Tirumala New Rules: శ్రీవారి భక్తులకు అలర్ట్.. అక్టోబర్ 1నుంచి కొత్తరూల్స్.. ఇకపై ఈ సర్ఠిఫికెట్ తప్పనిసరి...

తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)

తిరుమల శ్రీవారి దర్శనం (TIrumala Darshan) కోసం భక్తులు పోటీ పడతారు. కరోనా సమయంలోనూ స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామి దర్శనానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా టీటీడీ దర్శన టోకెన్లను (TTD Darshan Tokens) పెంచాల్సిరావడం అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలు అమలు చేయనుంది.

  • Share this:
    GT Hemanth Kumar, Tirupati, News18

    Tirumala Temple: తిరుమల శ్రీవారి దర్శనం (Tirumala Darshan) కోసం భక్తులు పోటీ పడతారు. కరోనా సమయంలోనూ స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామి దర్శనానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా టీటీడీ (TTD)దర్శన టోకెన్లను పెంచాల్సిరావడం అనివార్యంగా మారింది. ఓ వైపు భక్తులు భారీగా తరలివస్తుడంటం.. మరోవైపు కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండపై కరోనా వ్యాప్తిని అరికట్టేలా చర్యలకు ఉపక్రమించింది. కోవిడ్ నేపథ్యంలో కేంద్ర నియమాలను పాటిస్తూ ఏడాదిన్నరగా టీటీడీ పరిమితసంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తోంది.. అది కూడా ముందుగానే భక్తులకు దర్శన టిక్కెట్లు, టోకెన్లను జారీ చేసి అలిపిరి భద్రతా వలయం వద్ద భక్తులను తనిఖీ చేసే సందర్భంలో దర్శనానికి టిక్కెట్లు,టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తోంది. దీంతో ప్రస్తుతం శ్రీవారిని నిత్యం 20వేల నుంచి 25వేల మంది భక్తులు మాత్రమే దరించుకుంటున్నారు.

    తమిళులకు అత్యంత ముఖ్యమైన పెరటాశి మాసం గత శుక్రవారం నుంచి ప్రారంభం కావడంతో శ్రీవారి దర్శనానికి అనుమతించాలంటూ వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. వారిని అదుపు చేయడం టీటీడీకి కష్టతరంగా మారడంతో భక్తుల నుంచి స్వామి వారి దర్శనానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఆఫ్ లైన్ లో జారి చేసే సర్వదర్శనం టోకెన్లను 2వేల నుంచి 8వేలకు టీటీడీ పెంచింది. ఐతే స్వామివారి సర్వదర్శన టోకెన్ల కౌంటర్ వద్ద రద్దీ పెరిగిపోవడంతో ఆన్ లైన్ ద్వారానే సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తామని ప్రకటించింది.

    ఇది చదవండి: దసరాకు దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నారా..? అయితే ఇవి గుర్తుంచుకోండి..


    ఈనెల 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచనుంది. సెప్టెంబరు 26వ తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ దాకా రోజుకు ఎనిమిది వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేయనుంది. అక్టోబర్ మాసంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కానున్నడంతో కోవిడ్ దృష్ట్యా ఈ ఏటా ఉత్సవాలను ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహించాలని టిటిడి నిర్ణయించిన విషయం తెలిసిందే.

    ఇది చదవండి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఇకపై నెలరోజులే ఈ సౌకర్యం..


    అయితే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా నియమాలు పాటించాలని టీటీడీ సూచిస్తోంది. అక్టోబర్ 1 నుంచి ఈ నూతతిరుమల యాత్రకు రావాలంటే తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న సర్టిఫికెట్ లేదా మూడు రోజుల ముందు కరోనా నెగెటివ్ వచ్చిన రిపోర్ట్ తప్పనిసరి చేసింది. 18 సంవత్సరాలు పైబడి ప్రతిఒక్కరు కోవిడ్ టీకా వేసుకున్న ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్, టిక్కెట్లు తీసుకు రావాలని సూచిస్తోంది. 12 ఏళ్ల లోపు వారికి మాత్రం ఈ నిబంధనల నుంచి సడలింపునిచ్చిన ప్రభుత్వం.., 13 నుంచి 18 ఏళ్ల వరకు వయస్సు కలిగిన వారు దర్శనానికి వచ్చే మూడు రోజుల ముందు కొవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఒకవేళ మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకొని ఉన్నా కొవిడ్ నెగిటివ్ రిపోర్ట్ చూపించాల్సిందేనని టీటీడీ స్పష్టం చేసింది.
    Published by:Purna Chandra
    First published: