• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • TIRUPATI TWO MEN BRUTALLY KILLED BY COUSINS FOR NOT SUPPORTING FOR MURDER IN A EXTRA MARITAL AFFAIR IN ANANTAPURAM DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Andhra Pradesh: హత్యకు సహకరించలేదని చంపేశారు.. నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా..

Andhra Pradesh: హత్యకు సహకరించలేదని చంపేశారు.. నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా..

ప్రతీకాత్మకచిత్రం

చిన్నచిన్న కారణాలకే కక్షలు పెంచుకోవడం దారుణాలకు పాల్పడటం వంటి ఘటనలు ఇటీవల తరచూ వెలుగు చూస్తున్నాయి.

  • Share this:
    చిన్నచిన్న కారణాలకే కక్షలు పెంచుకోవడం దారుణాలకు పాల్పడటం వంటి ఘటనలు ఇటీవల తరచూ వెలుగు చూస్తున్నాయి. హత్యకు సహకరించలేదనే కోపంతో ఇద్దర్ని పొట్టన బెట్టుకున్న సంఘటన చోటు చేసుకుంది. మర్డర్ ప్లాన్ తెలిసిపోవడంతో వాళ్లు ఎవరికైనా చెప్తారేమోనని భయపడి దారుణంగా నరికి చంపేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం మల్లేపల్లి పంచాయతీలోని దిగువపల్లికి చెందిన ఆదినారాయణకు కేశవ, చంద్ర అనే ఇద్దరు కుమారులున్నారు. సోమవారం కేశవ తన మేనమామ గంగరుతో కలిసి పనిమీద ముదిగుబ్బ వెళ్లారు. అక్కడి నుంచి స్వగ్రామానికి తిరుగివస్తున్నారు. బైక్ పై యోగివేమన జలాశయం వద్దకు చేరుకోగానే గుర్తుతెలియని వ్యక్తులు అక్కడే కాపు కాసి వారిని వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. తీవ్రంగా గాయపడిన కేశవ ఘటనాస్థలిలోనే మృతి చెందగా.. గంగరాజును కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను కూడా మృతి చెందాడు.

    ఐతే ఘటనాస్థలిని పరిశీలించిన కదిరి డీఎస్పీ భవ్య కిశోర్, నల్లమాడ సీఐ ఇస్మాయిల్.. జాగిలాలతో నిందితుల కోసం గాలించారు. ఐతే జంట హత్యలకు కారణాలు తెలిసి పోలీసులు షాకైనట్లు తెలుస్తోంది. కేశవ పెదనాన్న కుమారులైన శివయ్య, శంకర్, కాటమయ్య, శివ, రామచంద్ర అనే వ్యక్తులపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. హత్యకు కారాణం మరో హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో కేశవ పెదనాన్న కుమారులు ఒకర్ని హత్య చేయాలని భావించారని.. ఆ హత్యకు సహకరించాలని కేశవని కోరగా నిరాకరించాడని తెలుస్తోంది.

    ఇది చదవండి: ఈ చిట్టితల్లికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు... మాటలకందని విషాదం ఇది..


    మర్డర్ ప్లాన్ తెలిసిపోవడం ఎవరికైనా చెప్తారనే అనుమానంతో కేశవను.. అతనితో పాటు ఉన్న గంగరాజును హత్య చేసినట్లు చెప్తున్నారు. ఇదిలా ఉంటే హత్యకు గురైన కేశవకు రెండేళ్ల క్రితమే గాయత్రి అనే యువతితో వివాహమైంది. పెళ్లైన రెండేళ్లకే భర్తను కోల్పోవడంతో ఆమె కన్నీరు మున్నీరవుతోంది. మరోవైపు గంగారాజుకు ఇద్దరు కుమారులున్నారు. అటు మేనల్లుడు, ఇటు మేనమామ హత్యకు గురవడంతో రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఐతే హత్యకు కారణం కేవలం మర్డర్ ప్లాన్ తెలిసిపోవడమేనా లేక పాత కక్షలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులంతా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

    ఇది చదవండి: తిరుమలలో గుప్తనిధులున్నాయా...? ఆ సొరంగంలో ఏమున్నాయి..?

    Published by:Purna Chandra
    First published: