GT Hemanth Kumar, Tirupathi, News18
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. బీజేపీ కుట్ర అంటూ టిఆర్ఎస్ నేతలు (TRS Leaders) ఆరోపణ చేస్తుంటే.. టిఆర్ఎస్ (TRS) పన్నాగం అంటూ... బీజేపీ (BJP) ఆరోపణలు చేస్తుంది. బీజేపీ ఆదేశాలతో రామచంద్ర భారతి (Ramachandra Barathi), సింహయాజి (Simhayagi), నందకుమార్ (Nandakumar) అనే ముగ్గురు వ్యక్తులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభకు గురి చేసి కాషాయ కండువా కప్పుకొనేలా ప్రయత్నించారని ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహరం జరిగింద తెలంగాణలో అయితే..? ఆంధ్రప్రదేశ్ తో లింకులు ఉన్నారాయా..? ముఖ్యంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసేందుకు వెళ్లిన నలుగురిలో సింహయాజి స్వామి బ్యాంక్ గ్రౌండ్ ఏంటి..? ప్రస్తుతం ఈ అంశాలు ఆసక్తికగా మారాయి..
ఏపీ లోని నూతనంగా ఏర్పడ్డ అన్నమయ్య జిల్లాలోని చిన్న మండెం మండలం రామనాథపురం గ్రామంలో జన్మించారు అశోక్. కొన్నేళ్ల క్రితం సొంత గ్రామంలో ఓ ప్రైవేట్ స్కూల్ స్థాపించారు. ఆ ప్రైవేట్ స్కూల్ మొదట పర్వాలేదు అనిపించుకున్నా.. తరువాత నష్టాల బాట పట్టాయి. తీవ్ర అప్పులో కురుకు పోయిన అశోక్ స్కూల్ ను మూసివేసి రాయచోటిలో మరో ప్రైవేటు స్కూలులో టీచర్ గా పని చేస్తూ నారాయణ విద్యా సంస్ధల్లో పిఆర్ఓగా పని చేశారు.
అలా అంచెలు అంచెలుగా ఎదుగుతూ... నారాయణ విద్యా సంస్ధల్లో పిఆర్ఓ స్థాయికి ఎదిగారు. అదే సమయంలో కొందరు బడా నాయకులతో, పారిశ్రామిక వేత్తలతో పరిచయం ఏర్పడి సన్నిహితంగా మారింది. ఇంతలో ఏమైందో ఏమో గాని ఉన్నపళంగా పిఆర్ఓ ఉద్యోగంను రాజీమాన చేసారు. ఆ తరువాత తిరుచానూరు గోశాలలో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరారు. ఇక్కడ కొన్నేళ్ల పాటు ఉంటూ బడా నేతలతో పరిచయం ఏర్పరుచుకున్నాడు.
ఇదీ చదవండి : ఏపీలో ప్రజలకు షాక్.. నవంబర్ 1 నుంచి పాల ధర పెంపు.. అర లీటర్ పై ఎంత పెరిగిందంటే?
వారు వచ్చిన సమయంలో వారికి దర్శనాలు, తీర్ధ ప్రసాదాలు అందజేస్తూ, వారిని మచ్చిక చేసుకున్నారు. మరి కొద్ది రోజులకే గోశాలలో ఉద్యోగం మానేశారు. సీన్ కట్ చేస్తే దాదాపు 10 ఏళ్ల తర్వాత స్వామీజీ అవతారంలో ప్రత్యక్షమయ్యారు. అంతటితో ఆగకుండా సొంత గ్రామంమైన రామనాథపురంలో శ్రీమంత్ర రాజపీఠం ఏర్పాటు చేశారు. ప్రపన్న కరుణాకరన్ సింహయాజి స్వామిగా అవతారమెత్తారు.
తనను తాను పీఠాధిపతి అంటూ స్వయంగా ప్రకటించుకున్నారు. కొందరు వ్యక్తులను మఠంలో ఉంచుకుని మఠంను నడిపించేవారు. సింహయాజీ సొంత గ్రామం అయ్యిన రామనాధంపురంలోనే నరసింహ స్వామి ఆలయాన్ని పునరుద్ధరణ చేయడానికి 10 ఏళ్ల కిందట ప్రయత్నం చేసిన వ్యవహారం బెడిసి కొట్టింది. ఆ ప్రాంతంలో ఎవరూ ఆయన్ని స్వామీజీగా విశ్వసించక పోవడంతో తిరుపతికి మకాం మార్చారు.
ఇదీ చదవండి : సండే సరదాగా చికెన్ తినాలి అనుకుంటున్నారా..? ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి..?
15 ఏళ్లుగా అక్కడే ఓ పీఠంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లకు ఓసారి స్వగ్రామం సొంత రామనాథపురానికి వచ్చి వెళ్తుంటారని ఆ ఊరి వారు చెప్తుంటారు. అయితే ఏపీ మూలలు ఉన్న ఆయన.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల వ్యవహారంలో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన వెనుక ఉన్నది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Telangana, Tirupati, TRS MLAs Poaching Case