Home /News /andhra-pradesh /

TIRUPATI TTD PLANNING TO REDUCE WAITING TIME FOR DARSHAN IN TIRUMALA TEMPLE FULL DETAILS HERE PRN TPT

Tirumala Darshan: రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. టీటీడీ చర్యలు.. సామాన్యులకు కష్టాలు తప్పినట్టేనా..?

తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)

తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)

TTD: గత పాలకమండళ్లు సామాన్య భక్తులకు త్వరిత గతిగా దర్శనభాగ్యం కల్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేసాయి. అవన్నీ కొంతమేరకు మంచి ఫలితాలను ఇచ్చిన భక్తుల తాకిడి అధికంగా ఉండే సమయంలో ఏమాత్రం ఉపయోగ పడలేదు.

  GT Hemanth Kumar, News18, Tirupati

  భక్త కౌశల్యుడు.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.., ఆపదలో ఆదుకునే అనాధ రక్షకుడు... శ్రీవేంకటేశ్వరుడు వెలసిన దివ్యక్షేత్రం తిరుమల (Tirumala) కొండ. అందుకే కలియుగంలో వెంటాద్రికి మించిన క్షేత్రం లేదు... వేంకటేశ్వరుని మించిన దైవం లేదంటూ వేదాలు చెప్తుంటాయి. స్వయం వ్యక్తమై వెలసిన స్వామి వారిని దర్శించి... తరిస్తే సకల పాపాలు తొలగుతాయని భక్తకోటి విశ్వాసం. సంవత్సరాలు పెరుగినట్లుగానే... తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతానికి శ్రీవారి దర్శనానికి వివిధ టిక్కెట్ల ద్వారా దర్శనభాగ్యం పొందవచ్చు. శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలు.,నిత్య సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్యదర్శనం, వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం, సుపథం., సర్వ దర్శనం అంటూ పలువిధాలుగా దర్శించుకొనే బాగ్యాని కల్పిస్తోంది టీటీడీ. ఇలా సామాన్య భక్తుల నుంచి వీఐపీలు, వివిఐపిలు శ్రీవారిని దర్శించుకుంటున్నారు.

  గత పాలకమండళ్లు సామాన్య భక్తులకు త్వరిత గతిగా దర్శనభాగ్యం కల్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేసాయి. అవన్నీ కొంతమేరకు మంచి ఫలితాలను ఇచ్చిన భక్తుల తాకిడి అధికంగా ఉండే సమయంలో ఏమాత్రం ఉపయోగ పడలేదు. ముందుగా భక్తులకు సమయ నిర్దేశం చేసి టైం స్లాట్ ఇవ్వడం ద్వారా భక్తులు క్యూలైన్లో భక్తులు ఎదురుచూసే సమయాన్ని తగ్గించొచ్చని టీటీడీ భావించింది. అనుకున్న విధానాన్ని అమలు చేసేందుకు 2009 నాటికే నగదు చెల్లింపు చేసే దర్శనాలన్నీ టైం స్లాట్ విధానానికి వెళ్లిపోయాయి. వీఐపీ బ్రేక్, రూ.300 దర్శనాలు, ఆర్జితసేవా టికెట్లు కలిగిన భక్తులు వారికి కేటాయించిన సమయానికి వస్తే గంట నుంచి గంట న్నర వ్యవధిలో శ్రీవారిని దర్శించుకునే విధానం అమల్లోకి వచ్చింది. అయితే సర్వదర్శనం భక్తులు నిరీక్షణ సమయం తగ్గించడమే సవాలుగా మారింది.

  ఇది చదవండి: తిరుమల శ్రీవారి చెల్లెమ్మ ఈ గంగమ్మ..! ఆ వేషంలో బూతులు తిట్టినా ఏమీ అనరు.. గంగమ్మ జాతర విశేషాలెన్నో..


  నిమిషానికి 89 మందికి దర్శనభాగ్యం..!
  స్వామి వారికి నిత్యం జరిగే ఉపచారాలు., నిత్య ఆరాధనలు., స్వామి వారు నిదురించే సమయం పోను సామాన్య భక్తులకు 16 గంటలు మాత్రమే భాగ్యం కల్పించగలరు టీటీడీ అధికారులు. కనీవినీ ఎరుగని రీతిలో శ్రీవారి దర్శనానికి రోజురోజు పెరిగిపోతున్న సంఖ్య వల్ల గర్భగు డిలోని మూర్తిని దర్శించుకునే సమయం తగ్గిపోతూ వస్తోంది. భక్తుల సంఖ్యను, దర్శనాల సమయంతో పోల్చి లెక్కిస్తే ఒక భక్తుడు లేదా భక్తురాలికి స్వామిని దర్శించుకోవడానికి దక్కుతున్న సమయం ఒక సెకనుకు మించి లేదు. అయితే ఇది స్వామి ముందు నిలబడే సమయం మాత్రమే. నిజానికి ఆలయంలో లోపలికి అడుగుపె టాక ఒకరివెనుక ఒకరు వరుసగా కదు లుతూ నిలువెత్తు స్వామిని కనులారా దర్శించుకుంటారు. ఈ సమయమంతా కూడా స్వామిని దర్శించుకుంటూనే నడుస్తారు కాబట్టి ఒక సెకను మాత్రమే అనే అభిప్రాయం కలగదు. ప్రస్తుతం నిమిషానికి 89 మంది దర్శనం చేసుకుంటున్నారు.

  ఇది చదవండి: ఏపీలో పురాతనమైన కాలేజీ ఇదే..! హిస్టరీ తెలిస్తే వారెవా అంటారు..


  రెండు గంటల్లోనే శ్రీవారి దర్శన భాగ్యం
  శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని టీటీడీ టైం స్లాట్ విధానంపై ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సాఫీగా కలియుగ దైవాన్ని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. గతంలో మాదిరిగా కంపార్ట్ మెంట్లలో వేచియుండే పనిలేకుండా సర్వదర్శనం టిక్కెట్లు పొంది వచ్చిన టైం ప్రకారం క్యూలైన్ లోకి వెళితే గంట నుంచి ఒకటిన్నర్ర గంటలో స్వామి వారి దర్శన భాగ్యం కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గతంలో వచ్చిన అంశాలు దృష్టిలో ఉంచుకొని... అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ టైం స్లాట్ అమలు చేయనుంది టీటీడీ. ఇందుకు సామాన్య భక్తుల సహకారం ఉంటే శ్రీవారిని మతింత త్వరగా దర్శించాకోవచ్చని టీటీడీ అంచనా.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Tirumala tirupati devasthanam, Ttd

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు