హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TTD: టీటీడీ కీలక నిర్ణయం.. 10 రోజుల పాటు వాటికి బ్రేక్.. భక్తుల కోసమేనన్న అధికారులు

TTD: టీటీడీ కీలక నిర్ణయం.. 10 రోజుల పాటు వాటికి బ్రేక్.. భక్తుల కోసమేనన్న అధికారులు

భక్తుల పాలిట కలియుగ దివ్యధామం తిరుమల పుణ్యక్షేత్రం ( Tirumala Temple). శ్రీ వేంకటేశ్వరుడు (Lord Venkateswara) కొలువైన పరమపవిత్రమైన ప్రదేశం ఏడు కొండలు. అందుకే ఆ వెంకన్న దర్శనానికి ఎంతో డిమాండ్. నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. కరోనా కారణంగా టీటీడీ (TTD) పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తోంది.

ఇంకా చదవండి ...

  GT Hemanth Kumar, Tirupathi, News18

  భక్తుల పాలిట కలియుగ దివ్యధామం తిరుమల పుణ్యక్షేత్రం (Tirumala Temple). శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన పరమపవిత్రమైన ప్రదేశం ఏడు కొండలు. అందుకే ఆ వెంకన్న దర్శనానికి ఎంతో డిమాండ్. నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. కరోనా కారణంగా టీటీడీ (TTD) పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తోంది. ప్రస్తుతం శ్రీవారిని దర్శించుకోవాలంటే ఉన్న మార్గాలు మూడు మాత్రమే. ఆన్ లైన్లో టోకెన్ విధానం (TTD Online Darshan Tokens), శ్రీవాణి ట్రస్ట్ ద్వారా, తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, టీటీడీ పాలకమండలి సభ్యులు, ఛైర్మన్ సిఫార్సులు పొందితేనే తిరుమలకు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనాలకు భారీ డిమాండ్ నెలకుంటోంది. ఆన్లైన్ లో టిక్కెట్లు పొందలేని వంద మందిలో 10శాతం మంది శ్రీవాణి వైపు మొగ్గు చూపితే.... మిగిలిన 90శాతం మంది సిఫార్సు లేఖలపై ఆధారపడుతున్నారు. తెలుగు రాష్ట్రలో ఏ ఎమ్మెల్యేలను అడిగిన మా దగ్గర మరో రెండు, మూడు నెలల వరకు తిరుమల దర్శనం సిఫార్సు లేఖలు ఖాళీ లేవని తేల్చిచెప్పేస్తున్నారు.

  సాధారణ రోజుల్లో ఇవ్వన్నీ సజావుగా సాగుతున్నా.. ప్రత్యేక పర్వ దినాల్లో మాత్రం టీటీడీ అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తోందిది. శ్రీవారికి అత్యంత విశేషమైన రోజుగా భావించే వైకుంఠ ఏకాదశి నాడు స్వామి వారి దర్శన భాగ్యం కల్పిచాలనే ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. వివిఐపిలు కాకుండా వారి బంధువులకు దర్శనం కల్పించాలని సిఫార్సు లేఖలు పంపుతుంటారు. అయితే గతంలో ఉత్తర ద్వారా దర్శనాలు కేవలం రెండురోజులు మాత్రమే ఉండేవి.

  ఇది చదవండి: ధనుర్మాసంలో శ్రీవారికి జరిగే ప్రత్యేక సేవలివే..! ఈ మాసంలో సుప్రభాతసేవ ఎందుకు ఉండదో తెలుసా...?

  మఠాధిపతులు, పీఠాధిపతుల అనుమతితో 10 రోజుల పాటు ఉత్తరద్వార దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో గత ఏడాది నుంచి 10 రోజుల పాటు ఉత్తర ద్వారా దర్శన భాగ్యం భక్తులకు కల్పిస్తోంది టీటీడీ. అయినా టీటీడీపై ఒత్తిడి ఏమాత్రం తగ్గలేదని చెప్పుకోవాలి. సామాన్య భక్తులకు ఉత్తర ద్వారా దర్శనభాగ్యం కల్పించాలన్న టీటీడీ ప్రయత్నంకు సిపార్సు లేఖలు గండికొడుతున్నాయి. వీవీఐపీల తాకిడి ఎక్కువైతే అనుకున్న సమయంలో సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించే వీలు ఉండదు. దీంతో ఈ పదిరోజుల పాటు వీవీఐపీల సిఫార్సు లేఖలను అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

  ఇది చదవండి: శ్రీవారి ఆలయం గురించి ఈ విశేషాలు తెలుసా..? అడుగడుగునా గోవిందుడి ప్రతిరూపాలే..!

  జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22 వ తేదీ అర్ధరాత్రి వరకు పది రోజుల పాటు కల్పిచే వైకుంఠ ద్వార దర్శనం కోసం విఐపి లు సిఫారసు లేఖలు పంపవద్దని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లో ముందుగానే దర్శనం టికెట్ బుక్ చేసుకున్న సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని టీటీడీ కి సహకరించాలని ఆయన కోరారు. పది రోజుల పాటు ఛైర్మన్ కార్యాలయం లో కూడా సిఫారసు లేఖలు స్వీకరించబోమని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

  ఇది చదవండి: తిరుమల శ్రీవారి సుప్రభాత సేవకు ఎందుకంతటి ప్రాముఖ్యత..? ఈ పూజలో ఎన్ని ఘట్టాలుంటాయో తెలుసా..?

  కోవిడ్ కారణంగా తిరుమలలో గదుల మరమ్మతులు చేపట్టినందువల్ల వైకుంఠ ఏకాదశి రోజున ప్రజాప్రతినిధులకు తిరుమలలోని నందకం, వకుళ ఆథితి గృహాల్లో వసతి కల్పిస్తున్నామని, ఒక వేళ తిరుమలలో వసతి సరిపోక పోతే తిరుపతి లోనే బస పొందేందుకు సిద్ధపడి టీటీడీ తెలిపింది. సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోందని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. జనవరి 13వ తేదీ నుంచి 22వరకు వీఐపీలు., వీవీఐపీలు స్వయంగా కుటుంబ సభ్యులతో కలసి వస్తేనే శ్రీవారి దర్శనభాగ్యం కల్పిస్తామని, సిపార్సు లేఖలపై దర్శనభాగ్యం కల్పించలేమని స్పష్టం చేశారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  First published:

  Tags: Andhra Pradesh, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd news

  ఉత్తమ కథలు