Home /News /andhra-pradesh /

TIRUPATI TTD VIGILANCE OFFICERS GET SHOCK OPEN ONE BOX IN TIRUPATI THEY FOUND 10 LAKHS RUPEES NGS TPT

TTD: తిరుమలలో విజిలెన్స్ అధికారులకు షాకిచ్చిన ట్రంక్ పెట్టె.. ఆ పెట్టెలో ఏముందో తెలుసా?

తిరుమలలో ట్రంక్ పెట్టెలో పది లక్షల రూపాయలు

తిరుమలలో ట్రంక్ పెట్టెలో పది లక్షల రూపాయలు

తిరుపతిలో ఓ యాచకుడి ఇంట్లో ట్రంకు పెట్టలు అందరికీ షాక్ ఇచ్చాయి. గతేడాది అనారోగ్య కారణాలతో శ్రీనివాస్ అనే వ్యక్తి మరణించాడు. అతడు తిరుమలకు వచ్చే వీఐపీల దగ్గర యాచించుకునే వాడు. అయితే అతడు చనిపోయిన తరువాత ఖాళీగా ఉన్న ఇంటిని తెరిచి చూసిన విజిలెన్స్ అధికారులకు షాక్ తగిలింది.

ఇంకా చదవండి ...
    తిరుపతిలోని శేషాచలం కాలనీలో 75వ నెంబర్ గది ఉంది. ఏడాదిగా అందులో ఎవరూ ఉండడం లేదు. ఖాళీగా ఉన్న ఆ ఇంటిని తాజాగా టీటీడీ అధికారులు జప్తు చేశారు. తిరుమలలో చాలా కాలరంగా నిర్వాసితుడైన శ్రీనివాసన్ కు.. గతంలో శేషాచల నగర్ లో ఆ ఇంటిని కేటాయించింది టీటీడీ. చాలా కాలంగాణ ఆ వ్యక్తి ఆ ఇంటిలో ఉంటున్నా ఎవరితోనూ సంబంధాలు ఉండేవి కావు. ఒంటరిగా జీవిస్తుండడంతో అందులో ఏం జరుగుతోంది అన్నది ఎవ్వరికీ తెలిసేది కాదు.. పగలు కొండపైకి వెళ్లి.. రాత్రి తిరిగి ఇంటికి చేరేవాడు. కానీ గతేడాది అనారోగ్య సమస్యలు కారణంగా.. శ్రీనివాసన్  గతేడాది మరణించాడు.  అయితే అతడికి వారసులు ఎవరూ లేకపోవడంతో అప్పటి నుంచి ఆ గది ఖాళీగానే ఉంటటూ వచ్చింది. దాన్ని ఇప్పటి వరకు ఎవరికి టీటీడీ అధికారులు కేటాయించలేదు.

    ఆ గది చాలా కాలంగా ఖాళీగా ఉంటోందన్న విషయం అధికారులకు తెలియడంతో.. ఏం జరిగిందని ఆరా తీశారు. అందులో ఉంటున్న శ్రీనివాస్ అనే వ్యక్తి మరణించాడని.. అతడికి వారసులు ఎవరూ లేరని చెప్పడంతో.. ఆ గదిని ఇంకా ఖాళీగా ఉంచడం సరైంది కాదని భావించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.. వెంటనే ఇంటిని స్వాధీనం చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించింది. ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన.. సిబ్బందికి అక్కడ రెండు ట్రంకు పెట్టెలు కనిపించాయి...

    దీంతో అనుమానం వచ్చి టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారమిచ్చారు. అక్కడికు చేరుకుని ట్రంకు పెట్టెలను తెరిచిన విజిలెన్స్ అధికారులు షాక్ కు గురయ్యారు. ఆ ట్రంకు పెట్టెల నిండా డబ్బులు ఉండటంతో నోరు వెళ్లబెట్టారు. వెంటనే సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. వారంత అక్కడకు చేరుకుని.. అధికారుల సమక్షంలో డబ్బులు లెక్కపెట్టారు. అయితే చిన్న చిన్న నోట్ల తో పాటు చిల్లర కూడా ఉండడంతో లెక్కింపు చాలా ఆసల్యమైంది.  అందులో పది లక్షలకు పైగా నగదు ఉన్నట్టు లెక్కించారు. దీంతో అంత ఆదాయం ఎలా వచ్చిందని అంతా షాక్ గురయ్యారు.

    ఒంటరి వాడైన శ్రీనివాస్ ఏ పని చేయకుండా ఖాళీగానే ఉండేవాడు. తిరుమల దగ్గరకు వచ్చిన వీఐపీల దగ్గర యాచించుకుంటూ జీవినం గడిపేవాడు.. అలాంటి వ్యక్తికి పది లక్షల రూపాయలు ఎలా వచ్చాయని  షాక్ తింటున్నారు. మరోవైపు ఈ విషయం తెలియడంతో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. కరోనా కష్టకాలంలో జనాలు డబ్బులు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. ఏ పని చేయని ఒక యాచకుడి దగ్గర పది లక్షల రూపాయాలు ఉండడం గ్రేట్ అంటున్నారు.. ఆ నగదును టీటీటీ జప్తు చేసింది. ఈ ఆదాయాన్ని తిరుమల శ్రీవారి సేవలకు వినియోగించే అవకాశాలు ఉన్నాయి.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, T, Tirumala, Tirumala tirupati devasthanam, Tirupati, Ttd, Ttd news

    తదుపరి వార్తలు