అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని (Lord Venkasewara Swamy) దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. శ్రీవారి ప్రసాదాలు, ఫోటోలు, డైరీలు, క్యాలెండర్లకు అంతే డిమాండ్ ఉంటుంది. అందుకోసం భక్తులకు స్వామివారి క్యాలెండర్లు (TTD Calendars-2022), డైరీలు అందించేందుకు టీటీడీ (TTD) సిద్ధమైంది. టీటీడీ రూపొందించిన 2022వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీ లను టిటిడి వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ ఆన్లైన్ సర్వీసెస్‌లోనూ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించడమైనది. టీటీడీకి చెందిన tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో ''పబ్లికేషన్స్''ను క్లిక్ చేసి డెబిట్‌కార్డు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్డరు చేయవచ్చు. ఇలా బుక్ చేసుకున్న వారికి తపాలా శాఖ ద్వారా వారి చిరునామాకు పంపుతారు. భక్తులు ఎన్ని క్యాలెండర్లు, డైరీలనైనా బుక్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారికి ప్యాకింగ్, షిప్పింగ్Tiru ఛార్జీలు అదనంగా చెల్లించాలస్సి ఉంటుంది.
విదేశాల్లోని భక్తులకు సైతం..
ఆన్ లైన్ లో బుక్ చేసుకునే విదేశాల్లోని భక్తులకు తపాలా శాఖ ద్వారా డైరీలు, క్యాలెండర్లను అందించేలా టిటిడి ఏర్పాట్లు చేపట్టింది. తపాలా శాఖ నిర్దేశిత ఛార్జీలను వసూలుచేసి నిర్ణీత సమయంలో బట్వాడా చేస్తోంది. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న భక్తులకు షిప్పింగ్ కు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తున్నారు.
పోస్టు ద్వారా ఇలా..
టీటీడీ క్యాలెండర్, డైరీలను పోస్టు ద్వారానూ భక్తులు పొందవచ్చు. ఇందుకోసం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ, తిరుపతి'' పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డిడి తీసి కవరింగ్ లెటర్‌తో కలిపి ''ప్రత్యేకాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్ కాంపౌండ్, కెటి.రోడ్, తిరుపతి'' అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. టు పే విధానం (పోస్టల్ చార్జీలు అదనం) ద్వారా భక్తులకు టీటీడీ క్యాలెండర్, డైరీలను పంపడం జరుగుతుంది. డైరీ, క్యాలెండర్ల కొనుగోలుకు సంబంధించిన సమాచారం కోసం 0877-2264209 నంబరు ద్వారా టీటీడీ పబ్లికేషన్స్ విభాన్ని 9963955585 నంబరు ద్వారా ప్రత్యేకాధికారిని గానీ సంద్పరించాల్సి ఉంటుంది.
డైరీలు, క్యాలెండర్ల ధరలుడైరీలు, క్యాలెండర్ల ధరలు
ఇది చదవండి : మమ్మల్ని దత్తత తీసుకుంటారా..? ఆశగా ఎదురుచూస్తున్న పులులు, సింహాలు, ఏనుగులు..
తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. అలాగే విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయిలోని టీటీడీ సమాచార కేంద్రాల్లో క్యాలెండర్లు, డైరీలను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది. వీటితోపాటు ముఖ్యమైన టీటీడీ కల్యాణమండపాల్లో, టిటిడి అనుబంధ ఆలయాల్లో అందుబాటులో ఉంచారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd