Home /News /andhra-pradesh /

TIRUPATI TTD TO PROTECT IMMOVABLE ASSETS BY SETTING GEO TAGGING AND GEO FENCING ACROSS ANDHRA PRADESH AND INDIA FULL DETAILS HERE PRN TPT

Tirumala: తిరుమల శ్రీవారికి ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా..? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చిట్టా ఇదే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Tirumala: దేశవ్యాప్తంగా శ్రీవారికి ఎన్నో విలువైన భూములను కానుకగా సమర్పించారు భక్తులు. కన్యాకుమారి మొదలుకొని జమ్మూ వరకు వివిధ రాష్ట్రాలతో పాటు నేపాల్ వంటి దేశంలో కూడా శ్రీవారికి భక్తులు సమర్పించిన ఆస్తులు ఉన్నాయి.

    GT Hemanth Kumar, News18, Tirupati

    ఆపద మొక్కుల వాడు, అనాదరక్షకుడు, భక్తుల కోర్కెలు తీర్చే కోనేటి రాయుడైన శ్రీవేంకటేశ్వరుడు (Sri Venkateswara Swmay) ఇల వైకుంఠంమైన సప్తగిరులపై వెలిశాడు. భక్తులు తాము కోరుకున్న కోర్కెలు తీర్చే కోనేటి రాయునికి వడ్డికాసుల రూపంలో మొక్కులు సమర్పింస్తారు భక్తులు. ఆనంద స్వరూపునికి వివిధ రూపాలలో భక్తులు మొక్కులు చెల్లిస్తారు ఉంటాయి. శ్రీవారి ఆలయం (Tirumala Temple) లోని హుండీలో చిల్లర నాణేలు, స్వదేశీ విదేశీ కరెన్సీ నగదులను కొందరు భక్తులు సమర్పిస్తారు. మరి కొందరు భక్తులు బంగారం, వెండి ఆభరణాలు హుండీలో వేసే వారు ఉన్నారు. ఇంకొందరైతే తమతాహతుకు తగ్గట్టు స్థిర, చరాస్థులను సమర్పిస్తుంటారు. తులాభారంలో తమ బరువుకు సమానమైన పదార్దాలను తులాభారంగా చెల్లించేవారు ఇంకొందరు. వీరితో పాటు స్వామివారి అలంకరణకు వినియోగించే వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు పొందుపరిచినా ఆభరణాలు సమర్పించే వారు ఉన్నారు.

    తమ కోరికలు తీరిన వెంటనే ఏకంగా శ్రీవారికి విలువైన భూములను కానుకగా సమర్పిస్తారు భక్తులు సమర్పిస్తూనే ఉన్నారు. విరాళాల రూపంలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ ట్రస్టులకు ఏటా 300 కోట్లు పైగానే విరాళంగా అందిస్తారు భక్తులు. శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారం దాదాపు పది టన్నుల పైగా బ్యాంకులో డిపాజిట్ చేసింది టిటిడి. ఇక ఫిక్స్డ్ డిపాజిట్ ల కింద 8,500 కోట్ల రూపాయల నగదును వివిధ బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్ చేసింది. వీటి ద్వారా వచ్చే ఆదాయం టీటీడీకి హుండి తరువాత వచ్చే వాటిలో ప్రధానమైనది. మరో వైపు దేశవ్యాప్తంగా స్వామివారికి ఎన్నో విలువైన భూములను కానుకగా సమర్పించారు భక్తులు. కన్యాకుమారి మొదలుకొని జమ్మూ వరకు వివిధ రాష్ట్రాలతో పాటు నేపాల్ వంటి దేశంలో కూడా శ్రీవారికి భక్తులు సమర్పించిన ఆస్తులు ఉన్నాయి.

    ఇది చదవండి: టీటీడీ కొత్త ఐడియా.. భక్తుల కోసం వర్చులవ్ క్యూలెన్.. రెండు గంటల్లోనే దర్శనం.. పూర్తి వివరాలివే..!


    నిరర్ధక ఆస్తులపై టీటీడీ తీసుకున్న నిర్ణాయక వివాదాస్పదంగా మారింది. దింతో ఆస్థులు ఇక పై విక్రయించకూడదని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి పాలకమండలి లో పెట్టి తీర్మానం చేశారు. అప్పటినుంచి టిటిడి ఆస్థులు ఎక్కడున్నాయి. వాటి నిర్వహణ భాద్యతలు ఎవరు చూస్తూన్నారు. వాటి ద్వారా టిటిడికి వచ్చే ఆదాయం ఎంత. అన్యాకాంత్రమైన భూములు ఏవి. వాటిని స్వాధీనం చేసుకోవడం ఎలా. వాటిని టీటీడీ ఆదాయ వనరులుగా ఎలా అన్నా అంశాలను పరిశీలించడానికి నాలుగు బృందాలతో టాస్క్ పోర్స్ కమిటిలు ఏర్పాటు చేసింది టీటీడీ పాలకమండలి.

