TIRUPATI TTD IS GETTING READY FOR VAIKUNTHA EKADASHI AND SANKRANTHI FESTIVALS AS OFFICIALS ISSUED NEW RULES IN TIRUMALA FULL DETAILS HERE PRN TPT
Tirumala: వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారి ఆలయం (ఫైల్)
Tirumala Temple: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వ దినాల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి మరింత అధికంగా ఉంటుంది. మరో రెండు రోజుల్లో వైకుంఠ ఏకాదశి ఉండటంతో టీటీడీ (TTDO ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరుని దర్శనార్థం నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమల (Tirumala) కు చేరుకుంటారు. ఇక ప్రత్యేక పర్వదినాల్లో అయితే ఆ సంఖ్యా మరింత పెరుగుతుంది. శ్రీ వేంకటేశ్వరునికి ఎంతో విశిష్టతగా భావించే... వైకుంఠ ఏకాదశి., ద్వాదశి పర్వ దినాల్లో భక్తుల తాకిడి మరింత అధికంగా ఉంటుంది. అత్యధిక స్థాయిలో ఒక రోజుకు లక్ష మంది భక్తులకు మాత్రమే టీటీడీ (TTD) దర్శన భాగ్యం కల్పించే సౌకర్యం ఉంది. ప్రస్తుతం కోవిడ్ ప్రోటోకాల్ అమలు చేస్తున్న నేపథ్యంలో రోజులు పరిమిత సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. ఆన్లైన్ ద్వారా రోజుకు 20 వేల మంది భక్తులకు., ఆన్లైన్ ఫ్రీ దర్శనం టిక్కెట్లు (TTD Free Darshan Tokens) 10 రోజుల పాటు రోజుకు 5 వేల చొప్పున 50 వేల టిక్కెట్లను విడుదల చేసింది. ఇక శ్రీవాణి., ఇతర దర్శనాలు., టీటీడీ ఉద్యోగులు., వివిఐపిలు అంటూ రోజుకు మరో 5 వేల మంది భక్తులకు దర్శనాన్ని కల్పించే విధంగా చర్యలు చేపట్టారు. ఇక తిరుమల స్థానికులకు రోజుకు 5వేల టిక్కెట్లు చొప్పున మరో 50 వేల టిక్కెట్లను జారీ చేసింది టీటీడీ. దింతో రోజుకు 40 వేల నుంచి 50 వేల మందికి శ్రీవారి దర్శన భాగ్యం కలుగనుంది.
అందుబాటులోకి రెండో ఘాట్ రోడ్
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ఘాట్ రోడ్డు మరమ్మతులు దాదాపు పూర్తయ్యాయి. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళే రెండవ ఘాట్ రోడ్డు భక్తులకు అందుబాటులోకి రానుంది. 13న వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 11వ తేదీ రాత్రి నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేనందుకు టీటీడీ అధికారులు చకచకా పనులు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేయాలనీ చైర్మన్ ఆదేశించారు. ఈ మెరకుఅధికారులు 11వ తేదీ రాత్రి నుంచి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఘాట్ రోడ్డు భక్తులకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టు సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. పనులు వేగంగా సాగితే 11వ తేదీ మధ్యాహ్నం లోపు ట్రయిల్ రన్ సాగెెే అవకాశం ఉంది.
కరోనా నిబంధనలు మరింత కఠినం
దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనం దృష్ట్యా తిరుమలలో కోవిడ్ మార్గదర్శకాలు మరింత కఠినంగా అమలు చేయాలని టీటీడీ ఉన్నతాధికారులకు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆదేశించారు. వైకుంఠ ఏకాదశి., ద్వాదశి పురస్కరించుకొని సమీక్షా నిర్వహించిన చైర్మన్... కోవిడ్ మార్గదర్శకాల అమలు పై సమీక్షించారు. జనవరి 13వ తేదీ వైకుంఠ ఏకాదశి,14వ తేదీ ద్వాదశి ద్వాదశి తో పాటు మిగిలిన 8 రోజులు భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు.
జనసమూహం ఉండే ప్రాంతాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లు, శ్రీవారి ఆలయంలో శానిటైజర్లు అందుబాటులోకి తీసుకు రానున్నారు. ప్రతి ఒక్క భక్తుడు, ఉద్యోగులు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చర్యలు చర్యలు చేపట్టనున్నారు. మాస్క్ పై భక్తులకు అవగాహన కల్పించేందుకు ప్రసారాలు., సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో క్యూ లైన్, శ్రీవారి ఆలయంలో భక్తులు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోనున్నారు.
భక్తులు తోపులాటకు దిగకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళేలా ఏర్పాట్లని ఇప్పటికే పూర్తి చేసారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, అధికారులు, ఉద్యోగులకు సహకరించాలని ఛైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్., వాక్సినేషన్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమలకు అనుమతించనున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.