Tirumala: కలియుగ వైకుంఠం తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) దివ్యక్షేత్రం నిత్యం దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులతో నిత్య కల్యాణం పచ్చతోరణంగా వర్ధిల్లుతోంది. నిత్యం కొండపైకి ఎక్కి .. ఏడు కొండలస్వామికి మొక్కులు తీర్చుకునే భక్తులకు అక్కడ టీటీడీ(TTD) అద్దెకు ఇచ్చే వసతి గదుల (Rest rooms) అద్దె పెంచడం పై దుమారం రేగుతోంది. ఇప్పటికే పలువురు భక్తులు టీటీడీ తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికే అక్కడ వివిధ రూపాల్లో దోపిడీ చేస్తున్నారని.. ఇప్పుడు అద్దెలు పెంచి భక్తుల జేబులకు చిల్లు పెడతారా అని ప్రశ్నిస్తున్నారు. ఇటు వివిధ రాజకీయ పార్టీలు కూడా టీటీడీ నిర్ణయాన్ని తప్పు పడుతున్నాయి. ఈ వివాదం మరింత ముదురుతుండడంతో.. టీటీడీ అద్దె పెంపుపై వివరణ ఇచ్చింది.
గదుల ధరల పెంపు విషయంలో రాజకీయం చేయడం చాలా బాధాకరం అన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. అసలు అద్దె ఏ గదులకు పెంచామనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.. తిరుమలలో మొత్తం 7500 గదులు, నాలుగు యాత్రిక సదన్‌లు ఉన్నాయన్నారు. ప్రస్తుతం 50, 100 రూపాయల గదులు 5 వేలు ఉన్నాయన్నారు.. ఈ ధరలు 40 సంవత్సరాల క్రితం నిర్ణయించినవి అని గుర్తు చేశారు.
ఇప్పటి వరకు మార్చిందే లేదన్నారు.. తిరుమలలో 120 కోట్ల రూపాయలతో పలు గదులను ఆధునీకరించామని.. 50, 100 రూపాయల గదులల్లో ఫ్లోరింగ్, గ్రీజర్లు వంటివి కల్పించామని వివరించారు.. పద్మావతీ, ఎంబీసీ కార్యాలయాల్లో ప్రముఖులకు ఇచ్చే గదులు ఉంటాయని.. నారాయణగిరి, ఎస్వీ అతిధి గృహం, స్పెషల్ టైప్ అతిధి గృహాలు వీఐపీ కోటా కింద గదులు ఉంటాయని.. ఎంబీసీ కార్యాలయం కింద ఉన్న ఈ మూడు అతిధి గృహాలకు సంబంధించి గదుల ధరలను మాత్రమే పెంచామని ఆయన వివరణ ఇచ్చారు.
ఇదీ చదవండి : సీఎం జగన్‌తో సోమేశ్ కుమార్ భేటీ.. ఏం చేయబోతున్నారంటే..?
పద్మావతీ, ఎంబీసీ కార్యాలయాలకు సంబంధించి వ్యత్యాసం లేకుండా చేయాలని పెంచినట్టు క్లారిటీ ఇచ్చారు. 8 కోట్ల రూపాయల వ్యయంతో ఈ అతిధి గృహాలను ఆధునీకీకరించామని వెల్లడించారు.. 170 గదులను పూర్తిగా మరమ్మత్తులు చేసి వ్యత్యాసం ధరలు పెంచినట్టు చెప్పుకొచ్చారు. మిగతా 50, 100 గదుల ధరలు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. మరమ్మతులు చేసిన గదులకు ఐదు లక్షల చొప్పున ఖర్చు చేశామని వివరించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.
ఇదీ చదవండి : కోడి పందాలతో మంత్రి రోజా సందడి.. ముందుగానే మొదలైన సంక్రాంతి సంబరాలు
మరోవైపు టీటీడీ తీరుపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులు పెంచిన రేట్లను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ . హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ అవలంభిస్తున్న వైఖరి మానుకోవాలని రాజమండ్రిలో నిరసనకు దిగారు బీజేపీ నేతలు. టీటీడీ చర్యలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట సోము వీర్రాజు బైఠాయించి నిరసన తెలియజేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tirumala, Tirumala Temple, Ttd, Ttd news