హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala: తిరుమలలో భక్తుకు అనుమతి రద్దు.. ఎందుకో తెలుసా..?

Tirumala: తిరుమలలో భక్తుకు అనుమతి రద్దు.. ఎందుకో తెలుసా..?

తిరుమలలో అనూహ్య రద్దీ

తిరుమలలో అనూహ్య రద్దీ

TTD Alert: తిరమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది.. తిరుమలలో భక్తులకు.. అనుమతిని రద్దు చేసింది. అది కూడా బ్రహ్మోత్సవాలు నిలిచిపోయిన తరువాత ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా?

 • News18 Telugu
 • Last Updated :
 • Tirumala, India

  GT Hemanth Kumar, Tirupathi, News18

  TTD Alert:  ఆపద మొక్కులవాడు కొలువై ఉన్న దివ్య ధామం తిరుమల (Tirumala) పుణ్యక్షేత్రం.. కలియుగంలో భక్తులను రక్షించే దైవంగా, సకల‌ పాపాలను తొలగించే ఆనంద నిలయుడి దర్శనం ఎన్నో‌ జన్మల పుణ్యఫలం.. అందుకే ఏడుకొండల్లో‌ నెలవై ఉన్న.. శ్రీ వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) దర్శనానికి  అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటూ ఉంటారు.. అందుకే నిత్యం భక్తుల గోవింద నామ స్మరణలతో ఏడు కొండలు మారుమ్రోగుతున్నాయి.. ప్రస్తుతం వరుస సెలవులు, వారంతరం, పెరటాసి మాసం కావడంతో తిరుమల పుణ్యక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది..

  సుదూర ప్రాంతాల‌ నుండి విచ్చేసిన భక్తులతో వైకుంఠం‌ క్యూ కాంప్లెక్స్ 1, 2 లోని కంపార్ట్మెంట్లు, నారాయణ గిరి ఉద్యానవనం లోని షెడ్లు అన్ని భక్తులతో నిండి పోయి గోగర్భం డ్యాం వరకూ క్యూలైన్స్ లో భక్తులు నిరీక్షిస్తున్నారు అంటే ఎంత రద్దీ ఉందో అర్థం చేసుకోవచ్చు.. గత కొద్ది రోజులు తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుండంతో సామాన్య భక్తులకు పెద్ద పీట వేసే విధంగా చర్యలు చేపడుతున్నారు.

  మరోవైపు సామాన్య భక్తులకు‌ కల్పించే సౌఖర్యాలపై ఎప్పటికప్పుడు టిటిడి అధికారులతో సంప్రదిస్తూ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.. అంతే కాకుండా అధికారులు భక్తుల రద్దీ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ‌మెరుగైన సేవలు అందించాలని‌ టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి ఆదేశాలు జారీ చేశారు..

  తిరుమల కొండ భక్తజనంతో నిండి పోయింది.. దీంతో టీటీడీ యాత్ర సదన్, కల్యాణ కట్ట,అన్నదాన సత్రం, లడ్డూ వితరణ కేంద్రం, అఖిలాండం, ఇతర యాత్రా ప్రదేశాలు వంటి ప్రాంతాల్లో భక్తులతో కిటకిట లాడుతున్నాయి.

  ఇదీ చదవండి : సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు.. అన్న కోసం ఏం చేశానో క్లారిటీ ఇచ్చిన షర్మిల

  వేలాది సంఖ్యలో‌ భక్తులు వివిధ మార్గాల ద్వారా ఒక్కసారిగా తిరుమలకు చేరుకోవడంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు..‌ భక్తుల ఇబ్బందులను టీటీడీ దృష్టిలో ఉంచుకొని భక్తులు అధికంగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో పుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసి త్రాగునీరు, అల్పాహారంతో పాటు పాలు అందిస్తోంది. సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేస్తూ శుక్రవారం, శనివారం, ఆదివారం రోజుల్లో‌ సిఫార్సు లేఖలను రద్దు చేస్తూ నిర్ణయం‌ తీసుకుంటూ, కేవలం ప్రోటోకాల్ భక్తులకే పరిమితం చేసింది.

  ఇదీ చదవండి : 128 వెరైటీ వంటకాలు.. కొత్త అల్లుడికి గోదారోళ్లను మించి మర్యాద.. నోరెళ్లబెట్టాల్సిందే

  ఇక ఆన్లైన్ ద్వారా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందిన భక్తులకు నాలుగు గంటల సమయంలోనే స్వామి వారి దర్శనం లభించగా, సామాన్య భక్తులకు "48 గంటల సమయం" పడుతోంది. స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు‌ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో పాలు, అల్పాహారం వితరణ కార్యక్రమంను చేపడుతుంది.

  శుక్ర, శని, ఆదివారాలు కావడంతో‌ స్వామి వారి దర్శనం అధికంగా చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అందుకే భక్తులు తిరుమల ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. తాత్కాలికంగా

  భక్తులు యాత్రను వాయిదా వేసుకోవాలి టీటీడీ సూచించింది. తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, గోగర్భం దగ్గర గల క్యూలైన్ ను టిటిడి అధికారులతో కలిసి టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి పరిశీలించారు. టీటీడీ కల్పిస్తున్న సౌఖర్యాలను భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే క్యూలైన్ ఎండ్ పాయింట్ వరకు భక్తులు వేచి ఉన్నారని.. ఇకపై క్యూలైన్ లోకి వస్తున్న భక్తులను రేపు ఉదయం రావాలని ఆయన సూచించారు.. ఫ్రీ బస్సుల ద్వారా భక్తులను విశ్రాంతి నిలయాలకు పంపుతున్నాంమని, పోలీస్ డిపార్ట్మెంట్ మంచి సహకారం అందిస్తుందన్నారన్నారు.

  ఇదీ చదవండి : కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఏపీ తొలి ఎంపీ అభ్యర్థి..? ఎవరో తెలుసా..?

  భక్తులకు అన్నప్రసాదం, నీళ్లు, పాలు శ్రీవారి సేవకులు అందిస్తున్నారని, భారీ స్థాయిలో తిరుమలకి చేరుకున్న భక్తులకు కొంత అసౌకర్యం తప్పదన్నారు.. తిరుమలకు వచ్చే భక్తులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరుతున్నాంమని ఆయన అన్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirumala tirupati devasthanam, Ttd news

  ఉత్తమ కథలు