ఏపీలో పట్టాలు తప్పిన షిర్డీ ఎక్స్‌ప్రెస్... రైళ్ల రాకపోకలకు అంతరాయం

సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి మరమ్మతు చర్యలు చేపట్టారు. దీంతో అటువైపుగా వెళ్లాల్సిన రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు.

news18-telugu
Updated: December 3, 2019, 10:31 AM IST
ఏపీలో పట్టాలు తప్పిన షిర్డీ ఎక్స్‌ప్రెస్... రైళ్ల రాకపోకలకు అంతరాయం
ఏపీలో పట్టాలు తప్పిన రైలు (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో పెద్ద ప్రమాదం తప్పింది. కడప జిల్లా రైల్వే కోడూరు స్టేషన్‌ వద్ద తిరుపతి-షిరిడీ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఇంజిన్‌ వెనక ఉన్న జనరల్‌ బోగీ పక్కకు ఒరిగిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి మరమ్మతు చర్యలు చేపట్టారు. దీంతో అటువైపుగా వెళ్లాల్సిన రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు.

15 రోజుల క్రితం తిరుపతిలో కేరళ ఎక్స్ ప్రెస్ కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. న్యూఢిల్లీ నుంచి త్రివేండం వెళుతున్న కేరళ ఎక్స్ ప్రెస్ తిరుపతి ఏర్పేడు రైల్వే స్టేషన్ కూతవేటు దూరంలో పట్టాలు తప్పింది. ప్యాంట్రి కార్ భోగి చక్రం విరిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.కేరళ ఎక్స్ ప్రెస్ లోకో పైలైట్ చాకిచక్యంగా ట్రైన్ నిలిపివేయడంతో ప్రమాదం తప్పిందన్నారు. లేదంటే భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేదని రైల్వే పోలీసులు అప్పట్లో తెలిపారు.

First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>