    ఇది చదవండి: తిరుమలలో ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఇలా చేయండి.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు..


    శ్రీవారి పాదాల చెంత ఉన్న తిరుపతిలోనే కాకుండా రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో టాస్క్ పోర్స్ బృందాలు ఏర్పాటు చేయడంతో అధ్యయన, పరిశీలన కార్యక్రమం చేపట్టారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది టీటీడీ నిరర్ధక ఆస్తులపై పూర్తిగా అధ్యయనం చేసి.. చివరగా పరిశిలన జరిపి టిటిడికి దేశవ్యాప్తంగా 1128 ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించారు. వీటిలో 2014కు పూర్వమే 173 ఆస్తులను 114 కోట్ల రూపాయలకు టిటిడి విక్రయించినట్లు గుర్తించారు. ప్రస్తుతం 75 ప్రాంతాలలో ఉన్న ఆస్థులు 7636 ఎకరాల విస్థిర్ణంలో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో వ్యవసాయ భూములు 1226 ఏకరాలు కాగా... వ్యవసాయేతర భూములు 6409 ఏకరాల విస్థిర్ణంలో ఉన్నాయి.

    ఇది చదవండి: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై ఆ కష్టాలకు చెక్.. టీటీడీ కీలక నిర్ణయం..


    ఇక 535 ఆస్థులు ప్రస్తుతం టీటీడీ వినియోగంలో వుండగా.. 159 ఆస్థులును ఇతరులుకు లీజుకు ఇవ్వడం ద్వారా ఏడాదికి నాలుగు కోట్ల పదిహేను లక్షల ఆదాయం ఆర్జిస్తోంది. ఇక టీటీడీ వినియోగంలోలేని 169 ఆస్తులను ఇతరులుకు లీజుకు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది. మరోవైపు అన్యాక్రాంతమైన 29 ఆస్తులను గుర్తించిన టీటీడీ వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంది. 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తుల విలువ రూ.23 కోట్లు గా టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు.

    ఇది చదవండి: రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. టీటీడీ చర్యలు.. సామాన్యులకు కష్టాలు తప్పినట్టేనా..?


    ఒక్క తిరుపతిలోనే ఐదు ప్రాంతాల్లో ఉన్న విలువైన టీటీడీ ఆస్తులను కమిటీ గుర్తించి వాటి అభివృద్ధిపై దృష్టి సారించింది. 74 నిరర్ధక ఆస్తులకు సంబంధించి కోర్టు కేసులు నడుస్తోంది. మిగిలిన 12 ఆస్తులకు సంబంధించి మాత్రం వివరాలు కానీ, ఆధారాలు కానీ లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా కబిస్థలం అనే ప్రాంతంలో ఆరు ఎకరాల టిటిడి స్థలాన్ని గుర్తించింది కమిటీ. గతంలో వంద సంవత్సరాలకు ఈ స్థలాలు లీజుకు ఇవ్వడం.., అప్పటికి టీటీడీ ఏర్పాటు కాకపోవడంతో వాటికి సంభందించిన రికార్డులు లేకపోవడంతో ఇప్పుడు గుర్తింపు టీటీడీకి ఇబ్బందికరంగా మారింది.

    ఇది చదవండి: శ్రీవారి దర్శనానికి కొత్త విధానం.. టీటీడీ ఆలోచన వర్కవుట్ అవుతుందా..?


    దీంతోపాటు దేశవ్యాప్తంగా 307 ప్రాంతాలలో కల్యాణ మండపాలు నిర్మించింది టీటీడీ. ఇందులో 166 కల్యాణ మండపాలను నిర్వహణ బాధ్యత ఇతరులకు అప్పగించగా.., 29 కల్యాణ మండపాలను దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు లీజుకు ఇచ్చింది టీటీడీ. వీటి ద్వారా టీటీడీకి ఏటా నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఆదాయం లభిస్తోంది. మరో 97 కళ్యాణ మండపాలు నిర్వహణ మాత్రం టీటీడీ నిర్వహిస్తోంది.



    గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా.. భవిషత్ లో టీటీడీ ఆస్తుల గుర్తింపు సులభతరం చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆస్థులుకు జియో ట్యాగింగ్ మరియు జియో ఫెన్సింగ్ క్రార్యక్రమాని ప్రారంభించింది. దీంతో నిరర్ధక ఆస్తులను సులభంగా గుర్తించవచ్చని టీటీడీ భావిస్తోంది. ఒకవేళ ఎవరైనా వాటిని అన్యాక్రాంతం చేసుకోవాలనే చూస్తే వాటిని జియో ట్యాగింగ్ ద్వారా అంచనా వేసి కాపాడవచ్చనేది టీటీడీ ఆలోచనగా ఉంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Tirumala tirupati devasthanam, Ttd

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు