Tirumala Temple: తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్... అలా చేస్తే జరిమానా తప్పదు...

శ్రీవారి ఆలయం (ఫైల్)

TTD: తిరుమల కొండపై కొవిడ్ నియమాలు పాటిస్తూ శ్రీవారి దర్శనం చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది.

 • Share this:
  GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

  కలియుగ వైకుంఠంలో తిరుమలలో కొవిడ్ దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. కొండపై కొవిడ్ నియమాలు పాటిస్తూ శ్రీవారి దర్శనం చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది. ఐతే స్వామివారి సన్నిధిలో కోవిడ్ నియమాలు పాటించకుంటే ఫైన్లు తప్పవని టీటీడీ హెచ్చరిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ ప్రబలే అవకాశం ఉంటడంతో అప్రమత్తమైన టీటీడీ ఉన్నతాధికారులు ఇప్పటికే పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకి వచ్చిన భక్తులు., స్థానికులు, ఉద్యోగులు కరోనా నియమాలను పాటించకుంటే భారీ ఫైన్ లు విధించాలని టీటీడీ ఈవో అధికారులకు ఆదేశాలిచ్చారు. కలియుగ వైకుంఠంలో కొలువైన ఆపదమొక్కుల వాడి దర్శనార్థం తిరుమలకు యాత్రికులు తరలివస్తుంటారు. సప్తగిరులపై స్వయంభుగా వెలిసిన ఆ దేవదేవుడిని నిత్యం 70వేల నుంచి లక్ష మంది భక్తులు వరకు దర్శించుకుంటుండగా ప్రస్తుతం కోవిడ్ 19 నేపథ్యంలో ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. కరోనా మహమ్మారి తిరుమలలో ప్రబలకుండా గత ఏడాది మార్చి 20వ తేదీ నుంచి దాదాపు 80రోజుల పాటు దర్శనాలను నిలిపివేసిన టీటీడీ.. ఆ తరువాత కేంద్రం ఇచ్చిన సడలింపులతో జూన్ 8వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో దర్శనాలను పునఃప్రారంభించింది.

  స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించడం ప్రారంభించినప్పటికీ గతంలోలా వేలాది మంది భక్తులను అనుమతించకుండా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తూ కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలు ప్రకారం ప్రతి ఒక్కరు మాస్క్ ను ధరించడంతో పాటు క్యూ లైన్లలో భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారిని దర్శించుకున్నేలా ఏర్పాట్లను చేసింది. దర్శనాలు ప్రారంభించిన నాడు నిత్యం 6వేల మంది భక్తులను అనుమతించిన టీటీడీ... ఆ తరువాత కేంద్ర నిబంధనలను పాటిస్తూ ఎంత మందికీ దర్శనం కల్పించవచ్చో ఆలయంలోని పరిస్థితులను బేరీజు వేసుకుంటూ క్రమంగా దర్శనం సంఖ్యను పెంచుతూ వచ్చి ప్రస్తుతం నిత్యం దాదాపుగా 55వేల మంది భక్తులను టీటీడీ శ్రీవారి దర్శనానికి అనుమతించింది.

  ఇది చదవండి: ఏపీలో మళ్లీ తప్పని లాక్ డౌన్.. మధ్యాహ్నం 2గంటల తర్వాత అంతా బంద్.. ఎక్కడంటే..!


  ఐతే చిత్తూరు జిల్లాలో కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉండడంతో దర్శనాల సంఖ్యను 15 వేలకు కుదించింది. స్వామి వారి దర్శనాలను జులై 11న టీటీడీ పునఃప్రారంభించిన నాటి నుంచి తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడు కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించెలా టీటీడీ గట్టి చర్యలను తీసుకొంది. నిబంధనలను అమలు చేసేందుకు భక్త సంచారం వుండే ప్రాంతాలలో ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని నియమించి ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించడంతో పాటు తప్పనిసరిగా మాస్క్ ను ధరించేలా చర్యలను తీసుకొంది.ఇక భక్తులు స్వామి వారి దర్శనానికి వెళ్లే సమయంలో మాస్క్ ధరించి వుంటేనే క్యూకాంప్లెక్స్ లోకి అనుమతిస్తారు. ఇక భక్తులు క్యూ లైన్లను భౌతిక దూరం పాటించేలా క్యూ లైన్లలో మార్కింగ్ చేయడంతో పాటు నిరంతరం క్యూ లైన్లను శానిటైజ్ చెయ్యించేది. ఇలా కోవిడ్ వ్యాప్తి నివారణకు టీటీడీ తీసుకున్న చర్యలు దేశంలోని ఎన్నో ప్రముఖ ఆలయాలకు ఆదర్శమయ్యాయి.

  ఇది చదవండి: కేడర్ ఉన్నా కనిపించని లీడర్లు... ఆ నియోజకవర్గంలో సైకిలెక్కే నేతలే లేరా..?  తిరుమలకు విచ్చేసి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ టీటీడీ అమలు చేస్తున్న దర్శన విధానాన్ని తెలుసుకొని... కోవిడ్ ప్రభలకుండా టీటీడీ తీసుకుంటున్న జాగ్రత్తలను కొనియ్యాడడమే కాకుండా వారి దేవాలయాలలో కూడా ఇలాంటి విధానమే అమలు చేస్తున్నారు. భక్తుల ఆరోగ్య భధ్రతా దృష్ట్యా గత ఏడాది రెండు బ్రహ్మోత్సవాలను చరిత్రలో ఎన్నడూ లేని‌ విధంగా శ్రీవారి ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించింది టిటిడి..కోవిడ్ మహమ్మారి ప్రభావం నుండి కొంత వరకూ ఉపశమనం కలగడం, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో భక్తుల సంఖ్యను టీటీడీ పెంచుతూ వచ్చింది. తదనంతరం సెకండ్ వేవ్ లో కరోనా వ్యాప్తి తీవ్రతరం కావడంతో భక్తుల సంఖ్యను 15వేల లోపే టీటీడీ కుదించింది.

  ఇది చదవండి: కోనసీమ అందాలు ఇక కనుమరుగేనా..? ప్రధాన కారణం ఇదేనా..?  ఇక కరోనా థర్డ్ వేవ్ అనివార్యం అని అంటున్న నేపథ్యంలో టీటీడీ మారో మారు అప్రమత్తం అయింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కోవిడ్ నిబంధనలను కఠినతరంగా అమలు చేసారు టీటీడీ అధికారులు. దేశ వ్యాప్తంగా ధర్డ్ వేవ్ కరోనా వ్యాప్తి నేపధ్యంలో తిరుమలలో కరోనా నిబంధనలకు మరింత కఠిన తరం చేస్తూ నిర్ణయం తీసుకుంది టిటిడి. ఎప్పుడు భక్తులతో కిటకిటలాడుతు ఉండే వెంగమాంబ అన్నప్రసాద సత్రం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, లడ్డు కౌంటర్లు,పీఏసీ యాత్రికుల వసతి సముదాయాలలోను, తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టలో అంటూ వ్యాధులు వ్యాప్తి చెందకుండా రెండు గంటలకు ఒక మారు క్రిమి నాశక మందులు పిచికారీ చేస్తున్నారు.

  ఇది చదవండి: ఏపీలో పెళ్లిళ్లు, శుభకార్యాలపై కఠిన ఆంక్షలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు  తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే రోడ్డు మార్గం.., శ్రీవారి మెట్టు కాలిబాట మార్గంలోను స్క్రీనింగ్ టెస్టులు, వాహనాలపై క్రిమినాశక మందులు స్ప్రే చేస్తున్నారు. తిరుమలకు వచ్చిన వారు కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారు టీటీడీని సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పుష్కరిణిలో అధిక సంఖ్యలో భక్తులు సామూహికంగా స్ననం ఆచరించడం వ్యాధి మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందన్న కారణంగా పుష్కరిణిలోకి భక్తులు అనుమతిని పూర్తిగా రద్దు చేసింది.

  కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చిత్తూరు జిల్లాలో ఇంకా పూర్తిగా తగ్గలేదు..రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 250 నుండి 350 వరకూ వస్తుండడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కోనసాగుతుంటే.. మరో వైపు కేసులు తగ్గక పోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది. జిల్లాలో కేసులు నమోదు అవుతుండడంతో దర్శనాల పెంపు ఇప్పట్లో ఉండబోదని టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి పలుమార్లు స్పష్టం చేసారు. ప్రస్తుతం సర్వదర్శనం టిక్కెట్ల జారీని ఏడాదిగా నిలిపి వేయడంతో పాటు వివిధ ఆన్లైన్ టిక్కెట్ల ద్వారా ప్రతి రోజు 15 వేల నుండి 17 వేల మందికి భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తోంది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకి వచ్చిన భక్తులు., స్థానికులు, ఉద్యోగులు కరోనా నియమాలను పాటించకుంటే భారీ ఫైన్ లు విధించాలని టీటీడీ అధికారులకు ఈవో ఆదేశాలు జారీ చేసారు. తిరుమలలో కచ్చితంగా కరోనా నియమాలు పాటించే విధంగా చర్యలు చేపట్టారని అధికారులు పర్యావేక్షించాలని ఆయన కోరారు.
  Published by:Purna Chandra
  First published: