Tirumala Temple: టీటీడీ తీరుపై భక్తుల ఆగ్రహం.., మరీ ఇంత నిర్లక్ష్యమా..?

శ్రీవారి ఆలయం (ఫైల్)

తిరుమల శ్రీవారిని (Tirumala )దర్శించుకోవాలంటే ఆన్ లైన్లో బుక్ చేసుకున్న టోకెన్లు (TTD Online tokens) తప్పనిసరి లేదంటే కొండపైకి అనుమతి లేదు. భక్తుల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న టీటీడీ (TTD) అధికారులు తాము చేయాల్సిన పనుల్లో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు.

 • Share this:
  GT Hemanth Kumar, Tirupati, News18

  తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే (Tirumala Temple Darshan) ఆన్ లైన్లో బుక్ చేసుకున్న టోకెన్లు (TTD Online Tokens) తప్పనిసరి లేదంటే కొండపైకి అనుమతి లేదు. భక్తుల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న టీటీడీ (TTD).., తాను పాటించాల్సిన పద్ధతులు మాత్రం తుంగలో తొక్కుతోంది. ఇప్పటికే పలు అంశాల్లో భక్తుల ఆగ్రహానికి గురవుతున్న టీటీడీ.. ఇప్పుడు మరోసారి విమర్శలపాలవుతోంది. తిరుమలలో గదిని తీసుకోవాలంటే అద్దెతో పాటు అంతే మొత్తం అదనంగా డిపాజిట్ చేయాలి. భక్తులు ఖాళీ చేసే సమయంలో తిరిగి చెల్లిస్తారు. ఐతే కరోనా దృష్ట్యా కాషన్ డిపాజిట్ తిరిగి పొందే సమయంలో భక్తులు ఇబ్బంది పడుతుండటంతో టీటీడీ ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కొత్త విధానం అంటూ ప్రకటించిన టీటీడీ అమలు విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో పూర్తవ్వాల్సిన ప్రక్రియను నెలల తరబడి జాప్యం చేస్తోంది.

  శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం తిరుమలలో రూ.50 నుంచి రూ.6వేల ధర వరకు గదులు ఉన్నాయి. తిరుమలలో దాదాపు 7,200 గదులు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రస్తుతం ఆధునికీకరణ చేపట్టగా అందుబాటులో ఉన్నవాటిని భక్తులకు ఆన్ లైన్లోనూ కరెంట బుకింగ్ ద్వారాను తిరుమలలోని సీఆర్వో, మరో 12 కౌంటర్లు, పద్మావతి విచారణ కార్యాలయం, ఎంబీసీల వద్ద కేటాయిస్తుంటారు.

  ఇది చదవండి: డ్రగ్స్ వ్యవహారంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్.. అధికారులకు కీలక ఆదేశాలు..


  ప్రస్తుతం రూ.50 నుంచి రూ.1000 లోపు ఉన్న గదులకు సంబంధించిన అద్దెతోపాటు రూ.500.., అలాగే రూ.1000 నుంచి రూ.6 వేల వరకు ఉండే గదులకు అంతే మొత్తంలో కాషన్ డిపాజిట్ వసూలు చేస్తోంది. గదిని ఖాళీ చేసే సమయంలో రూ.500 కాషన్ డిపాజిట్ ను శ్రీవారి ధనప్రసాదం, నోట్లరూపంలో తిరిగి ఇస్తున్నారు. రూ.1000 మించిన ధరలు కలిగిన గదులకు కార్డు ద్వారానే డిపాజిట్ తీసుకోని.. తిరిగి ఆన్ లైన్లో వారి ఖాతాకు జమ చేస్తోంది. గదులు ఖాళీ చేసిన సమయంలో భక్తుల మొబైల్ ఫోన్ కు వెరిఫికేషన్ కోడ్ పంపుతుంది. కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఒకటి, రెండు రోజుల్లో కాషన్ డిపాజిట్ తిరిగి భక్తుని బ్యాంకు ఖాతాలో జమవుతుందని టీటీడీ చెప్తున్నా.. అది జరగడం లేదు. కొంతమందికి 10రోజులపైనే సమయం పడుతోంది.

  ఇది చదవండి: ఏపీలో స్కూళ్ల మూత తప్పదా... ఒకే బడిలో 72మంది విద్యార్థులకు పాజిటివ్...


  తిరుమలలో కాషన్ డిపాజిట్ నగదు తమ ఖాతాలో జమకావడం లేదని భక్తుల నుంచి ఈ-మెయిల్., డయల్ యువర్ ఈవో కార్యక్రమం., టీటీడీ కాల్ సెంటర్ ద్వారా భారీగా పిర్యాదులు అందుతున్నాయి. భారీగా వస్తున్న విన్నతుల దృష్ట్యా ఆదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆగస్టు నెలలో సంబంధిత అధికారులతో సమావేశం అయ్యారు. భక్తులు గదిని ఖాళీ చేసిన తరువాత త్వరగా కాషన్ డిపాజిట్ వారి ఖాతాలో త్వరగా జమకావాలని అధికారులకు సూచనలు చేశారు. భక్తులు గదులు ఖాళీ చేసిన 12 గంటల్లోగా కాషన్ డిపాజిట్ టీటీడీ వారి ఖాతాకు జమచేస్తున్న.., బ్యాంకు నుంచి వెండార్ కు, వెండార్ నుంచి భక్తుల ఖాతాలో జమకావడానికి మూడు రోజుల సమయం పడుతున్నట్లు అంచనా వేశారు. దీంతో త్వరగా కాషన్ డిపాజిట్ భక్తుల ఖాతాలో జమ అయ్యేలా బ్యాంక్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

  ఇది చదవండి: ఏపీలో ఈ భాషల్లోనూ చదువు చెప్తారని మీకు తెలుసా..? ఆ ఆరు భాషలు ఇవే..!


  భక్తులు ఇలా చేయాలి..
  టీటీడీ వసూలు చేసిన కాషన్ డిపాజిట్ సకాలంలో వారి ఖాతాలో జమకాకపోతే ఇన్ఫర్మేషన్ అధికారుల దృష్టికి తీసుకువస్తే వెంటనే చర్యలు తీసుకుంటారు. చాలా మంది భక్తులకు మూడు, నాలుగు రోజుల్లోనే కాషన్ డిపాజిట్ వారిఖాతాల్లో జమవుతోంది. ఒకవేళ భక్తులకు కాషన్ డిపాజిట్ తిరిగి ఖాతాలో జమకావడంలేదనే ఫిర్యాదులు ఉంటే వాటిని తితిదే వెబ్సైట్ cdmcttd@tirumala.org కిగాని టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదిస్తే కాషన్ డిపాజిట్ నగదు తక్షణంఅయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
  Published by:Purna Chandra
  First published: