Easy Money: వీళ్లిద్దరూ ఇంట్లో కూర్చొని రూ.62కోట్లు సంపాదించారు.. అసలు విషయం తెలిసి షాక్ తిన్న పోలీసులు...

నిందితులు

సోషల్ మీడియాలో (Social Media) నిత్యం కొన్ని లింకులు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. లింక్ క్లిక్ చేస్తే ఫ్రీ రీచార్జ్ అనో, గిఫ్ట్ అనో.. లేక ఈజీగా డబ్బు సంపాదించే అవకాశమనో చెప్తుంటాయి.

 • Share this:
  GT Hemanth Kumar, Tiruapti, News18

  చేతిలో కొద్దిగా ఒదిగిపోయే స్మార్ట్ ఫోన్ (Smart Phone) ఉంటే ప్రపంచమంతా మీ అరచేతిలో ఉన్నట్లే. చిన్నారుల నుంచి పెద్దలవరకు వరకు స్మార్ట్ ఫోన్ లేని వారు అరుదుగా కనిపిస్తారు. సోషల్ మీడియా (Social Media)లో నిత్యం కొన్ని లింకులు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. లింక్ క్లిక్ చేస్తే ఫ్రీ రీచార్జ్ అనో, గిఫ్ట్ అనో.. లేక ఈజీగా డబ్బు సంపాదించే అవకాశమనో చెప్తుంటాయి. అంతేకాదు ఆ లింక్స్ మరికొందరికి ఫార్వర్డ్ చేస్తే కమిషన్ వస్తుందంటూ నమ్మించేస్తారు. వీటిని నమ్మితే మాత్రం నట్టేట మునగాల్సిందే. చీటింగ్ యాప్స్, లింకుల ద్వారా కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్ల ఆటను ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కడప జిల్లా (Kadapa District) పోలీసులు కట్టించారు. అంతేకాదు వారి ఎకౌంట్లలో ఏకంగా రూ.62కోట్లు ఉన్నట్లు గుర్తించి పోలీసులు షాక్ తిన్నారు.

  వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల కడప జిల్లాలోని కడప వన్ టౌన్, చాపాడు, మైదుకూరు, దువ్వూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆన్ లైన్ యాప్స్, లింక్స్ ద్వారా మోసపోయామంటూ కొందరు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదులను ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయగా ఓ ముఠా దాదాపు వందమందికి రూ.3కోట్ల మేర టోకరా వేసినట్లు గుర్తించారు. మేకింగ్ మనీ, ఆర్సీసీ, కొన్న ఇతర యాప్ ల పేరుతో బల్క్ ఎస్ఎంఎస్ లను పంపుతున్న ముఠా.. అమాయకులు, మధ్యతరగతి వారిని బుట్టులో వేసుకుంది. ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన లింక్ క్లిక్ చేసి చిన్నమొత్తంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలిస్తామని కేటుగాళ్లు నమ్మిస్తున్నారు.

  ఇది చదవండి: పవర్ బిల్లు ఇవ్వడానికి వచ్చి ఆమెపై కన్నేశాడు.. రాత్రికి వచ్చి బలవంతంగా డాబాపైకి తీసుకెళ్లి...


  ఎవరైనా రిజిస్టర్ అయి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ట్రేడింగ్ టాస్క్ పేరిట వస్తువు ఆన్ లైన్ లో కొనేందుకు టాస్క్ ను బట్టి పెట్టుబడి పెట్టాలని చెప్తారు. టాస్క్ లో పాల్గొని అధిక మొత్తం లో డబ్బులు కమిషన్ రూపంలో సంపాదించాలనే ఆశతో బాధితులు అధిక మొత్తంలో నమ్మి డబ్బులు పెట్టుబడిగా పెట్టడం జరుగుతుంది. చిన్న మొత్తాలలో ఉన్న వారికి కమిషన్ రూపంలో కొంత మొత్తాన్ని బాధితులకు పంపిస్తారు. ఇలా డబ్బులు నిజంగా వస్తాయేమోనన్న ఆశతో మరింత పెద్ద మొత్తంలో పెట్టుబడిగా పెట్టేలా చేస్తారు. టాస్క్ కూడా అతి సులువుగా ఉండటంతో మరింత మంది తమ సన్నిహితులకు, తెలిసిన వారికి చెప్పి ఇందులో చేర్పించి వారితో కూడా పెట్టుబడిగా సొమ్మును పెట్టడంతో వారు కూడా మోసానికి గురయ్యారు. వర్చ్యువల్ పేమెంట్ అడ్రస్ (VPA ID) ద్వారా డబ్బును సైబర్ నేరగాళ్ల ఖాతాలకు డిపాజిట్ చేయించుకుంటారు.

  ఇది చదవండి: డ్రగ్స్ మాఫియా వెనుక ఆ పార్టీ నేతల హస్తముందా..? ఆ ఆరోపణల్లో నిజమెంత..?


  ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు కడప ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. వారికి సంబంధించిన 23 బ్యాంకు ఖాతాల్లోని రూ.62.5 కోట్ల మొత్తాన్ని ఫ్రీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. నిందితులు తమిళనాడులోని నామక్కల్ కు చెందిన గోకుల్ వేందన్ (28) , ఈరోడ్ కు చెందిన మురుగానందన్(50)గా గుర్తించినట్లు వివరించారు. వీరు ఉత్తరాఖండ్ లోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.
  Published by:Purna Chandra
  First published: