హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TTD : భక్తులకు టీటీడీ సూచన .. సర్వదర్శనం టికెట్లపై తాజా ప్రకటన

TTD : భక్తులకు టీటీడీ సూచన .. సర్వదర్శనం టికెట్లపై తాజా ప్రకటన

భక్తులకు టీటీడీ సూచన

భక్తులకు టీటీడీ సూచన

Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి.. భక్తులకు సంబంధించి తాజా ప్రకటన చేసింది. దాని వివరాలు తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Tirumala : తిరుమలలో భక్తులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కలిగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి ప్రయత్నిస్తోంది. సాధారణ భక్తులు కొండకు వచ్చి.. స్వామివారిని దర్శించుకోవడం తేలికే. కానీ ముసలివారు, దివ్యాంగులకు ఇది కష్టమైన కార్యం. ఈ చలికాలంలో వారికి మరింత ఇబ్బందిగా ఉంటుంది. అయినప్పటికీ స్వామి వారిని దర్శించి.. జన్మ ధన్యం చేసుకోవాలని వారు కోరుకుంటారు. అందుకే వారి కోసం టీటీడీ తాజా ప్రకటన చేసింది. దాని ప్రకారం డిసెంబర్ నెల కోటాకు సంబంధించి.. నవంబర్ 24న వృద్ధులు, దివ్యాంగులకు సర్వదర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. ఉదయం 10 గంటలకు ఈ టికెట్ల విడుదల ఉంటుంది.

ఆన్‌లైన్‌లో టికెట్ పొందే భక్తులు.. ఆ ప్రకారం కొండకు రావచ్చు. టైమ్ స్లాట్ ప్రకారం సర్వదర్శనంలో స్వామివారిని ఎలాంటి ఇబ్బందీ లేకుండా దర్శించుకోవచ్చని పాలక మండలి నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉంది. తిరుమల కొండలపై మంచు తెరలు ఉంటాయి. అదువల్ల చలి అత్యంత ఎక్కువగా ఉంటుంది. కొండకు వచ్చే భక్తులు.. చలి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే.. చలి వల్ల దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

Rain Alert : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన .. గండంగా వాయుగుండం

ఈ ఆన్‌లైన్ టికెట్ల సదుపాయాన్ని ముసలివారు, దివ్యాంగులూ ఉపయోగించుకోవాలని పాలక మండలి కోరుతోంది. డిసెంబర్‌లో.. కోరుకున్న సమయంలో కొండకు వచ్చి.. స్వామి వారిని దర్శించుకోవాలని సూచిస్తోంది. ఐతే.. నవంబర్ 24న టికెట్లను విడుదల చేయగానే.. ఎవరైతే త్వరగా వాటిని పొందేందుకు ప్రయత్నిస్తారో.. వారికే టికెట్లు లభించే అవకాశం ఉంది కాబట్టి.. త్వరగా ప్రయత్నించాల్సి ఉంటుంది.

First published:

Tags: News, Telugu varthalu, Tirumala, Tirupati, Ttd

ఉత్తమ కథలు