హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. వారికి మరో అవకాశం..

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. వారికి మరో అవకాశం..

ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. ఉండేందుకు జనవరి 1న, అలాగే వైకుంఠ పర్వదినాల సందర్భంగా జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ దర్శనం మాత్రమే కల్పిస్తారు. ఆ పది రోజుల్లో దర్శనాల కోసం ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించడం జరగదని టీటీడీ స్పష్టం చేసింది.

ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. ఉండేందుకు జనవరి 1న, అలాగే వైకుంఠ పర్వదినాల సందర్భంగా జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ దర్శనం మాత్రమే కల్పిస్తారు. ఆ పది రోజుల్లో దర్శనాల కోసం ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించడం జరగదని టీటీడీ స్పష్టం చేసింది.

తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త చెప్పింది. భారీ వ‌ర్షాలు, వరదల కార‌ణంగా న‌వంబ‌రు 18 నుండి 30వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి దర్శనానికి రాలేని భ‌క్తులకు మ‌రో స‌మ‌యంలో తిరిగి దర్శనం క‌ల్పించాల‌ని నిర్ణయించింది.

  తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త చెప్పింది. భారీ వ‌ర్షాలు, వరదల కార‌ణంగా న‌వంబ‌రు 18 నుండి 30వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి దర్శనానికి రాలేని భ‌క్తులకు మ‌రో స‌మ‌యంలో తిరిగి దర్శనం క‌ల్పించాల‌ని నిర్ణయించింది. ఈ మేర‌కు దర్శన టికెట్లు ఉన్న భ‌క్తుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ రూపొందించి 6 నెల‌ల్లోపు తిరిగి స్లాట్ బుక్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేప‌డుతున్నామ‌ని టీటీడీ అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లో భారీగా వర్షాలు కురిసినా.., న‌మోదైనా ఒక‌టి, రెండు చోట్ల మినహా పెద్దగా నష్టం వాటిల్లలేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం తిరుమ‌ల బాగానే ఉంద‌ని, భ‌క్తులు నిర్భయంగా వచ్చి శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపారు.

  అలిపిరి నుంచి తిరుమ‌లకు వ‌చ్చే ఘాట్ రోడ్లలో 13 చోట్ల వ‌ర్షానికి భూమి నాని వ‌దులుకావ‌డంతో రిటైనింగ్ వాల్స్ జారి రోడ్డుకు అడ్డంగా పడ్డాయని ధర్మారెడ్డి తెలిపారు. ప‌లు చోట్ల చెట్ల కూలాయ‌ని, వీట‌న్నింటినీ యుద్ధప్రాతిపదికన తొల‌గించామ‌న్నారు. ప్రస్తుతం ఘాట్ రోడ్లపై ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని చెప్పారు. తిరుమ‌ల నుండి తిరుమ‌ల‌కు వెళ్లే రోడ్డులోనూ ఎలాంటి స‌మ‌స్య లేద‌న్నారాయన. ఈ రెండు ఘాట్ రోడ్లలో నాలుగు రోజుల నుండి వాహ‌నాలు బాగానే రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. భక్తులు ఎలాంటి ఆందోళన లేకుండా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చని ధర్మారెడ్డి తెలిపారు.

  ఇది చదవండి: వీళ్ల వేషాలు చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం..! ఈ విచిత్ర సాంప్రదాయం ఎక్కడంటే..!  ఇక అలిపిరి నడక మార్గం కూడా బాగానే ఉందని కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఇక శ్రీ‌వారి మెట్టు మార్గంలో నాలుగు కల్వర్టులు దెబ్బతిన్నాయని వెల్లడించారు. సామ‌ర్థ్యానికి మించి వర్షపునీరు రావడమే కాకుండా నీటి ప్రవాహంతో బండరాళ్లు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో కల్వర్టులు దెబ్బతిన్నాయన్నారు. కల్వర్టుల వద్దకు వాహనాలు వెళ్లేందుకు వీల్లేదని.. కావున మరమ్మతులకు అవసరమైన సామాగ్రిని మనషులే తీసుకెళ్లాల్సిన రావడంతో మరింత ఆలస్యమవుతుందన్నారు. భ‌క్తులు న‌డించేందుకు వీలుగా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నామ‌ని, అంత‌వ‌ర‌కు ఈ మార్గం మూసి ఉంటుంద‌ని అన్నారు.

  ఇది చదవండి: కొడాలి నాని, అంబటి రాంబాబుకి జ‌గ‌న్ క్లాస్..? ఆ విషయంలో వార్నింగ్ ఇచ్చారా..?  న‌వంబ‌రు 25 నుండి 28వ తేదీ వ‌ర‌కు తిరిగి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు సూచించార‌ని, ఈ మేర‌కు ప‌రిస్థితిని ఎదుర్కొనేందుకు టిటిడిలోని ఇంజినీరింగ్‌, అట‌వీ, ఆరోగ్య, భద్రత త‌దిత‌ర అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉన్నార‌ని తెలిపారు. ఇందుకు అవ‌స‌ర‌మైన జెసిబిలు, హిటాచీలు, ట్రక్కులు, చెట్లు కూలితే వెంట‌నే తొల‌గించేందుకు ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని వివ‌రించారు.

  ఇది చదవండి: మూడు రాజధానులపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన టెక్నికల్, లీగల్ అంశాలు ఇవేనా...?


  బ‌స‌కు సంబంధించి తిరుమ‌ల‌ నారాయ‌ణ‌గిరి విశ్రాంతి గృహంలో రెండు గ‌దులు మాత్రమే దెబ్బతిన్నాయని, మిగ‌తా చోట్ల 7 వేల గ‌దుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని తెలిపారు. అన్న‌దానం, క‌ల్యాణ‌క‌ట్ట‌, శ్రీ‌వారి ఆల‌యం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఎలాంటి ఇబ్బందు లేవ‌ని, భ‌క్తులు నిస్సంకోచంగా తిరుమ‌ల‌కు వ‌చ్చి స్వామివారిని దర్శించుకోవచ్చని ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Tirumala, Tirumala tirupati devasthanam, Ttd