హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TTD News: టీటీడీకి తలనొప్పిగా మారిన కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవహారం.. పారిశుద్ధ్యంపై భక్తుల పరేషాన్..

TTD News: టీటీడీకి తలనొప్పిగా మారిన కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవహారం.. పారిశుద్ధ్యంపై భక్తుల పరేషాన్..

సర్వర్ సమస్యలను అధిగమించడానికి జియో సహకారం అందించడంతో.. చాలావరకు సాంకేతిక సమస్యలు తొలగాయి. గత కొంతకాలం నుంచి భక్తులకు క్లౌడ్ మేనేజ్మెంట్ ద్వారా సులభతరంగా టిక్కెట్లను పొందే అవకాశం కల్పిస్తోంది. అలాగే శ్రీనివాసుడి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను టిటిడి దేశ వ్యాప్తంగా విడుదల చేస్తూ వస్తోంది.

సర్వర్ సమస్యలను అధిగమించడానికి జియో సహకారం అందించడంతో.. చాలావరకు సాంకేతిక సమస్యలు తొలగాయి. గత కొంతకాలం నుంచి భక్తులకు క్లౌడ్ మేనేజ్మెంట్ ద్వారా సులభతరంగా టిక్కెట్లను పొందే అవకాశం కల్పిస్తోంది. అలాగే శ్రీనివాసుడి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను టిటిడి దేశ వ్యాప్తంగా విడుదల చేస్తూ వస్తోంది.

అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు శ్రీవేంకటేశ్వరుడు కొలువైన దివ్య క్షేత్రం తిరుమల (Tirumala Temple). శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఇలా చేరుకున్న భక్తులకు వివిధ అతిధి గృహాలు., విశ్రాంతి గృహాలని నిర్మించింది టీటీడీ (TTD). ఆ అతిధి గృహాల పారిశుధ్య నిర్వహణ వివిధ ఎఫ్ఎంఎస్ కంపెనీలకు టీటీడీ టెండర్ల ద్వారా బాధ్యత అప్పగిస్తుంది.

ఇంకా చదవండి ...

  GT Hemanth Kumar, Tirupathi, News18

  అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు శ్రీవేంకటేశ్వరుడు కొలువైన దివ్య క్షేత్రం తిరుమల (Tirumala Temple). శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఇలా చేరుకున్న భక్తులకు వివిధ అతిధి గృహాలు., విశ్రాంతి గృహాలని నిర్మించింది టీటీడీ (TTD). ఆ అతిధి గృహాల పారిశుధ్య నిర్వహణ వివిధ ఎఫ్ఎంఎస్ కంపెనీలకు టీటీడీ టెండర్ల ద్వారా బాధ్యత అప్పగిస్తుంది. ఇలా దాదాపు 10 నుంచి 12 వేల మంది కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగులు పారిశుధ్య కార్మికులుగా టీటీడీలో విధులు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు రోడ్డుపై చెత్త శుభ్రం చేయడం నుంచి అతిధి గృహాలని శుభ్రంగా ఉంచేందుకు మూడు షిఫ్టుల్లో పనిచేస్తారు. యాత్రికులు తాము అద్దెకు తీసుకున్న గదులు ఖాళీ చేయగానే ఎఫ్ఎంఎస్ సిబ్బంది ద్వారా శుభ్రపరుస్తారు. గదుల్లోని బెడ్లపై ఉన్న బెడ్ షీట్లను మార్చడం., గదులను డిస్ఇన్ఫెక్షన్ చేయడం వంటి పనులు సైతం ఎఫ్ఎంఎస్ సిబ్బంది చేస్తుంటారు.

  వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తమను క్రమబద్ధీకరిస్తామని సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన బాటపట్టారు. 90% మంది విధులకు హాజరు కాకుండా తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వద్ద ధర్నాకు కూర్చోవడంతో తిరుమలలో విధులు నిర్వహించే కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కాటేజీలు శుభ్రం చేసేవారు లేకపోవడంతో గదుల కేటాయింపు టీటీడీ తలనొప్పిగా మారింది. గదుల కోసం ఎన్ రోల్ చేసుకున్న భక్తులకు గదులు కేటాయించేందుకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతోంది. తిరుపతిలో రోజువారీ కూలీలకు పనిచేసే ఉద్యోగులను తీసుకొచ్చినా గదుల కేటాయింపులో జాప్యం తప్పడం లేదు.

  ఇది చదవండి: హోప్ ఐలాండ్ కథ ముగిసినట్లేనా..? అందమైన ద్వీపం ఇక అందదా..?


  ఉద్యోగుల డిమాండ్లు ఏమిటీ.. జగన్ ఏం హామీ ఇచ్చారు..?

  టీడీపీ ప్రభుత్వ హయాంలో జగన్ పాదయాత్ర చిత్తూరు జిల్లాకు చేరుకున్న సమయంలో సీఐటీయూ నాయకులతో కలసి కాంట్రాక్టు ఉద్యోగులు ఆయన్ను కలిశారు. తమ బాధలను కాంట్రాక్టు ఉద్యోగులు జగన్ కు వెళ్లబోసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే కాంట్రాక్టు ఉద్యోగులను టైం స్కేల్ ఉద్యోగులుగా తీసుకుంటామని అప్పట్లో జగన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతున్నా కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు మాత్రం తీరలేదు. తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనీ ప్రభుత్వ పెద్దలను., టీటీడీ అధికారులను కలసి విన్నతులు సమర్పించారు. కానీ టీటీడీ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో వారు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. గత పది రోజులుగా టీటీడీ పరిపాలన భవనంవద్ద కార్మికుల ధర్నా కొనసాగుతోంది.

  ఇది చదవండి: ఏపీలో కొవిడ్ ఆంక్షలు మరింత కఠినం.. ప్రభుత్వం కీలక ఆదేశాలు..


  ఒట్టేసి చెప్పిన సీఎం

  ఇటీవల తిరుపతిలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా సీఎం జగన్ ను కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిశారు. అదే సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేస్తానని మహిళా కాంట్రాక్టు ఉద్యోగిపై ఒట్టేసి చెప్పారు సీఎం జగన్. అక్కడితో సమస్య సమసిపోతుందని అందరూ భావించారు... కానీ అక్కడ నుంచే ఉద్యమం మరింత ఉదృతంగా కొనసాగుతూ వచ్చింది. సీఎం హామీ ఇవ్వడంతో టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి కార్మికులతో చర్చలు జరపగా అవి విఫలమయ్యాయి. ఐతే టీడీడీ తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  ఇది చదవండి: మహిళలకు పోలీసుల శుభవార్త... రాత్రిళ్లు ఉచిత ప్రయాణం... ఎక్కడంటే..!


  టీటీడీ ఆగ్రహం

  కార్మికుల ధర్నా వల్ల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. సంబంధిత ఏజెన్సీ వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని టీటీడీ అధనపు ఈవో ధర్మారెడ్డి ఆదిశించారు. రెండు మూడు రోజుల్లో అన్ని ఎఫ్ఎమ్ఎస్ ఏజెన్సీలు కొత్త‌వారితో ఖాళీలను భ‌ర్తీ చేసి భ‌క్తుల‌కు పూర్తి స్థాయిలో సేవ‌లందించాల‌ని స్పష్టం చేశారు. సేవ‌లందించ‌ని ఏజెన్సీలపై శాఖా ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకొని, కొత్త ఏజెన్సీలకు అప్ప‌గిస్తామ‌ని హెచ్చరించారు. ఎఫ్ఎమ్ఎస్ ఏజెన్సీలు స్పందించని పక్షంలో టిటిడికి అవ‌స‌ర‌మైన పారిశుద్ధ్య కార్మికుల‌ను ఆరోగ్య విభాగం ద్వారా నియ‌మించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Tirumala news, Ttd news

  ఉత్తమ కథలు