Home /News /andhra-pradesh /

TIRUPATI TTD BOARD TO TAKE IMPORTANT DECISION ON PARKING PROBLEM IN TIRUMALA FULL DETAILS HERE PRN TPT

Tirumala Updates: తిరుమలలో ఆ రెండు సమస్యలకు చెక్ పెట్టేదెలా..? టీటీడీ కీలక నిర్ణయాలు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

అఖిలాండ కోటి బ్రాహ్మాండ నాయకుడు కొలువైయున్న తిరుమల క్షేత్రం (Tirumala Temple) ప్రకృతి రమణీయతకు.., సహజశిలా రూపాలకు పుట్టినిల్లు. పచ్చటి చెట్లతో.., ఎంతో ఆహ్లాదాన్ని అందించే తిరుమల నేడు కాలుష్య కోరల్లో (Pollution) చిక్కుకుంటోంది. కరోనా (Corona) అనంతరం తిరుమలలో వాయు కాలుష్యం పెరిగిపోతోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Tirupati, India
  GT Hemanth Kumar, News18, Tirupati

  అఖిలాండ కోటి బ్రాహ్మాండ నాయకుడు కొలువైయున్న తిరుమల క్షేత్రం (Tirumala Temple) ప్రకృతి రమణీయతకు.., సహజశిలా రూపాలకు పుట్టినిల్లు. పచ్చటి చెట్లతో.., ఎంతో ఆహ్లాదాన్ని అందించే తిరుమల నేడు కాలుష్య కోరల్లో (Pollution) చిక్కుకుంటోంది. కరోనా (Corona) అనంతరం తిరుమలలో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. దీనికి తోడు తిరుమలలో కార్లు, బైకులు పార్కింగ్ చేయడానికి మరింత కష్టతరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు టీటీడీ సంకల్పించింది. పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు నడక మార్గం కన్నా రోడ్డుమార్గంలో వాహనాల ద్వారా తిరుమల చేరుకుంటారు. ఘాట్ రోడ్డు ప్రయాణానికి ఆర్టీసీ బస్సుల కన్నా ప్రైవేటు టాక్సీల వైపే భక్తులు ఎక్కువ మక్కువ చూపుతారు. వీరిలో సొంత వాహనాల్లో వచ్చే వారి సంఖ్య 1500లోపు ఉంటే... ఏపీఎస్ ఆర్టీసీ 750ట్రిప్పులు... ద్విచక్ర వాహనాలు వెయ్యి... టీటీడీ ఇతర సిబ్బంది వాహనాలు మరో 200, ప్రైవేట్ టాక్సీలు మరో 2 వేలు పైచిలుకు వాహనాలు తిరుమల తిరుపతి మధ్య నడిచేవి. రెండేళ్ల కరోనా సమయంలో పూర్తిగా పరిస్థితులు మారాయి. తిరుమల కొండపై పచ్చని హారిత తోరణాలు స్వాగతం పలుకుతున్నాయి.

  శ్రీవారి దర్శనాలు యథాతథంగా మళ్లీ అమలు చేయడంతో తిరుమలకు వచ్చే వారు అధికంగా సొంతవాహనాలవైపే మొగ్గుచూపుతున్నారు. ఇలా రోజు రోజుకి పెరుగుతున్న భక్తుల సంఖ్యతో పాటుగా వాహనాల రాక పోకలు పెరుగుతుండడంతో వాతావరణ కాలుష్యంతో పాటుగా..శబ్ద కాలుష్యంతో ఎక్కువవుతోంది. దీంతో పచ్చని తిరుమల గిరులు మసకబారిపోతున్నాయి. కాలంచెల్లిన పాత వాహనాల నుండి వెలుబడే పోగలో అధిక శాతం కార్భన్ డై యాక్సైడ్ ఉండడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

  ఇది చదవండి: ఈ దేశమే ఆయన ఇల్లు.. 105 ఏళ్ల వయసులోనూ దేశ సేవే..


  ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు రోజుకు 750 ట్రిపులు తిప్పుతుండగా... సొంత వాహనాలతో సుమారు 5200 భక్తులు తిరుమలకి చేరుకుంటున్నారు. ఇక ట్యాక్సీలు 3000వేలకు పైగానే తిరుమలకు చేరుకుంటున్నాయి. విధులకు వచ్చేచారు., స్థానికులు భక్తులు రోజుకు టూ వీలర్స్ పై సగటున 1600 చేయుకుంటుండగా...ప్రభుత్వం, టీటీడీ వాహనాలు 100కు పైగా తిరుగుతున్నాయి. ఇక వారాంతంలో అయితే కోవిడ్ తర్వాత 12,000 నుండి 13000 వాహనాలు వస్తుండటం గమనార్హం.  ఇలా తిరుమలకు రోజుకు 13 వేల వాహనాలు చేరుకుంటున్నాయి. ఇందులో ఆర్టీసీ బస్సులను తీసివేయగా... దాదాపు 10 వేల వాహనాలు తిరుమలలోనే అనునిత్యం ఉంటుంన్నాయి. వాటన్నిటిని పార్కింగ్ చేయాలంటే.... చాల కష్టతరంగా మారుతోంది. తిరుమలలో ఇప్పటికే రంభాగుఛా., ముళ్ళగుంత., వైకుంఠం 2, బాలాజీ నగర్, న్యూ డీటైప్ వద్ద పార్కింగ్ వసతులు ఏర్పాటు చేశారు. కానీ తిరుమలకు వచ్చే వాహనాల సంఖ్యతో పోల్చుకుంటే వీటి సంఖ్య చాల తక్కువ. దీంతో చాలా వాహనాలు రోడ్డుపైనే పెట్టాల్సి వస్తుంది. బాలాజీ బస్టాండ్ మొదలుకొని గోగర్భం వరకు ట్రాఫిక్ సమస్య తప్పడం లేదు. ఎటు చుసినా వాహనాలే దర్శమిస్తున్నాయి. అధికారులకు సైతం దారి లేకుండా పోతోంది. ట్రాఫిక్ ఆంక్షలు విధించినా.. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. అయితే టీటీడీ అధికారులు మాత్రం రాబోయే బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో 5 నుంచి 6 వేల వాహనాలు పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. మరిన్ని పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా... ట్రాఫిక్ జాం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ttd

  తదుపరి వార్తలు