హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TTD Calendars: శ్రీవారి క్యాలెండర్లనూ వదలని అక్రమార్కులు.. ఆన్ లైన్లో అధికరేట్లకు అమ్మకాలు..

TTD Calendars: శ్రీవారి క్యాలెండర్లనూ వదలని అక్రమార్కులు.. ఆన్ లైన్లో అధికరేట్లకు అమ్మకాలు..

ఆన్ లైన్లో అక్రమంగా టీటీడీ క్యాలెండర్ల విక్రయాలు

ఆన్ లైన్లో అక్రమంగా టీటీడీ క్యాలెండర్ల విక్రయాలు

కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి (Lord Venkateswara Swamy) దర్శనానికి భక్తులు పోటీ పడుతుంటారు. అలాగే శ్రీవారి ప్రసాదం (Tirumala Prasadam), ఇతర వస్తువులను పొందేందుకు కూడా ఆసక్తి చూపిస్తారు.

Anకలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి (Lord Venkateswara Swamy) దర్శనానికి భక్తులు పోటీ పడుతుంటారు. అలాగే శ్రీవారి ప్రసాదం (Tirumala Prasadam), ఇతర వస్తువులను పొందేందుకు కూడా ఆసక్తి చూపిస్తారు. అందులో ముఖ్యమైనవి శ్రీవారి క్యాలెండర్లు, డెయిరీలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. టీటీడీ (TTD) ప్రతిఏటా స్వామివారి చిత్రాలతో కూడిన క్యాలెండర్లను భక్తులకు విక్రయిస్తుంటుంది. శ్రీవారి క్యాలెండర్లకు ఉన్న డిమాండ్ ను కొందరు అక్రమార్కులు క్యాష్ చేసుకుంటున్నారు. దర్శన టోకెన్లు, సిఫార్సు లేఖలు నకిలీవి సృష్టించడం, బ్లాక్ లో టోకెన్లు విక్రయిస్తుంటారు. అలాగే స్వామివారి క్యాలెండర్లు, డెయిరీలను కూడా అక్రమంగా విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. దర్జాగా ఆన్ లైన్లో అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన దేవుళ్ళు.కామ్ (మోహన్ పబ్లికేషన్స్) నిర్వాహకులు సిద్దమయ్యారు.

భక్తులను అందినకాడికి దోచుకోవాలని ప్లాన్ వేసిన అక్రమార్కులు 2022వ ఏడాదికి సంబంధించిన టీటీడీ క్యాలెండరు, డైరీలను తమ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ‌ నుంచి ఆన్ లైన్లో విక్రయించడం మొదలుపెట్టారు. టీటీడీలో లభ్యమయ్యే ధరలకంటే కంటే రెట్టింపు ధరకు అమ్ముతూ భక్తులకు పంగనామాలు పెడుతున్నారు. టీటీడీ ద్వారా 12 పేజీల క్యాలెండర్ ధర 130 రూపాయలు కాగా ఆన్ లైన్లో దేవుళ్లు.కామ్ ద్వారా రూ.198కి విక్రయిస్తున్నారు. ఇక రూ.150 విలువ చేసే డెయిరీని రూ.243కు విక్రయిస్తున్నారు.

ఇది చదవండి: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎందుకంత ప్రాముఖ్యత... వందల ఏళ్ల చరిత్ర ఏం చెబుతోదంటే..!


ఈ నెల 12వ తేదీ నుంచి టీటీడీ తిరుమల,తిరుపతిలో క్యాలెండరు, డైరీల విక్రయాలను ప్రారంభించింది.. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చిన భక్తులు పబ్లికేషన్ స్టాల్స్ తో పాటు పలు చోట్ల విక్రయిస్తోంది. డైరీలు, క్యాలెండర్లకు కొరత రాకుండా టీటీడీ భారీ సంఖ్యలోనే ప్రింట్ చేయించి అందుబాటులో ఉంచింది. రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో టీటీడీ క్యాలెండరు, డైరీల విక్రయాలను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈలోపే కొందరు కేటుగాళ్ళు క్యాలెండరు, డైరీలను ఆన్ లైన్ లో అధిక ధరలకు విక్రయిస్తూ ఉండడంతో కొందరు భక్తులు వాటిని కొనుగోలు చేసి మోసపోతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆన్ లైన్లో అధిక ధరలకు విక్రయిస్తున్న సమాచారం టీటీడీ దృష్టికి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఇది చదవండి: క్రిస్టియన్ కు టీటీడీలో సభ్యత్వం..? వైసీపీ ఎమ్మెల్యే మతంపై వివాదం.. ఆయన ఏమన్నారంటే..!


టీటీడీ ఔట్ లెట్స్ లో మాత్రమే భక్తులు క్యాలెండర్లు, డైరీలు కొనుగోలు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. త్వరలోనే ఆన్ లైన్లో విక్రయాలు ప్రారంభించేందుకు కూడా ప్రయత్నిస్తామని టీటీడీ ప్రకటించింది. మోహన్ పబ్లికేషన్స్ కు టీటీడీకి ఎలాంటి సంబంధం లేదన్న అధికారులు సదరు సంస్థపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.

First published:

Tags: Andhra Pradesh, Tirumala tirupati devasthanam, Ttd

ఉత్తమ కథలు