హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala: తిరుమలలో వసతి గృహాల అద్దెలను భారీగా పెంచిన టీటీడీ ..ఇదేం బాదుడు అంటున్న భక్తులు

Tirumala: తిరుమలలో వసతి గృహాల అద్దెలను భారీగా పెంచిన టీటీడీ ..ఇదేం బాదుడు అంటున్న భక్తులు

TIRUMALA ROOMS RENT

TIRUMALA ROOMS RENT

Tirumala: నిత్యకొండపైకి ఎక్కి ..ఏడు కొండలస్వామికి మొక్కులు తీర్చుకునే భక్తులకు అక్కడ టీటీడీ అద్దెకు ఇచ్చే వసతి గదుల అద్దె పెంచడం భక్తుల జేబులకు చిల్లు పెట్టే విధంగా ఉంది. నిన్నటి వరకు సాధారణ భక్తులకు సైతం అందుబాటులో ఉండే విధంగా వందల్లో ఉండే గదులు..ఇప్పుడు వేల రూపాయలకు చేర్చింది పాలక మండలి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Tirumala, India

తిరుమల(Tirumala)శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం నిత్యం దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులతో మొక్కులు చెల్లించుకునే వేలాది మందితో నిత్య కల్యాణం పచ్చతోరణంగా వర్ధిల్లుతోంది. నిత్యకొండపైకి ఎక్కి ..ఏడు కొండలస్వామికి మొక్కులు తీర్చుకునే భక్తులకు అక్కడ టీటీడీ(TTD)అద్దెకు ఇచ్చే వసతి గదుల(Rest rooms)అద్దె పెంచడం భక్తుల జేబులకు చిల్లు పెట్టే విధంగా ఉంది. నిన్నటి వరకు సాధారణ భక్తులకు సైతం అందుబాటులో ఉండే విధంగా వందల్లో ఉండే గదులు..ఇప్పుడు వేల రూపాయలకు చేర్చింది పాలక మండలి. అసలు కొండపై ఉన్న వసతి గదులు ఏంటీ...గతంలో ఉన్న అద్దెలు ఎంత..? ఇప్పుడు పెంచిన ధర ఎంతో ? తెలిస్తే షాక్ అవుతారు.

Tirumala: తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం టికెట్లు..జనవరి, ఫిబ్రవరి కోటా ఎప్పుడు విడుదల చేస్తున్నారంటే..?

కొండపై బాదుడు..

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి నిత్యం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారి దర్శనభాగ్యంతో పాటు మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చి కొండపైన వసతి పొందుతారు. కొండపైకి వచ్చే భక్తుల కోసం టీటీడీ వసతి గృహాలను అద్దెకు ఇస్తూ వస్తోంది. భక్తుల నుంచి సాధారణ అద్దె (Rents)వసూలు చేస్తున్న టీటీడీ ఇప్పుడు వాటి ధరల్ని అమాంతం పెంచేసింది. ముఖ్యంగా సామాన్య భక్తులు ఒక రోజు ఉండి దర్శనం, మొక్కులు తీర్చుకునేందుకు నందకం, పాంచజన్యంస కౌస్తుభం, వకుళమాత వసతి గృహాల్లో ఉండేవారు. గతంలో ఈ వసతి గృహాల్లో 500 నుంచి 600రూపాయలు వసూలు చేసే వాళ్లు. కాని ప్రస్తుతం జీఎస్టీతో కలిపి 1000 రూపాయలకు చేశారు.

భక్తుల జేబులకు చిల్లు..

అలాగే నారాయణగిరి రెస్ట్‌ హౌస్‌లో కూడా 1,2,3గదులను 150-250ఉండే అద్దెను జీఎస్టీతో కలిపి 1700రూపాయలకు పెంచారు. ఇక రెస్ట్ హౌస్‌లోని 4లోని ఒక్క గది అద్దె 750ఉండగా దానికి వెయ్యి రూపాయలు అదనంగా పెంచి 1700 చేశారు. ఇక కార్నర్ సూట్‌ను జీఎస్టీతో కలిపి 2200రూపాయలు, స్పెషల్ టైప్ కాటేజీల్లో 750రూపాయల గదిని 2800రూపాయలకు పెంచి భక్తులపై అధిక భారాన్ని మోపుతోంది టీటీడీ.

వందల్లోంచి వేలల్లోకి ..

ఇక గది అద్దెతో పాటు అంతే మొత్తం నగదు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుందని కొత్త ప్రతిపాదన కూడా పెట్టింది టీటీడీ. అంటే 1700రూపాయల గది అద్దెకు కావాలంటే అడ్వాన్స్‌తో కలిపి 3400చెల్లించాల్సి ఉంటుంది. గదుల అద్దెలు పెంచి ఆదాయం పెంచుకోవాలని చూస్తున్న టీటీడీ పాలక మండలి నిర్ణయంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామి భక్తులను నిలువు దోపిడీ చేసుకోవడం ఎంత మాత్రం సరికాదని అంటున్నారు. జనవరి 1వ తేది నుంచి పెంచిన ధరలు వసూలు చేస్తుండటం విశేషం.

APSRTC: పండుగ కోసం ప్రారంభమైన ప్రత్యేక బస్సులు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ఆర్టీసీ

సౌకర్యాల పెంచడం కోసమే ..

అయితే వసతి గృహాల అద్దె రేట్లను పెంచడంపై టీటీడీ పాలక మండలి వివరణ ఇచ్చింది. భక్తుల నుంచి వస్తున్న నిరసనలు, అసహనానికి చింతిస్తున్నట్లు తెలిపుతూనే తిరుమలలో ఉన్న 6వేల గదుల్లో ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగింది. దీనికి 110కోట్ల రూపాయలతో టెండర్లు ఆహ్వానించింది. ఏసీ, గీజర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తుండటం వల్లే అద్దెలు పెంచాల్సి వచ్చిందని వివరణ ఇస్తోంది. ఇవే కాదు సామాన్య భక్తులు బస చేసే 50, 100రూపాయలకు లభించే గదుల అద్దెను కూడా త్వరలోనే పెంచుతామని ప్రకటించింది.వాటిల్లో కూడా ఆధునీకరణ పనులు పూర్తి చేసిన తర్వాత పెంచబోతున్నట్లుగా ముందుగానే టీటీడీ పాలకమండలి వెల్లడించింది.

First published:

Tags: Andhra pradesh news, Tirumala news

ఉత్తమ కథలు