హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TTD : టీటీడీ కీలక ప్రకటన.. నేడు వృద్ధులు, దివ్యాంగులకు సర్వదర్శన టికెట్ల జారీ

TTD : టీటీడీ కీలక ప్రకటన.. నేడు వృద్ధులు, దివ్యాంగులకు సర్వదర్శన టికెట్ల జారీ

టీటీడీ కీలక ప్రకటన

టీటీడీ కీలక ప్రకటన

Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి.. వృద్ధులు, దివ్యాంగ భక్తులకు సంబంధించి తాజా ప్రకటన చేసింది. దాని వివరాలు తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Tirumala : తిరుమలలో భక్తులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కలిగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి ప్రయత్నిస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు స్వామి వారిని దర్శించుకోవడం ఒకింత కష్టంగా ఉంటుంది. సాధారణ భక్తులతో కలిసి.. క్యూలైన్‌లో వెళ్లడం వారికి అసౌకర్యంగా ఉంటుంది. గంటల తరబడి క్యూలో ఉండటం వారికి ఇబ్బందే. అందువల్ల వారి కోసం టీటీడీ తాజా ప్రకటన చేసింది. దాని ప్రకారం డిసెంబర్ నెల కోటాకు సంబంధించి.. నవంబర్ 24న ఉదయం 10 గంటలకు సర్వదర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. ఈ సదుపాయాన్ని వృద్ధులు, దివ్యాంగులూ ఉపయోగించుకోవాలని కోరింది.

ఆన్‌లైన్‌లో టికెట్ పొందే భక్తులు.. ఆ ప్రకారం కొండకు రావచ్చు. టైమ్ స్లాట్ ప్రకారం సర్వదర్శనంలో స్వామివారిని ఎలాంటి ఇబ్బందీ లేకుండా త్వరగా దర్శించుకోవచ్చని పాలక మండలి నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉంది. తిరుమల కొండలపై మంచు తెరలు ఉంటాయి. అదువల్ల చలి అత్యంత ఎక్కువగా ఉంటుంది. కొండకు వచ్చే భక్తులు.. చలి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే.. చలి వల్ల దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు .. ప్రత్యేక నోటీసులు జారీ..

ఈ ఆన్‌లైన్ టికెట్ల సదుపాయాన్ని ముసలివారు, దివ్యాంగులూ తప్పక ఉపయోగించుకోవాలని పాలక మండలి కోరుతోంది. డిసెంబర్‌లో.. కోరుకున్న సమయంలో కొండకు వచ్చి.. స్వామి వారిని దర్శించుకోవాలని సూచిస్తోంది. ఐతే.. ఇవాళ టికెట్లను విడుదల చేయగానే.. ఎవరైతే త్వరగా వాటిని పొందేందుకు ప్రయత్నిస్తారో.. వారికే టికెట్లు లభించే అవకాశం ఉంది కాబట్టి.. త్వరగా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఆలస్యంగా ప్రయత్నిస్తే.. అప్పటికే టికెట్ల జారీ పూర్తైపోయే పరిస్థితి ఉంటుంది.

First published:

Tags: Tirumala, Ttd

ఉత్తమ కథలు