TTD New: కలియుగ వైకుంఠంగా చెప్పుకునే తిరుమలలో వెలసిన శ్రీనివాసుడు దర్శనానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ వ్యాప్తంగా వెంకన్న స్వామికి భక్తులు ఉన్నారు. ఆయన దర్శన భాగ్యం.. సేవ కోసం పరితపిస్తారు. కొందరు ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకడారు. ఆ క్రేజ్ ను కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. కొత్త కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా అలాంటి దందా ఒకటి వెలుగు లోకి వచ్చింది.
GT Hemanth Kumar, Tirupathi, News18. TTD New: తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనభాగ్యం ఒక్కసారి కలిగితే చాలు అని కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. నెలల ముందు నుంచి స్వామి దర్శనం గురించి ప్లాన్ చేసుకుంటారు.. ఎందుకంటే మన తిరుమలకు ఉన్న గుర్తింపు అలాంటింది. ఒక్కసారి స్వామి దర్శన భాగ్యం దక్కితే.. కోరికలు తీరినట్టే అన్నది కోట్లాది మంది భక్తుల నమ్మకం.. స్వయంగా స్వామి వారే అక్కడ వెలిశారని నమ్ముతారు. అందుకే సీజన్ తో సంబంధం లేకుండా నిత్యం లక్షలాది భక్తులు తిరుమల కొండకు క్యూ కడుతుంటారు. కొందరైతే స్వామి వారి దర్శనం, సేవల కోసం ఎంత ఖర్చు చేసేందుకు అయినా వెనుకడుగు వేయరు.. ఆ స్వామికి ఉన్న క్రేజ్ ను కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. అమాయికులను నమ్మించి నట్టేట ముంచేస్తున్నారు. అలాంటి వారి అమాయకత్వాన్ని చూసుకుని.. తిరుమలలో దళారులు మరింత రెచ్చిపోతున్నారు. కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయక భక్తులను నిలువు దోపిడీ చేసేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా భక్తులను మోసగిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇటీవల బ్లాక్ వెబ్ సైట్ లు, బ్లాక్ టికెట్ల వ్యవహారం వెలుగులోకి రావడంతో.. దానిపై పోలీసులు ఫోకస్ చేశారు. కఠిన చర్యలు తీసుకున్నారు. అప్పటినుంచి వెబ్ సైట్లపై పటిష్ట నిఘా ఉంచారు. దీంతో రూటు మార్చారు దళారులు. టీటీడీలో అర్చకులుగా పని చేస్తున్నట్లు ఫేస్ బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ లో నకిలీ ఖాతాలు సృష్టించి భక్తులను మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా కొంపెల్ల హరినాగ సాయి కార్తీక్ ను పోలీసులు అదుపులోకి తీసుకుంటే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసా..? భక్తులను ఎలా నట్టేట ముంచాడో తెలిస్తే షాక్ అవుతారు. ఇదీ చదవండి : సీఎం జగన్ కు మరో షాక్.. కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్.. హైకోర్టు ఏం చెప్పిందంటే..?
కార్తీక్ కు సోషల్ మీడియాపై పూర్తి అవగాహన ఉండడంతో గొల్లపల్లి శ్రీనివాస దీక్షితులు, సత్య నారాయణ అవధాని పేర్లతో నకిలీ అకౌంట్లు సృష్టించాడు. శ్రీవారి అభిషేకం, తోమాల, అర్చన, వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఇప్పిస్తానని సోషల్ మీడియా ద్వారా అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అలా నమ్మిన వారిని ట్రాప్ చేసి గూగూల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు పంపమనే వాడు. అలా నకిలీ ఖాతాలతో కార్తీక్ చేస్తున్న మోసాలను టీటీడీ విజిలెన్స్ గుర్తించింది. టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదుతో దళారి హరినాగ సాయి కార్తీక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమలలో దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ అధికారులు కోరుతున్నారు. తిరుమలకు సంబంధించి టికెట్లు, లేదా సేవ ఏదైనా కేవలం టీటీడీ అధికారిక వెబ్ సైట్ లోనే పొందాలను మరోసారి కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.