హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TTD: బ్రహ్మోత్సవాల నుంచి తిరుమలలో కొత్త బస్సులు.. ఈ రూట్లలో అందుబాటులోకి.. వివరాలివే..!

TTD: బ్రహ్మోత్సవాల నుంచి తిరుమలలో కొత్త బస్సులు.. ఈ రూట్లలో అందుబాటులోకి.. వివరాలివే..!

తిరుమలలో అందుబాటులోకి ఎలక్ట్రిక్ బస్సులు

తిరుమలలో అందుబాటులోకి ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం నడక మార్గంతో పాటుగా రోడ్డు మార్గం సైతం అందుబాటులో ఉంది. పర్యావరణానికి అధికంగా బాధించే మొదటి అంశమైనా ప్లాస్టిక్ ను టీటీడీ ఇప్పటికే నిషేధించింది. దీంతో భూగర్భ కలుషితం తగ్గినా.. వాయు కాలుష్యం అధికంగా ఉంది. దీనికి ఏకైక ప్రత్యామ్నాయం ఎలక్ట్రికల్ వాహనాలే.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Tirupati, India

  GT Hemanth Kumar, News18, Tirupati

  తిరుమల (Tirumala) వెంకన్న సన్నిధి పచ్చని హరిత తోరణాలు, మంత్రముగ్ధులను చేసే సెలయేరుల సవ్వళ్ళకి నెలవు. ప్రకృతిని ఆస్వాదించాలన్నా.. చల్లని స్వామి వారి చూపు మనపై పడాలన్నా ఏడుకొండలు ఎక్కాల్సిందే. గతంలో నడక, గుర్రపు స్వారీ, ఎడ్ల బండి మీద మాత్రమే భక్తులు తిరుమలకు చేరుకునేవారు. ప్రస్తుతం నడక మార్గంతో పాటుగా రోడ్డు మార్గం సైతం అందుబాటులో ఉంది. పర్యావరణానికి అధికంగా బాధించే మొదటి అంశమైనా ప్లాస్టిక్ ను టీటీడీ (TTD) ఇప్పటికే నిషేధించింది. దీంతో భూగర్భ కలుషితం తగ్గినా.. వాయు కాలుష్యం అధికంగా ఉంది. దీనికి ఏకైక ప్రత్యామ్నాయం ఎలక్ట్రికల్ వాహనాలే. ఇప్పటికే టీటీడీలో పనిచేసే విభాగాధిపతులకు ఎలక్ట్రికల్ వాహనాలను అందించింది టీటీడీ. ఇప్పుడు ఆర్టీసీ వంతుగా బ్రహ్మోత్సవాల నాటి నుంచి తిరుమలలో ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు చక్కర్లు కొట్టనున్నాయి. దాని స్పెషలిటీ ఎంతో ఉప్పుడు చూద్దాం.

  ఆహ్లాదకరమైన వాతావరణం తిరుమల సొంతం. తిరుమలకి వచ్చే ప్రతి భక్తునికి శ్రీవారి దివ్య ఆశీస్సులతో పాటుగా ప్రకృతి అందాలు బోనస్‌గా లభిస్తాయి. అయితే వాయు కాలుష్యం కారణంగా తిరుమలలో సైతం పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. దీంతో టీటీడీ పర్యావరణంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది టీటీడీ. వాయుకాలుష్య నివారణకు ఆర్టీసీ సైతం తన వంతుగా ఎపెక్ట్రికల్ వాహనాలు తిరుమలకు అందుబాటులోకి తీసుకు రానుంది.

  ఇది చదవండి: తిరుమల శ్రీవారి సేవలో ముకేశ్ అంబానీ.. టీటీడీకి భారీ విరాళం

  తిరుమల-తిరుపతి, తిరుపతి- విమానాశ్రయం మధ్య 64, తిరుపతి నుంచి నాన్ స్టాప్ ప్రాతిపధికన నెల్లూరు , మదనపల్లె, కడప పట్టణాలకు 12 చొప్పున ఈ ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. బస్సు రూపకల్పన ఆకర్షణీయంగా తయారు చేశారని సంతృప్తి వ్యక్తం చేశారు. ఘాట్‌లో ప్రయాణానికి అనుకూలంగా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. ప్రయాణికులు కూడా ఏసీ బస్సులను ఆదరిస్తారని భావిస్తున్నామన్నారు.

  ఇది చదవండి: రెండేళ్ల తరువాత బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు.. శ్రీవారికి కానుకగా బ్యాటరీ కార్లు.. ఎవరిచ్చారంటే..?

  తిరుమల కొండకు మినహా ఇతర మార్గాల్లో తిరిగే బస్సులు 12మీటర్ల పొడవుతో 50సీట్ల సామర్థ్యంతో వస్తాయన్నారు.. వచ్చే ఐదేళ్లలో పూర్తిస్థాయిలో కరెంటు బస్సులే అందుబాటులోకి వచ్చే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని వెల్లడించారు. ఘాట్‌లో ఈ బస్సుల నిర్వహణకు సంబంధించి విధివిధానాలు త్వరలో నిర్ణయిస్తామన్నారు. ఇక్కడ డ్రైవింగ్‌ స్కూల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకే కరెంటు బస్సు డ్రైవర్లుగా అవకాశం కల్పించాలన్న ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నామని తెలియజేశారు. ఈనెల 27న శ్రీవారి బ్రహ్మత్సవాల ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రితో ఈ విద్యుత్‌ బస్సులను ప్రారంభించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. త్వరలోనే మరిన్ని ఎలక్ర్టిక్‌ బస్సులు తిరుపతికి రానున్నాయి. అలిపిరి డిపోకు చేరిన నూతన కరెంటు బస్సును అధికారులు పరిశీలించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Tirumala tirupati devasthanam, Ttd news

  ఉత్తమ కథలు