తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana cm) , టీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రత్యేక రాష్ట్ర సాధకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR)జన్మదినాన్ని పురస్కరించుకొని ఆపార్టీ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Trs mlc kalvakuntla kavitha)తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. అలిపిరి (Alipiri) నడకమార్గం ద్వారా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ దేవదేవునికి మొక్కులు చెల్లించుకున్నారు కల్వకుంట్ల కవిత. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam que complex) ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత చాలా కాలం తర్వాత శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజున స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చినట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని వేడుకుంటున్నట్లు కవిత తెలిపారు. అలాగే ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రులు ఆరోగ్యంగా ఉండి ప్రజలకు మరింత సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని శ్రీనివాసుడ్ని ప్రార్ధించానట్లుగా కల్వకుంట్ల కవిత తెలియజేశారు. కాలినడక మార్గంలో శ్రీవారిని దర్శించుకున్న కవిత..రాత్రికి తిరుమలలోనే బస చేసి శుక్రవారం ఉదయం మరోసారి స్వామివారిని దర్శించుకున్నారు.
అంతా బాగుండాలని ప్రార్ధన..
కేసీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి చేరుకున్నారు కల్వకుంట్ల కవిత. టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి ఆంధ్రాలోని కేసీఆర్ అభిమానులు, వైసీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. కవిత రాకను స్వాగతిస్తూ అభిమానులు కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, లాంగ్ లీవ్ కేసీఆర్ అంటూ చేసిన నినాదాలతో రేణిగుంట విమానాశ్రయం దద్దరిలింది. ముందుగా విమానాశ్రయంలో కేసీఆర్ బర్త్‌డేని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. అటుపై తిరుపతిలోని జీవకోన సమీపంలో అన్నదానం కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు.
ఓన్లీ దర్శనం నో పాలిటిక్స్..
శ్రీవారి దర్శనంతో పాటు కేసీఆర్ పుట్టిన రోజున రాజకీయాలపై మాట్లాడేందుకు నిరాకరించారు కల్వకుంట్ల కవిత. ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పడం వెనుక రాజకీయం లేదన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి మర్యాద పూర్వకంగానే శుభాకాంక్షలు చెప్పినట్లుగా టీఆర్ఎస్ భావిస్తోందని కల్వకుంట్ల కవిత చెప్పారు.
రాష్ట్రాలు, ప్రాంతాలకు అతీతంగా కేసీఆర్‌ని అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు తెలుగు వాళ్లంతా ఎక్కడున్నా బాగుండాలని, వారికి అంతా మంచి జరగాలని కోరుతున్నట్లు చెప్పారు కల్వకుంట్ల కవిత.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Praised to mlc kavitha, Tirumala