• Home
 • »
 • News
 • »
 • andhra-pradesh
 • »
 • TIRUPATI TTD TO RESUME THIS OLD SYSTEM IN BOOKING ROOM IN TIRUMALA TO GIVE RELIEF TO EMPLOYEES FULL DETAILS HERE PRN TPT

TTD: మరోపాత విధానానికి టీటీడీ ఓటు.. అలా అయితే వారి కష్టాలు తీరినట్లే..!

తిరుమల ఆలయం (ఫైల్)

తిరుమల ఆలయంలో (Tirumala Temple) పాత విధానాలకు టీటీడీ (TTD) మరోసారి ప్రాముఖ్యతనిస్తోంది.

 • Share this:
  GT Hemanth Kumar, Tirupathi Correspondent, News 18

  శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు నూతన నిబంధనలు అమలుకానుంది. పాత పద్దతులన పునఃప్రారంభ దిశగా అడుగులు వేస్తున్న టీటీడీ.., మరో పాత విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. భక్తులు అద్దె గదులు ఖాళీ చేసే సమయంలో టీటీడీ ఉద్యోగలకు ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనం కలిగించేలా టీటీడీ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆన్లైన్ విధానం విజయవంతం కావడంతో ఆఫ్ లైన్ విధానంలోనూ కాషన్ డిపాజిట్ పై టీటీడీ తుదినిర్ణయం తీసుకోనుంది. కాషన్ డిపాజిట్ పై విధివిధానాలు నెలరోజుల్లో రూపొందించి డిపాజిట్ కౌంటర్ల ఏర్పాటుకు రంగం సిద్ధం కానుంది. ఏడుకొండల వాడి దర్శనార్థం తిరుమలకి చేరుకొనే భక్తులు ఒకరోజు తిరుమలలో బస చేసేందుకు మొగ్గు చూపుతారు. వచ్చిన భక్తులకు వసతి సౌకర్యాలను వారికీ అనువైన స్లాట్ లో టీటీడీ గదులు కేటాయిస్తూ వస్తోంది.

  ప్రస్తుతం టీటీడీ లో రూ.50 నుంచి రూ.6800 ధరల్లో గదులు అందుబాటులో ఉన్నాయి. అయితే గదుల కేటాయింపు విషయంలో టీటీడీ సమూల మార్పులు చేస్తోంది. అధికారులు ఆలోచన ఆచరణలోకి తీసుకొస్తే.., గదులలో బసకు దిగే సమయంలో కాషన్ డిపాసిట్ చెల్లించాల్సిందే. ప్రస్తుతం ఆన్లైన్ లో గదులను ముందస్తుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న భక్తులు కాషన్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. బసకు దిగిన గదికి ఒక్కరోజు అద్దె ఎంత ఉంటె అంతే మొత్తంలో అదనంగా డబ్బులు ముందస్తుగా చెల్లించాల్సి ఉంది. వారు గదులు ఖాళీ చేసిన సమయంలో వారు డబ్బులు జమచేసిన అకౌంట్ కు కాషన్ డిపాజిట్ రుసుమును టీటీడీ తిరిగి చెల్లిస్తోంది. కాషన్ డిపాజిట్ విధానం పునఃప్రారంభానికి బలమైన కారణం ఉందని అంటున్నారు టీటీడీ అధికారులు.

  ఇది చదవండి: కొత్త జిల్లాల ప్రచారం వారి కొంపముంచిందా..? మొదటికే మోసం తెచ్చిందా..?


  గదుల బుకింగ్ విషయంలో ఎదురైయ్యే సవాళ్ళపై ప్రత్యేక ఫోకస్ ఉంచింది. గదుల కేటాయింపు అనంతరం వచ్చే సమస్యలను టీటీడీ రిసెప్షన్ విభాగం పూర్తిగా అధ్యయనం చేసింది. గదులు ఖాళీ చేసిన భక్తులు తదనంతరం అదనపు రోజు రుసుము చెల్లించకుండా.., తాళాలను గది తలుపులకు విడిచి వెళ్తున్నారు. దీంతో అధిక రద్దీ సమయంలో గదుల కేటాయింపులో జాప్యం జరగటమే కాకుండా డ్యూటీలో ఉన్న సిబ్బంది అదనపు రోజు రుసుమును చెలించాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యలు అధికం కావడంతో పాటు.., దళారీల భరతం పట్టాలి అంటే కాషన్ డిపాజిట్ తో సాధ్యమని టీటీడీ భావిస్తోంది. ఇక ఆన్లైన్ లో గదులు ముందస్తుగా బుక్ చేసుకున్న భక్తులు రాకపోవడం మరో సమస్యగా మారుతోంది. కాషన్ డిపాజిట్ విధానంతో ఈ సమస్యను పరిష్కరిస్తోంది టీటీడీ. తద్వారా భక్తులు జాగ్రత్త వహిస్తారని., కాషన్ డిపాజిట్ నిబంధన కచ్చితంగా సత్ఫలితాన్ని ఇస్తుందని భావిస్తోంది.

  ఇది చదవండి: ఏపీ కర్ఫ్యూ వేళల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్ ఇవే..! సీఎం జగన్ కీలక నిర్ణయం


  భక్త కౌసల్యుడైన వెంకన్న దర్శనార్ధం నిత్య వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. క్షణకాలం పాటు జరిగే స్వామి వారి దర్శనం కోసం దేశ విదేశాల నుండి విచ్చేసే భక్తులు గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండి కోనేటి రాయుడి దివ్యమంగళ స్వరూపంను దర్శించుకుంటారు. భక్తుల అభిరుచుల తగ్గట్టుగా వారి తాహతకు అనుగుణంగా మొత్తం 7400 గదులు కొండపై భక్తులకు అందుబాటులో ఉంచింది.. ఇందులో 1500 గదులను ఆన్ లైన్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచింది. సిఫార్సు లేఖలపై చేరుకున్న భక్తులకు కౌస్తుభం, పద్మావతి విచారణ కార్యాలయంలోను, టీటీడీ ఉద్యోగులు, బోర్డు మెంబర్ల సిపార్సు లేఖపై ఎంబీసీ లోని రూములు పొందే సదుపాయాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఇక నేరుగా తిరుమలకు చేరుకున్న భక్తులకు సీఆర్ఓ విచారణ కార్యాలయం ద్వారా వారికి అద్దె గదులు కేటాయిస్తోంది. అంతే కాకుండా గదులు దొరకని భక్తుల కోసం తిరుమలలో నాలుగు యాత్రికుల వసతి సముదాయాలను సైతం ఏర్పాటు చేసి అందులో వారికి కావాల్సిన లాకర్స్ ను ఏర్పాటు చేసి భక్తులకు వసతి కల్పిస్తోంది.

  ఇది చదవండి: రూటు మార్చిన ఎమ్మెల్యే రోజా... చాలా రోజుల తర్వాత ఇలా..


  గతంలో అమల్లో ఉన్న కాషన్ డిపాజిట్ విధానం 2016 నవంబర్ లో కేంద్ర ప్రభుత్వం 500,1000 రూపాయల నోట్లను రద్దు చేయడం, భక్తులకు తిరిగి నగదు ఇచ్చేందుకు సరిపడ నోట్ల నిల్వ లేకపోవడంతో డిపాజిట్ నగదు భక్తులకు ఇవ్వడం కష్టతరంగా మారింది. అంతేకాకుండా నగదు జారీకి నూతన సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేయడం.. ఆ సాఫ్ట్ వేర్ లో సమస్యలు తలెత్తడంతో భక్తులకు నగదు ఇవ్వడం ఆలస్యం‌ కావడం జరిగేది. భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారనే ఉద్దేశ్యంతో అప్పటి టిటిడి ఈవోగా ఉన్న సాంబశివరావు హయాంలో కాషన్ డిపాజిట్ పద్దతిని రద్దు పరుస్తూ ఆదేశాలు జారీ చేసారు. అద్దె గదికి చేల్లించాల్సిన నగదు మాత్రమే చెల్లించి గదిని పోందే అవకాశం కల్పించారు.

  అయితే ఇటీవల్ల భక్తులు అద్దె గదులను ఖాళీ చేసే సమయంలో ఎదురవుతున్న సమస్యలు టీటీడీకి తలనొప్పిగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.. ఇందుకోసం వసతి గృహాలల్లో ప్రత్యేకంగా కాషన్ డిపాజిట్ కౌంటర్లను ఏర్పాటు చేస్తోంది టిటిడి. ఏది ఏమైనప్పటికి కాషన్ డిపాజిట్ విధానం అమలు చేస్తామన్న టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి నిర్ణయంపై టిటిడి ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు అయితే మరో రెండు వారాల్లో కాషన్ డిపాజిట్ విధానంగా అమలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
  Published by:Purna Chandra
  First published: