హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TTD: ఆర్జిత సేవలపై టీటీడీ కీలక నిర్ణయం.., భక్తుల తాకిడే కారణం.. పూర్తి వివరాలివే..!

TTD: ఆర్జిత సేవలపై టీటీడీ కీలక నిర్ణయం.., భక్తుల తాకిడే కారణం.. పూర్తి వివరాలివే..!

తిరుమల శ్రీవారి ఆలయం(ఫైల్)

తిరుమల శ్రీవారి ఆలయం(ఫైల్)

శ్రీనివాసుడు కొలువై ఉన్న తిరుమల (Tirumala) నిత్యకళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. శ్రీవారికి (Tirumala Srivaru) నిత్య, వార., పక్ష., మాస., సాలకట్ల ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అందులో కొన్ని ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించాల్సిన ఉత్సవాలు మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా నిర్విరామంగా సాగుతుంటాయి.

ఇంకా చదవండి ...

GT Hemanth Kumar, News18, Tirupati

శ్రీనివాసుడు కొలువై ఉన్న తిరుమల (Tirumala) నిత్యకళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. శ్రీవారికి (Tirumala Srivaru) నిత్య, వార., పక్ష., మాస., సాలకట్ల ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అందులో కొన్ని ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించాల్సిన ఉత్సవాలు మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా నిర్విరామంగా సాగుతుంటాయి. అలాంటి సేవల్లో ముఖ్యంగా నిత్య., వారోత్సవాలుగా నిర్వహించే ఉత్సవాలలో సుప్రభాతం., తోమాల., అర్చన., త్రికాల నైవేద్యం., త్రికాల ఆరాధనలతో పాటుగా ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేక సేవలను నిర్వహిస్తారు. కొన్ని ఆర్జితోత్సవాలు రాజులు., రాజ్యాధికారులు వారి కీర్తి కోసం ప్రవేశ పెడితే.. మరికొన్ని శ్రీవారి ఆలయ గోడలపై ఉన్న శాసనాల ఆధారంగా చేసుకొని పునః ప్రాంభించినవే. ఉత్సవ మూర్తులైన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి విగ్రహాలు ఆరుగుదలకు గురి అవుతున్నాయని ఆగమ సలహా మండలి, వంశపారంపర్య అర్చకులు అభిప్రాయపడ్డారు.

పంచలోహ విగ్రహాలు అరుగుదలకు కారణాలు వివరిస్తూ కొన్ని సేవలను తాత్కాలికంగా రద్దు చేయాలని టీటీడీ అధికారులను కోరారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలు, కొన్ని విశేషమైన సందర్భాలలో 'ఏకాంత తిరుమంజనం'తో సహా సంవత్సరానికి 450 సార్లు ఉత్సవమూర్తులకు 'అభిషేకాలు' జరుగుతాయని గణాంకాలు సూచిస్తున్నాయి. వీటిలో, రోజువారీ వసంతోత్సవం, వారపు విశేష పూజ మరియు సహస్ర కలశాభిషేకం మాత్రమే 415 సార్లు నిర్వహించేవారు. ఇలా సంవత్సరం పొడుగునా నిర్వహిస్తున్న అభిషేకాల వల్ల పురాతనమైన ఉత్సవ మూర్తుల విగ్రహాలకు ఎక్కువగా అరుగుదల ఏర్పడుతుందని భావించిన ఆలయ ప్రధాన అర్చకులు, జీయంగార్లు అభిషేకాలతో ఇమిడియున్న సహస్ర కలశాభిషేకం, విశేష పూజ, వసంతోత్సవం లాంటి ఆర్జిత సేవలను రద్దు చేసి, వార్షిక వసంతోత్సవాలతోపాటు సంవత్సరానికోసారి మాత్రమే సహస్ర కలశాభిషేకాన్ని సర్కారుగా నిర్వహించాలని తద్వారా విగ్రహాలను అరుదుగుదలనుంచి కాపాడవచ్చని సూచించారు.

ఇది చదవండి: శ్రీవారి వివాహం ఎలా జరిగిందో తెలుసా..? పద్మావతి పరిణయోత్సవాల విశేషాలివే..!


ఇలా జియ్యంగార్లు మరియు ప్రధాన అర్చకుల సలహా మేరకు ఈ సేవలను రద్దు చేశారు. విగ్రహాలు పూర్తిగా అరిగిపోయి వాటి స్థానంలో క్రొత్త విగ్రహాలను తయారు చేయాల్సి వస్తే పాత విగ్రహాన్ని కరిగించి అదే లోహాన్ని తిరిగి క్రొత్త విగ్రహాల తయారీకి వాడాల్సివుంటుంది. ఇది శ్రమతో, సమయంతో కూడిన పనే కాకుండా అరుదైన పురాతన విగ్రహాలను కోల్పోవలసి వస్తుంది. ‘అభిషేకాల’ వల్ల ఉత్సవమూర్తులు త్వరగా అరిగిపోతుండటంతో 1989లో తితిదే వార్షిక జ్యేష్టాభిషేకం (అభిధేయక అభిషేకం)ని ప్రవేశపెట్టింది.

ఇది చదవండి: తిరుమల శ్రీవారికి ఎప్పుడు ఏ నైవేద్యం సమర్పిస్తారో తెలుసా..? భక్తులకు తెలియని విశేషాలెన్నో..!


ప్రతి సోమవారం నిర్వహించే విశేష పూజను 1991లో ప్రవేశపెట్టారు. డా. ఎన్.రమేశన్, శ్రీ టి.కె.టి. వీర రాఘవాచార్య, శ్రీ సాధు సుబ్రమణ్యం శాస్త్రి మొదలైన వారు ఆలయ గోడలపై లభించిన శాసనాలను ఉటంకిస్తూ 'సహస్ర కలశాభిషేకం' మరియు 'వసంతోత్సవం' రెండూ కూడా ఆర్జిత సేవలని, అనగా భక్తులెవరైనా సూచించిన రుసుము చెల్లిస్తే నిర్వహించే సేవలని, ఇవి ఖచ్చితంగా చేయాల్సిన సేవలు కాదని స్పష్టీకరించారు. 2019లో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు పంచలోహ విగ్రహాలకు తరచూ నిర్వహించే అభిషేకాలను నిలిపివేయాలనే జీయంగార్లు మరియు ప్రధాన అర్చకులు, అర్చకుల సూచనల మేరకు టీటీడీ ఈ సేవలను రద్దు చేసింది. టీటీడీ పెద్ద జీయర్ స్వామితో పాటు ఈ విషయాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ కూడా ఉత్సవమూర్తులు అరుగుదలకు గురికాకుండా రక్షించాల్సిన అవసరం ఉండడంతో కొన్ని సేవలను టీటీడీ రద్దు చేసింది.

ఇది చదవండి: శ్రీవారి పరకామణిలో చోరీ.., విదేశీ కరెన్సీలు మాయం.. ఇది అతడిపనే..!


ఇక వేసవి కాలంలో తిరుమలకు భారీ ఎత్తున భక్తులు పోటెత్తారు. రోజుకు లక్షమందికి పైగా భక్తులు సప్తగిరులపై చేరుకొని స్వామి వారి దర్శనార్థం వేచి ఉంటారు. సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేసేందుకు వేసవిలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు టీటీడీ అధికారులు. స్వామి వారికి వారంలో ఒకమారు నిర్వహించే వారపు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తూ టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ప్రతి మంగళవారం నిర్వహించే అష్టదళం., గురువారం నిర్వహించే తిరుప్పావై., శుక్రవారం శ్రీవేంకటేశ్వరునికి అభిషేకం నిర్వహించిన అనంతరం జరిపే నిజపాద ఆర్జిత సేవను టీటీడీ రద్దు చేసింది. స్వామివారి దర్శనం సామాన్యులకు మరింత సులభ తరం చేయడానికి చైర్మ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి తీసుకున్న నిర్ణయంతో రోజుకు మరో 10వేల మంది భక్తులకు అదనంగా శ్రీవారి దర్శనభాగ్యం కల్పించవచ్చని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు

First published:

Tags: Andhra Pradesh, Tirumala tirupati devasthanam

ఉత్తమ కథలు