్ని సంవత్సరాలు జీవించారనే అధరాలు లేవు. స్థలపురాణం ప్రకారం సుమారు 300 సంవత్సరాలకు పైగా జీవించినట్లు తెలుస్తోంది. స్వామిజీ అభాగ్యులకు అండగా, ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడిగా నిలిచాడని అంటారు. ఈ యోగి కాలధర్మం చెంది 119 ఏళ్లు గడుస్తున్నా భక్తులు ఇప్పటికీ ఈ స్వామిని అంతే శ్రద్ధగా పూజించడం విశేషం. తన వెంట ఎప్పుడూ సొరకాయను పెట్టుకుని తిరగడం, సొరకాయ బుర్రతోనే ఈ భిక్షాటన చేయడం వల్ల ఆ స్వామికి ఈ పేరు వచ్చిందట.

  ఇది చదవండి: ఆ గ్రామంలో అమ్మాయిలకి మూడుసార్లు పెళ్లి చేయాల్సిందే. వందల ఏళ్లుగా వింత ఆచారం.. ఎక్కడంటే..!


  సొరకాయల స్వామి సమాధిలో మరో విశిష్టత ఏంటంటే 24 గంటలు., 365 రోజుల పాటు ఆలయంలో ధుని వెలుగుతూనే ఉటుంది. స్వామిజీ జీవ సమాధి అయిన నాటి నుంచి నేటి వరకు నిరంతరాయంగా సమాధి ఎదురుగా అగ్నిగుండం అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉండటం మరో అద్భుతం. ఇందుకు అవసరమైన సామగ్రిని భక్తులు మొక్కుల రూపంలో చెల్లించి.... ఎప్పటికప్పుడు సిద్ధ. చేయడం విశేషం. సొరకాయల స్వామికి హోమం నిర్వహించి ఆ హోమ గుండం నుంచి వచ్చే విభూతిని రోగాలను నయం చేసే ఔషధంలా వాడతారు భక్తులు.

  ఇది చదవండి: పుష్ప నుంచి ఆర్ఆర్ఆర్ వరకు.. ఏపీలో బెస్ట్ షూటింగ్ స్పాట్ ఇదే..

  ఇక దుష్టశక్తులు ఆవహించిన, మానసిక రుగ్మతలు ఉన్న వారిని అమావాస్య, పౌర్ణమి రోజుల్లో రాత్రి 10-12 గంటల సమయంలో జరిగే బుట్ట పూజలో కూర్చోబెడతారు. ఆలా చేయడంద్వారా వారి సమస్య తొలగుతుందట. ఆ రెండు రోజులు ఆలయంలో నిద్రించినా నయం అవుతుందని భక్తుల నమ్మకం. ఆ సమయాల్లో ఈ పూజలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్తోపాటూ తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి విశేష సంఖ్యలో భక్తులు సొరకాయల తాత ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో స్వామి విగ్రహంతోపాటూ ఆయన దివ్య సమాధినీ దర్శించుకోవచ్చు. అదేవిధంగా ఆ స్వామి ఉపయోగించిన సొరకాయ బుర్ర, పాదరక్షలూ, వస్త్రాలూ, ఇత్తడి బిందెలూ ఈ ఆలయంలోనే భక్తుల సందర్శనార్థం ఉంచారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chittoor, Hindu Temples

  తదుపరి వార్తలు