హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TTD: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు కొత్త జీవితం ఇచ్చిన టీటీడీ బర్డ్స్.. దేవుడే కాపాడాడంటున్న యువతి కుటుంబం

TTD: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు కొత్త జీవితం ఇచ్చిన టీటీడీ బర్డ్స్.. దేవుడే కాపాడాడంటున్న యువతి కుటుంబం

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు కొత్త జీవితం ఇచ్చిన టీటీడీ

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు కొత్త జీవితం ఇచ్చిన టీటీడీ

TTD Birds: ఆమె ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. అనుకోని ఘటన ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. ఇక జీవితం ముగిసిపోయింది అనుకుంది. కానీ ఎవరూ లేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు.. టీటీడీ బర్డ్స్ ఆస్పత్రి కొత్త జీవితాన్ని ఇచ్చింది..

 • News18 Telugu
 • Last Updated :
 • Tirumala, India

  GT Hemanth Kumar, Tirupathi, News18.

  TTD Birds: ఒక్కోసారి అనుకోని ఘటనలు జరిగితే జీవితమే రివర్స్ అయిపోతుంది.  అలాగే  చిన్న ప్రమాదం (Accident) ఆ టెకీ జీవితంలో పెను విషాదాన్ని నింపింది. ప్రమాదం చిన్నదే.. కానీ హ్యాపీగా సాగుతున్న యువతీ జీవితాన్ని బలితీసుకుంది అనుకున్నారు అంతా..? ఎందుకంటే  రెండు ప్రైవేట్ ఆసుపత్రుల్లో (Private Hospitals) ఆమెకు చేసిన చికిత్స ఫెయిల్ అయ్యింది. అది కూడా ఎంతో పేరు ఉన్న ఆస్పత్రులు.. దీంతో తన జీవితం ముగిసిపోయింది అనుకుంది ఆ యువతి..  కానీ దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు.. తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devastanam) ఆమె జీవితాన్ని కాపాడింది. కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలలో ఆమెకు పునర్జన్మ లభించింది. అది కూడా రూపాయి ఖర్చ కాకుండానే..?

  పూర్తి వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లా (Anakapalli District) వేంపాడుకు చెందిన సత్యనారాయణ రాజు వ్యవసాయ దారుడు. ఆయన చిన్న కూతురు సూర్య బిటెక్ చదివి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ (Software Engineer) గా ఉద్యోగం చేస్తుండేది. 2020 లో కోవిడ్ కారణంగా ఇంటి నుండి పనిచేసేందుకు తన గ్రామానికి వచ్చేసింది. జులై 20 వ తేదీ  ఏటీఎంకు వెళ్ళి జీతం డ్రా చేసుకుని వస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి ఆమెను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఆమెకు చెవిలో నుంచి రక్తం కారి చెవులు వినిపించకుండా పోయాయి. దీని కారణంగా ఆమె మాట్లాడలేక పోయింది.

  విశాఖపట్నం లోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో సర్జరీ చేయించినా ఉపయోగం లేక పోయింది. హైదరాబాద్ లోని మరో ప్రముఖ  ప్రైవేటు ఆసుపత్రిలో రెండవ సర్జరీ చేయించినా ప్రయోజనం కనిపించలేదు. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తే ఉపయోగం ఉంటుందని ఇందుకు  10 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. అంత ఖర్చు భరించే శక్తి లేక పోవడంతో సత్యనారాయణ రాజు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ని కలసి తమ బిడ్డకు వైద్యం చేయించడానికి సహాయం చేయాలని అభ్యర్థించారు.

  ఇదీ చదవండి : నేడు తిరుమలకు సీఎం జగన్ .. శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఈ సారి సామాన్యులకు అదిరే ఆఫర్

  దీంతో  సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి టీటీడీ చైర్మన్ సహాయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన సీఎం.. సహాయ నిధి నుంచి  సూర్య ఆపరేషన్ కు రూ 10 లక్షలు మంజూరు చేయించారు. సాంకేతిక కారణాల కారణంగా.. ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం ఈ ఆపరేషన్ చేయలేక పోయింది. దీంతో ఏడాదిన్నర నుంచి ఇంటివద్దే ఫిజియో థెరఫీ చేయిస్తున్న సత్యనారాయణ రాజు కు బర్డ్ ఆసుపత్రిలో ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు.

  ఇదీ చదవండి : నగదు తీసుకోవడానికి వేలి ముద్రలు వేస్తున్నారా..? అయితే బీకేర్ ఫుల్.. దీని గురించి తెలుసుకోవాల్సిందే

  చికిత్స కాస్త ఫలితాలను ఇస్తుండడంతో.. ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి ని సంప్రదించారు. గతంలో సి ఎం, టీటీడీ చైర్మన్ తమకు చేసిన సహాయం గురించి తెలియజేశారు. దీంతో సెప్టెంబర్ 20వ తేదీ సూర్య ను అడ్మిట్ చేసుకుని 22వ తేదీ సర్జరీ చేయించారు.సర్జరీ విజయవంతం కావడంతో సోమవారం సాయంత్రం టీటీడీ చైర్మన్, ఈవో సమక్షంలో ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి సూర్యను డిశ్చార్జ్ చేశారు. మరో పది రోజుల్లో సూర్య వినగలగడం, మాట్లాడటం చేయగలదని డాక్టర్లు చెబుతున్నారు.

  ఇదీ చదవండి: కొడాలి నాని మౌనానికి అర్థం ఏంటి..? విమర్శలపై ఎందుకు స్పందించడం లేదు?

  రూపాయి ఖర్చు కాకుండా తమబిడ్డకు వైద్యం అందించిన తిరుమల తిరుపతితో వెలిసిన శ్రీ వేంకటేశ్వర స్వామి కి..  సీఎం జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి సూర్య తండ్రి సత్యనారాయణ రాజు కృతజ్ఞతలు తెలిపారు. దేవుడే తమ బిడ్డను వీరందరి రూపంలో కాపాడరని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.  ఈ కేసులో విచిత్రం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం రూ 10 లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చినా సాంకేతిక కారణాల వల్ల సర్జరీ చేయలేమని చెప్పిన ఆసుపత్రి  వైద్యులే బర్డ్  ఆసుపత్రికి వచ్చి ఉచితంగా సర్జరీ చేశారు. అదే స్వామి మహత్యం అంటున్నారు యువతి కుటుంబ సభ్యులు..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Tirumala, Ttd news

  ఉత్తమ కథలు