Home /News /andhra-pradesh /

TTD: వరదలతో టీటీడీకి భారీ ఆస్తినష్టం.., రూపుకోల్పోయిన తిరుమల పరిసరాలు

TTD: వరదలతో టీటీడీకి భారీ ఆస్తినష్టం.., రూపుకోల్పోయిన తిరుమల పరిసరాలు

టీటీడీకి భారీ ఆస్థినష్టం

టీటీడీకి భారీ ఆస్థినష్టం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా తిరుమల (Tirumala), తిరుపతి (Tirupathi) లో భారీ వర్షాలు కురిశాయి. వరద ధాటికి టీటీడీకి (TTD) భారీగా ఆస్థినష్టం వాటిల్లింది.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, Tirupathi, News18

    బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా తిరుమల (Tirumala), తిరుపతి (Tirupathi) లో భారీ వర్షాలు కురిశాయి. తిరుమలలో 30 ఏళ్లుగా కనివిని ఎరుగని రీతిలో తీవ్ర స్థాయిలో వర్షాలు కుండపోతగా పడటం ఇదే ప్రధమం. నవంబరు 17 నుంచి 19 వ తేదీ వరకు తిరుమల, తిరుపతిలో ఇంత స్థాయిలో కురిసిన వర్షాలతో టీటీడీకి భారీగా ఆస్థినష్టం సంభవించింది. ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్ లు పొంగి పొర్లి కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంపునకు గురైయ్యాయి. వర్షాల వల్ల తిరుమల లో రూ 4 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేశారు టీటీడీ అధికారులు.

    తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని అక్కగార్ల గుడి వద్ద రక్షణ గోడ దెబ్బతిని, ఘాట్ రోడ్డులో నాలుగు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. టిటిడి సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి వీటిని తొలగించి తాత్కాలిక రక్షణ ఏర్పాట్లతో ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. ఇక రెండవ ఘాట్ రోడ్డులో 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయి. ఐదు ప్రాంతాల్లో రిటెయినింగ్ వాల్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. టీటీడీ అధికారులు, సిబ్బంది దాదాపు ఒక్క రోజంతా ఈ ఘాట్ రోడ్డులో శ్రమించి కొండ చరియలను తొలగించారు. 20వ తేదీ రెండవ ఘాట్ రోడ్డును పునరుద్ధరించారు.

    ఇది చదవండి: అప్పటివరకు అసెంబ్లీకి రావొద్దు.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఆదేశం.. వరద పరిస్థితులపై సమీక్ష



    కొండకు సమీప ప్రాంతంలో ఉన్న నారాయణగిరి గెస్ట్ హౌస్ కు ఆనుకొని ఉన్న రిటైనింగ్ వాల్ పడిపోవడంతో మూడు గదులు దెబ్బతిన్నాయి. నారాయణ గిరి, ఎస్వీ అతిథి గృహాల్లోని యాత్రికులను ముందు జాగ్రత్త గా ఇతర ప్రాంతాలకు తరలించారు. అలిపిరి మెట్ల మార్గంలో కొంతమేరకు రోడ్డు, కొంతమేరకు ఫుట్ పాత్ భారీ వర్షాలకు దెబ్బతినగా.... శ్రీవారి మెట్టు మార్గంలో రోడ్లు దెబ్బతిన్నాయి. ఇక మెట్ల మార్గంలో 1200 మెట్లు విరిగిపోగా... వాటిని మరమత్తులు చేయడానికి మరో నాలుగు రోజులు పట్టె అవకాశం ఉంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వెనుక వైపు ఉన్న గోడతో పాటు, రాంనగర్, వినాయక నగర్, జిఎంబి క్వార్టర్స్, శ్రీనివాసం విశ్రాంతి గృహం కాంపౌండ్ వాల్స్ దెబ్బ తిన్నాయి.

    ఇది చదవండి: ఏపీలో వరద బీభత్సం.. నాలుగు జిల్లాలు అతలాకుతలం..



    కపిలతీర్థం ఆలయంలో ఒక మండపం వర్షాలకు దెబ్బతినగా, దీని మరమ్మతులకు 70 లక్షల రూపాయలు ఖర్చు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షం వల్ల టీటీడీ సర్వర్లు దెబ్బతిని సేవలకు అంతరాయం కలిగింది. ఐటి విభాగం అధికారులు, సిబ్బంది వెంటనే పునరుద్ధరించి భక్తుల సేవలకు ఇబ్బంది లేకుండా చేశారు. స్వామివారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు శ్రీనివాసం, మాధవం, రెండు మరియు మూడో సత్రాల్లో వసతి, ఆహారం ఏర్పాటు చేశారు.

    ఇది చదవండి: రైతును నిండా ముంచిన వాన.. తిండిగింజలూ దక్కని వైనం..



    టికెట్లు ఉండి దర్శనానికి రాలేక పోయిన భక్తులను వర్షాలు తగ్గాక స్వామివారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.తిరుమల తిరుపతిలో దెబ్బతిన్న రోడ్లు, ఇతర మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

    మీ నగరం నుండి (​తిరుపతి)

    ఆంధ్రప్రదేశ్
    ​తిరుపతి
    ఆంధ్రప్రదేశ్
    ​తిరుపతి
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Floods, Tirumala, Ttd

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు